Monday, July 16, 2012

అవసరమైతే తిహర్ జైల్ కి తిసుకెళ్తారని బావించారు..కానీ....


జగన్‌ ఆస్తుల కేసులో జరిగిన మనీలాండరింగ్‌ పై ఈడీ అధికారుల విచారణ ఒ కొలిక్కి రానుందా?.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఐదుగురు ఈడీ అధికారులు తొమ్మిదిన్నర సమయంలో చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. పది గంటలకు విచారణ ప్రారంభమైంది. జగన్‌ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆరా తీసారు. సాయంత్రం వరకు ఈ విచారణపర్వం కొనసాగింది. అదెవిదంగా శనివారం కూడా జరిగింది
అయితే సీబీఐ విచారణలో నోరెత్తని జగన్ నుంచి ఈడీ అధికారులు అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. శనివారం కూడా కొనసాగిన ఈడీ విచారణలో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి విదేశాల నుంచి పెట్టుబడి ఎంత వచ్చింది.. ఏ పెట్టుబడులు ఎలా వచ్చాయ్.. ఇందులో ఏవైనా అక్రమ పెట్టుబడులు ఉన్నాయా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మలేషియా, సింగపూర్, లగ్జెంబర్గ్ తదితర దేశాల నుండి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ అధికారులు వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. ఎంతో వాడీ వేడిగా విచారిస్తారని , అవసరమైతె తిహర్ జైల్ కి తిసుకెళ్తారని బావించిన వారందరి ఆశలపై నిళ్ళు చల్లినట్లు ఈడీ అధికారులు సైలెంట్ గా తమ పని కానిచ్చి విచారణ చప్పగా సాగుతుందనిపిస్తున్నారని కొంతమంది ఫిల్ అవుతున్నారు పాపం.


No comments:

Post a Comment