Wednesday, July 25, 2012

ఉద్యమాలకు అగ్ని కణాలై ఎగసిపడాల్సిన అనివార్యత ఉంది



విద్యుత్‌ సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వామపక్ష పార్టీల నాయకులు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం నిర్వహించిన 'చలో సెక్రటేరియట్‌' కార్యక్రమం ఫ్లాప్ అయిందనే చెప్పాలి ...
పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరిత్రాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనతను మూటగట్టుకున్న చరిత్ర వారిది. సాయుధ రైతాంగంలో మడమ తిప్పని ఉద్యమకారులు..........

కాని అదంతా గతం మాట ఇప్పుడు కరేంట్ చార్జీలు తగ్గించాలని విద్యుత్‌ కోతలను నివారించాలని,ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై భారాలు మోపటం తదితర చర్యలను విడనాడాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టిలు చేసిన పోరాటరూపం పేళవంగా సాగింది...భారీగానే జనాన్ని సమీకరించామని చేప్పారు అదీగో వస్తున్నారు ఇదీగో వస్తున్నారంటూ మిడీయా మిత్రులంతా వేయిట్ చేస్తే తీరా అక్కడికొచ్చింది 100 మంది లోపే పోలిసుల బారి బందోబస్తు బాగానే ఆటంకం కల్పించింది ...........

పోలిసు వ్యవస్థ ముందస్తు వ్యుహల్లో పరిణతి చెందింది కాని కమ్యునిస్టులు మాత్రం మరింత తిరోగమణ దిశగా నడుస్తున్నారు. అంబెద్కర్ విగ్రహం దాటి రాఘవులు రాలేకపోయారు.నారయణా అంతే సెక్రటేరియట్ ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్దే అరెస్ట్ అయ్యారు..... ఒక్క CPI ML న్యూ డెమొక్రసి కర్యకర్తలు మాత్రమే లూంబీనీ పార్క్ లో ముందుగానే దాక్కొని విజయవంతంగా సచివాలయం గేట్ వరకు చేరకొని నినాదాల హొరు వినిపించారు...ధర్నాల్లో పాల్గోనేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తిసుకూనే కామ్రెడ్ లు ఎందకో ఇంత డీలా పడిపోయారు....
ఎర్రసైన్యమై కదం తొక్కిన వారసుల్లా ఉద్యమాలకు అగ్ని కణాలై ఎగసిపడాల్సిన అనివార్యత ఉంది. పేదలకు భూములు పంచినా, ప్రజా సమస్యలపై ఎర్రజెండా బావుటా ఎగరేసినా, పెట్టుబడి, సామ్రాజ్యవాదుల్లో వణుకు పుట్టించినా వారికి వారే సాటి. ఇంతటి త్యాగాలు, విశిష్ట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలు, పోరాటాల పట్ల కొడవలి మొద్దు బారకుండా ఎప్పటికప్పుడు పదునుపెట్టి అణగారిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలవాలి............


No comments:

Post a Comment