Thursday, July 18, 2013

Major Gram Panchayath Details

https://docs.google.com/spreadsheet/pub?key=0AsC2HYPPA3RDdEFueTdha05qQ3FIbjVGdmRWdzlMdGc&output=html

https://docs.google.com/spreadsheet/ccc?key=0AsC2HYPPA3RDdEFueTdha05qQ3FIbjVGdmRWdzlMdGc&usp=sharing

Saturday, July 6, 2013

భూగర్భంలో జివించే మనుషులు........

...వృత్తినె దైవంగా బావించి ప్రాణాలు ఫణంగా పెట్టి భుగర్భంలోకి చోచ్చుకెళ్తారు...సరిహద్దులో సైనికుడి వలె సాహసకృత్యాలు వీరి జివితంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి... వీరి ఆయివునే ఇందనంగా వాడి బోగ్గును ఉత్పత్తిచేస్తున్నారు..వారు కోవ్వత్తిలా కరిగిపోతూ ప్రపంచానికి వెలుతురునిస్తున్నారు...కాని వారి జివితాలె మసి బారుతున్నాయి... బోగ్గు బాయిలే బోందలు అన్నది మొన్నటివరకు ఉన్న మాట కాని ఇప్పుడు అవి స్లో పాయిజన్ ఎక్కించే నరక కూపాలు...మెల్లగా మనిషిని పిల్చుకోని తినెసె రాక్షసగుహలు....
వాయిస్... నిత్యం మన ఇల్లల్లో వెలుతురు ఉండాలంటె వారు చికట్లోకి వెల్లాల్సిందే....మనం ఇంట్లో హాయిగా ఫ్యాన్, ఎసి చల్లదనాన్ని ఆనందించాలంటె వారు ఉక్కపోతలో చమటలు కక్కాల్సాంది...... సిరుల మాగని సింగరేణి...బడుగు జీవుల కల్పవల్లి.. గ్రామీణుల వెలుగు దివ్వె..ఇక్కడి పల్లెల జీవగర్ర.. కొంగుబంగారం..ఆకలి మంటలు తీర్చిన సిరులవల్లి..శ్రామిక జీవన సౌందర్యానికి చిహ్నం....లక్షలాది మందికి అన్నం పెట్టె అగ్గిరవ్వ..నల్లసూరిల్లకు నావాఅయింది..పన్నెండు దశాబ్దాల ఘన చరిత కలిగిన నల్ల బంగారు లోకం.. సిరుల మాగాణి సింగరేణి...పొయ్యి రాల్లే సింగరేనికి పునాదిరాల్లై.ఇంటిల్లిపాది వంట చేసుకుంటుండగా వెలుగు చూసిన నల్లబంగారం నేడు జగమంత కుటుంబాన్ని ఏర్పరుచుకుంది.దినదినాబివృది చెందుతూ నిండు కుండల తోనికిసలాడుతుంది.కాని నల్ల సూరిల్ల శ్రమతో వెలుగుతోన్న ప్రపంచానికి మాత్రం  వారి బాదలు పట్టడంలేదు

...కోన్ని సంవత్సరాలక్రితం వరకు భుగర్బ బోగ్గు గనుల్లో నిత్యం ప్రమాదపు అంచులలో పనులు  జరిగేవి ...ఒక్కోసారి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లోనే సజీ సమాది  అయ్యేవారు...తరువాత టెక్నాలజి పెరుగుతున్న కోద్ది సపోర్టింగ్ అండ్ సెఫ్టి సిస్టమ్ అభివృద్ది చెంది అలాంటి ప్రమాదాలను అరికట్టారు...బోగ్గుగనులు కూలిపోయినప్పడు కార్మక లోకం తో పాటు ప్రపంచమంతా ఆ ప్రమాదం గురించే చర్చ సాగేది...
వాయిస్...ఒక్కసారే జరిగే ప్రమాదం కన్నా ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదాలెన్నో కార్మికులను వేదిస్తున్నాయ...సింగరేణి కార్మికుడలు షిప్ట్ ల వారిగా తమ విధులకు హాజరవుతారు...ఏడుగంటల షిప్ట్ లో వారు ఆరు కిలోమిటర్ల వరకు బోగ్గు గనుల్లోకి దిగాల్సి ఉంటుంది...మ్యాన్ రైడింగ్ మిషిన్ ల పెరుతో నడిపె టబ్ ల లాంటి ట్రెయిన్లు  కిలోమిటర్ కన్నా ఎక్కువ లోపలికి వెల్లలేవు ..ఇలాంటివి మ్యాన్ రైడింగ్ లు అన్ని గనుల్లో  లేవు...ఆరు కిలోమిటర్లు నడిచి ఎడు గంటల డ్యూటి తరువాత తిరిగి గనులనుండి మెట్లు ఎక్కుతూ రావల్సి ఉంటుంది... ఇలా  కిలమీటర్ల మేర భూమి పోరల్లోకి చోచ్చుకెల్లి వారు అక్కడ పడే కష్టాలు ...వారి బాదలు ప్రత్యక్షంగా తెలసుకునే ప్రయత్నం చెద్దాం...

...సింగరేణి బోగ్గు గని కార్మికుడు గనిలోకి దిగాలంటె ముందుగా క్యాప్ ల్యాంప్ తో పాటి ఆరు కిలోల బరువుండె బ్యాటరిని తిసుకోవాలి ...ఇవి లేనిదె గనిలో పనిచేయడం అటుంచి నడవడం కూడా కష్టమే.....విటితో పాటి సింగరేణి సంస్థ ఇచ్చె బూట్లు దరించాల్సి ఉంటుంది ...ఇవి ప్రత్యేకంగా గని కార్మికులకోసం తయారు చేసనవి...బుట్లు చివరలు ఇనుము లాంటి పదార్థం తో చేసనివి ...సాదరణ బుట్లతో పోలిస్తే ఇవి చాలా బురువుతో పాటు అసౌకర్యంగా ఉంటాయి..కాలి వెల్లని నలిపెసెలా ఉంటాయి...ఇవి దరించిన తరువాత ఇక హాజరు వెసె గది ముందు క్యూలో నిలబడి హజరు తరువాత సూపర్ వైజర్లు దగ్గరికెల్లి ఎక్కడ ఎం పని చేయాలో తెలుసుకోని బోగ్గు బాయిలోకి అడుగు పెడతారు...దిగెటప్పడు అక్కడె ప్రతిష్టించుకున్న దేవతా మూర్తుల ఫోటోలకు దండం పెట్టి దిగుతారు...
...అక్కడినుండి దాదాపు రెండు కిలోమిటర్ల వరకు నడిచిన తరువాత అక్కడ మ్యాన్ రైడింగ్ మిషిన్ నడిపె సెంటర్ ఉంటుంది....అక్కడి సెంటర్ లో ఒకె ఒక కార్మికుడు ఆ మిషిన్ ను ఆపరెట్ చెస్తుంటాడు ..దాదాపు ఎనిమిది నుంచి తోమ్మిది గంటల వరకు ఇంకో షిఫ్ట్ కార్మికుడు వచ్చె వరకు ఒంటరిగా భూగర్బంలో ఉండాల్సిందే...ఆ పని గంటలలో ఆయనతో మాట్లాడే మనిషె ఉండరు..మిషిన్ ఆపరెటింగ్ సిగ్నల్స్ తప్ప..బోగ్గు బాయిలోని కార్మికులు బోగ్గును టబ్బులలో నింపిన తరువాత ఇచ్చె సిగ్నల్స్ తో ఇయన ఆ టబ్ ట్రెయిన్ ను ఆపరేట్ చెస్తాడు..
..ఇక్కడి నుండి కిలోమిటర్ వరకు చిన్నపాటి మ్యాన్ రైడింగ్ ట్రెయిన్ లో కార్మికులను తరలిస్తారు...ఇది కేవలం ఒ కిలోమిటర్ వరకు మాత్రమె ఉంటుంది...కార్మికుల సెఫ్టి చూసె సెఫ్టి ఆఫిసర్లు ..సుపర్ వైజర్లు గనుల్లో పర్యవెక్షిస్తుంటారు....గనిలో దాదాపు ఇ ట్రెయిన్ చెరవెసెంత వరకు బయటనుండి చల్లగాలి వస్తుంటుంది...

....మ్యాన్ రైడింగ్ దిగిన తరువాత అక్కడ సౌత్ డిస్ట్రిక్ , నార్త్ డిస్ట్రిక్ అని పిలుచుకునె వెర్వెరు దారులు కనబడతాయి....బోగ్గు నిక్షెపాలు ఉండె ప్రాంతానికి తవ్వుకుంటు తిసిన ద్వారాలు అవి...జియాలాజికల్ ఇంజనీర్లు వేసిన మ్యాప్ ల  ఆదారంగా తవ్వుకుంటూ రూఫ్ పైన సపోర్టింగ్ ఎర్పర్చుకుంటూ వెల్తారు....బోగ్గు గనుల్లో ఎర్పడె ప్రధాన సమస్య భుగర్బ జలాలు...ఇవి బోగ్గు కోసం తవ్వె గనుల్లోకి వస్తుంటాయి...వీటిని బయటకు పంపడానికి బారి పంపులను వాడుతుంటారు..బోగ్గు వెలికితీత తరువాత ఎక్కువ మంది కార్మికులను దినికోసం వాడతారు....దినినుండి వచ్చె నిటిని బయట ఫిల్టర్ చేసి స్థానిక మండలాలకు సరఫరా చెస్తారు...

....మనం సినిమాల్లో చూసినట్టు భుగర్బ గనుల్లో ఎక్కడా లైట్లు ఉండవు..కార్మికుడి తలపై ఉండే హెల్మెట్ పైనె ఉండె లైట్ దాంతోనె గనుల్లో నడవాలి , పనిచేయాలి...ఆరు కిలోల బరువుండె బ్యాటరి సహాయంతో ఇది పని చెస్తుంది...ఇది లెదంటె గనిలో నడవడం అసాద్యమే....నాలుగు కిలోమిటర్ల లోతుకి వెల్లిన తరువాత కొద్ది కొద్ది గా గాలి తగ్గుతుంటుంది...అక్కడికి కొత్తగా వెల్లెవారికి  ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది...అప్పటివరకు వచ్చిన చల్లగాలి ఉండదు...లోతులోకెల్తున్న కొద్ది నేలంత బురదమయంగా ఉండి నడవడానికి విలుగా ఉండదు...
...అండర్ గ్రౌండ్ వాటర్ ను బయటకు పంపే పంపుల వద్ద ఒక్కో కార్మికుడు పనిచెస్తుంటారు...ఇక్కడ ఒంటరిగా షిప్టు మొత్తం ఉండె కార్మికుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పనిచెస్తుంటాడు....ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదైనా జరిగిందని పిలస్తె పలికే నాథుడే ఉండడు...అలాంటి పరిస్థితిల్లోనే వారు రోజు పనిచేయాల్సి ఉంటుంది...విటిని దాటుకొని  నాలుగు కిలోమిటర్ల లోతులో పనులు అసలు బోగ్గు వెలికతీత పనులు జరుగుతుంటాయు....ఇక్కడికి వెల్లాలంటె బురద నేలలో వంగి నడవాల్సిఉంటుంది..ఇలా కిలోమిటర్ల మేర నడుస్తున్న కొద్ద మెల్లగా గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతూ వస్తుంటుంది...నడుస్తుండగానే ఒళ్లంతా చమటలతో తడిసిపోతుంది.... గాలి సరిగా అందక గుండె వేగం పెరిగి ఒత్తిడికి గురవుతారు...ఇలాంటి వాతావరణం మొత్తం రెండు ముడు కిలోమిటర్ల పరిదిలో ఉంటుంది..
...గాలిలో ఆక్సిజన్ శాతం బయట వాతావరణంలో 21 శాతం వరకు ఉంటుంది...ఇది సగటున మనిషికి అవసరమైన మెరకు ఉంటుంది కాని బోగ్గు గనుల్లో అక్సిజన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి....భుగర్బ గనుల్లో 18శాతం వరకు మాత్రమె ఆక్సిజన్ ఉంటుంది...దింతో గనుల్లోని చివరి ప్రాంతంలో పనిచేసె వారికి ఆక్సిజన్ సరిగా అందదు...దింతో అక్కడికి కొత్తగా వెల్లినవారికైతె నిలబడడమె కష్టంగా ఉంటుంది...గుండె పట్టెసినట్టగా మారి పోయె ఒళ్లంతా చమటలు పడతాయి...కాని కార్మికులు మాత్రం అలాంటి వాతావరణంలోనే పని చెస్తున్నారు...అక్కడ ఉండే ఆ కొద్ది పాటి గాలి సైతం కలుషితమైనది గా ఉంటుంది...వెంటిలెటింగ్ సిస్టమ్ ద్వారా పంపె గాలి సైతం అక్కడ ఎమాత్రం సరిపోదు... గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండెసరికి అక్కడ పనిచెసె వారి గుండెపై తివ్ర ఒత్తిడి ఎర్పడుతుంది...కొద్దిసెపటిలో నె అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వారు ఎడు నుంచి ఎనిమిది గంటలు పనిచెస్తున్నారు.....
వాయిస్...ఇక్కడి వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని చూపెందుకు ఎలాంటి ఆదునిక పరికరాలు లేవు  ఒ చిన్న నూనె దిపాన్ని మాత్రమె  వాడుతారు ...ఆ దీపం ఆక్సిజన్ శాతం తగ్గడాన్ని ఆరిపోవడం ద్వారా తెలుసుకుంటుంటారు...కాని భూగర్బం నుండి ఎవైనా విషవాయివులు వెలువడితె కనుక్కోవడానికి ఎలింటి పరికారాలు లేవు కార్మికులు పీల్చుకోవాల్సిందె ...ఇక్కడె సింగరేణి కార్మికులు ప్రదాన సమస్య ఎదుర్కుంటున్నారు.... వారు రోజు విషనాయివులు పీలుస్తూ ఎన్నో అంతుపట్టని రోగాల బారిన పడుతున్నారు   ... ప్రమాదాల్లో జరిగె నష్టానికి వేయిరెట్ల నష్టం బయటప్రపంచానికి  తెలియకుండానే జరుగుతోంది పట్టించుకునే యాజమాణ్యాలు   ప్రమాదాల్లో మరణాలను తగ్గించడంలో సఫలమైన  యాజమాన్యాలు కార్మకులను ఇలా కార్మికులకు స్లో పాయిజన్ ఎక్కిస్తున్నాయి....కార్మికుల సంక్షెమం పెరిట ఎర్పరిచిన సింగరేణి ఆసుపత్రులలో ఇలాంటి పెషంట్లు ఎందరో ఉంటారు కాని ఆసుపత్రి లో వారికి చెసె ట్రిట్ మెంట్ ను గాని...కార్మికులు వరుసగా ఎదుర్కునె ఆరోగ్య సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా చెస్తారు....

.........ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో పనిచెసె కార్మకుల ఆయుప్రమాణాలు తగ్గుతున్నాయి..నలబై , యాబై సంవత్సరాలలోనె విరి మరణానికి దగ్గరవుతున్నారు...సాదారణంగానే గుండెజబ్బులు ఎక్కువవుతున్న కాలం ఇది కాని విరి పరిస్థితి మరింత గోరంగా ఉంది...పదినిమిషాలలోనే గుండె పట్టెసినట్టయ్యే వాతావరణంలో విరు నిత్యం పనిచెయాల్సి రావడం వల్ల విరికి ఎన్నో ఆరోగ్య సమస్యలోస్తున్నాయి...గుండెజబ్బులు ఇక్కడ సర్వసాదారణం అయ్యాయి...పనివాతావరణంతో పాటి యాజమాన్యాలు టార్గెట్ లు పెట్టి మరి పనిచెయిస్తుండడంతో కార్మికులు తీవ్ర ఒత్తడికి గురవుతున్నారు...
వాయిస్..కార్మికులు పనిబారాం ..ప్రతికూల వాతవరణంలో పనిచెస్తుండడంతో విరిలో ఒత్తడి పెరుగుతోంది...దాదాపు తోంబై శాతం మంది తాగుడుకు బానిసలవుతున్నారు....కష్టాన్ని మరిచిపోవడానికి నిత్య మద్యం మత్తులో ఉంటున్నారు...ఇటు పనివాతావరణం...అటు తాగుడు రెండు కలిసి కార్మికుడి ఒంటిని..ఇంటిని గుల్ల చెస్తునాయి...బోగ్గు బాయిలో పనిచెసినంత టైమ్ లో వారు బోజనం చెసె పరిస్థితులుండవు అలా అని బయటకు వచ్చి తినెందుకు ఎర్పాట్లు ఉండవు ఇలా బోజన సరిగా చెయకపోవడం వల్ల కూడా ఆనారోగ్యాలకు గురవుతున్నారు...షిప్ట్ ల వారిగా డ్యూటిలు ఉండడంతో ఒ రోజు రాత్రి ఉంటె మరో రోజు డే లో షిప్ట్ ఉంటుంది ....ఇలా ఇర్రెగ్యులర్ డైటై సైతం వారిని తీవ్ర అనారోగ్యం పాలు చెస్తుందంటున్నారు వైద్యులు....

....ఆక్సిజన్ సరిగా లెకపోవడంతోపాటు అక్కడ ఎలాంటి విషవాయివులు వెలువడుతున్నాయో ఎవరికి తెలియదు ...గనుల్లోని ఆ ప్రాంతాల్లో పని చెసివచ్చె కార్మికులు ఆనారోగ్యానికి గురైనా సింగరేణి ఆసుపత్రిలోనే పరిక్షలు చెస్తారు కాబట్టి విషయం బయటకు వచ్చె అవకాశం లేదు.....దింతో కార్మికులు ఉపిరితిత్తుల  సమస్యల కు గాని ఇతర సమస్యలు గాని బయటకు పోక్కకుండా జాగ్రత్త పడుతుంటాయి యాజమాన్యాలు...గతంలో కోన్ని సంవత్సరాల క్రితం వరకు  కార్మికులు ఎక్కువగా టిబి వ్యాది సోకేదని కాని ఇప్పుడది తగ్గిందని అక్కడి డాక్టర్లు వెల్లడిస్తున్నారు...
....కార్మికులు ఇబ్బందిపడె ప్రధాన సమస్యల్లో కిళ్ళ నోప్పులు ఉన్నాయి...కార్మికులు బోగ్గు బాయిలోకి దిగడం,ఎక్కడం వల్ల కిళ్ల నోప్పుల వస్తున్నాయని కార్మికులు అంటున్నారు...కార్మికలు గనుల్లో ఎడెనిమిది గంటలు పనిచెసిన తరువాత బయటకు నాలుగైదు కిలోమిటర్ల దూరం ఎక్కడం తీవ్ర ఇబ్బందులకు గురిచెస్తుంది ...ఈ నోప్పులు నుండి ఉపశమనం పోందడానికేనంటు చాలామంది కార్మికులు మద్యానికి బానిసలవుతున్నారు....ఇలా పనిప్రాంతంలో తివ్ర ఇబ్బందులెదుర్కుంటున్న సింగరేణి బోగ్గుగని కార్మికులు రోజు విధుల్లోకి హాజరు కావడానికి ఆసక్తి కనబర్చడంలేదు...ఇలా డ్యుటికి ఆబ్సెంట్ అయ్యేవారె ఎక్కువగా కనిపిస్తుంటారు..చాలామంది కార్మకులు ప్రతికూల వాతావరణంలో పనిచెయలెకనో , జబ్బుపడో విధుల్లోకి హాజరుకాలేకపోతున్నారు..దీనితో యాజమాన్యం విరిని తోలగించిన సంఘటనలు కూడా చాలానె ఉన్నాయి....విటిని సరైన పద్దతుల్లో పరిష్కరించే ప్రయత్నం చెయడం కన్నా ఉత్పత్తి మీదై టార్గెట్ పెట్టింది యాజమాన్యం.... సూపర్‌వైజర్లు, ఈపీ ఆపరేటర్లు, టెక్నీషియన్లకు సరైన  శిక్షణ ఇస్తునే. నడిచే యంత్రాలపై శిక్షణ, ఆరోగ్యం, భోజన అలవాట్లు, ఇంధన పొదుపు, యోగా, మెడిటేషన్ వంటి క్లాసులు అదనంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

...కార్మికుల సమస్యలు ఒ వైపు ఇలా ఉంటె  యాంత్రీకరణకు సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తోంది. ఇంతకుముందు వరకు తట్ట, చెమ్మస్‌తో పనిచేసే కార్మికులకు శిక్షణ ఇస్తుండే సంస్థ ఇప్పుడు యంత్రాలపై కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందు కోసం రామగుండం-2 ఏరియాలో ఏర్పా టు చేసిన యూఎంటీఐ(అండర్‌గ్రౌండ్ మిషన్‌మైనింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్) చెసింది..

... అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లోని యం త్రాలపై పనిచేసే కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు . భూగర్భ గనుల్లో ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ, రోడ్‌హెడర్స్, లాంగ్‌వాల్, రూఫ్‌బోల్టర్స్, కంటిన్యూయస్‌మైనర్, పంపింగ్, హాల ర్స్ తదితర యంత్రాలను వినియోగిస్తున్నారు. ఆధునికీ కరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితె..
సింగరేణిశిక్షణ ఇచ్చె యూ ఎంటీఐలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. శిక్షణ పొందే ఉద్యోగుల అవసరాలను బట్టి నిపుణులను ఎప్పటికప్పుడు బయట నుంచి పిలిపించాల్సి వస్తోంది. పది మంది అధికారు లు ఉండాల్సిన స్థానంలో కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. శిక్షణను విస్తరించేందుకు రోడ్‌హెడర్, ఏఎం-50, కన్వేయర్ యంత్రాలు సమకూర్చాలని, ఓసీపీ కార్మికుల కు ప్రత్యేక శిక్షణ ఇచ్చే సిమ్యూలేటర్(కంప్యూటరైజ్డ్ శిక్షణ) యంత్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని స్థానిక అధికారులు గుర్తు చేస్తున్నారు....సింగరేణి బొగ్గు గనుల్లో సుమారు 80.91 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ఇలా ఉంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దక్షిణ భారత దేశంలోని బొగ్గు ఆధారిత పరిశ్రమలకు సింగరేణి కొంగు బంగారంగా నిలుస్తుంది. ఉత్పత్తి సాధించిన బొగ్గులో విద్యుత్‌ రంగానికి 78 శాతం, సిమెంట్‌ రంగానికి 13 శాతం, బొగ్గు సరఫరా చేయడం జరుగుతుంది. 1997లో సంస్కరణల ఫలితంగా వరుస లాభాలను అర్జిస్తూ 2003 సంవత్సరం నుండి వచ్చిన నికర లాభాల నుండి వాటా కల్పించిన ఘనత సింగరేణిదే. 1948లో షెటిల్‌కార్‌ యంత్రాలను ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో భూగర్బ గనుల్లోకి ప్రవేశపెట్టి యాంత్రికీకరణకు ప్రోత్సహించింది. 1951 ఎలక్ట్రికల్‌ కోల్‌ డ్రిల్‌ను, 1953లో ఎలక్ట్రికల్‌ క్యాప్‌ ల్యాంప్‌, 1964లో ప్రెమ్‌ ఫ్రూఫ్‌, 1975లో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌లు, 1979లో సైడ్‌ డంపులోడర్‌, 1981లో ఎల్‌హెచ్‌డి, 1983లో ఆధునీకరించిన లాంగ్‌ వార్‌యంత్రాల వినియోగంలోకి వచ్చింది. 1986లో ఆధునీకరించిన డ్రాగ్‌ లైన్‌, 1989లో ఓసి1లో హాకింగ్‌, డ్రాగ్‌లైన్‌ బిజి టెక్నాలజీలను వినియోగిస్తూ వచ్చారు. 2006లో నిరంతరంగా మైన్లను ప్రవేశపెట్టింది. సాంకేతిక యంత్రాలను పట్టించేందుకు యాజమాన్యం బృహత్తర ప్రణాళిక సిద్దం చేస్తుంది. గత 50 సంవత్సరాలలో 1 లక్ష 20 వేల మంది కార్మికులకు గానూ 60 వేలకు కుదించడం జరిగింది. సిరుల మాగాని సింగరేణి సంస్కరణల ఫలితంగా కొన్ని బ్లాకుల్లో మూసివేతకు దారి తీసి ఇక్కడి ప్రాంతాన్ని బొందల గడ్డలుగా మార్చివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు...

... సింగరేణి కాలరీస్‌ కంపెనీ దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగ అభివృద్ధికి, వెనుకబడిన ప్రాంతాంలో అభివృద్ధికి సింగరేణి ప్రధాన వనరుగా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ, పన్నులరూపంలో చెల్లి స్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో సింగరేణి ప్రధాన భూమిక పోషిసున్నది. సుమారు 3953 భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల వారికి సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతావనిలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి విద్యుత్‌ వెలు గులు అందించడానికి ఆధారం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గే అంటే అతిశయోక్తికాదు. ఒక్కమాటలో చెప్పాలంటే సింగరేణి సంస్థ,  సిరులతల్లిగా కీర్తి గడించింది. శతాబ్ధాల చరిత్రకలిగిన సింగ రేణి విదేశి సంస్థలకు దీటుగా తన ప్రత్యేక తను చాటుకొంది. గోదావరి పరీవాహక ప్రాంతాంలో అపార బొగ్గు నిక్షేపాలున్నట్లు కనుగొంది మొదలు..ఇంతింతై వటుడింతై.. అన్న రీతిలో సింగరేణి విస్తరిస్తోంది. డాక్టర్‌ కింగ్‌ భూగర్భ సర్వేతో 1871లో ఖమ్మం జిల్లా ఇల్లెందులో వెలుగుచూసిన బొగ్గు గుట్ట... 1886లో 'దిహైదరాబాద్‌ (డక్కన్‌) కంపెనీ లిమిటెడ్‌' పేరుతో తవ్వకాలు ప్రారంభిం చింది. 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా పేరుమారి ఈ దాదపు 92 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో సింగరేణి ఎన్నో మైలురాళ్లను దాటింది. 1928లో బెల్లంపల్లిలో బొగ్గుగను లను ప్రారంభించి, 1937వరకు దశల వారీగా కొత్తగూడెంకు విస్తరించింది. అయితే 1949లో నిజాంసర్కార్‌ నుంచి..సింగరేణి సంస్థ పూర్తిగా మనరాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 1956లో కేంద్రప్రభుత్వం.. తన వాటాను 51శాతంగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ను 49 శాతంగా నిర్ధేశించడం జరిగింది. 1961లో మందమర్రి, రామగుండం, శ్రీరాం పూర్‌ బొగ్గుగనులు వెలువడగా, 1975లో మణుగూరు, 1991లో భూపాల్‌పల్లి ప్రాం తాల్లో బొగ్గు ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తాడిచెర్ల బొగ్గుగనులు ప్రారంభిం చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. భూగర్బ, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో పనిచేయటం ప్రమాదంతో కూడుకున్న పని, అయినా సింగ రేణి యాజమాన్యం 'రక్షణతోపని.. కుటుం బపు గని' అనే నినాదంతో ముందుకెళ్తున్నది. ఒకప్పుడు ఏడాదికి లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన గనులు ఇప్పుడు 55 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రానికే కంఠాభరణంగా విలసిల్లిన సింగరేణి సుమారు 70వేల మంది కార్మికులకు ఉపా ధిని కల్పిస్తూ, కోల్‌ ఇండియా కంపెనీల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి ఓ చరిత్రను లిఖిం చింది. ఓవైపు కార్మికులు..మరోవైపు కోల్‌బెల్ట్‌ ప్రజల సంక్షేమానికి అనునిత్యం పాటు పడుతోంది. అంతేగాక విద్యుత్‌ రంగ సం స్థలు, పవన విద్యుత్‌పైనా దృష్టిసారించింది. విదేశీ సంస్థలకు దీటుగా నిలుస్తూ, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిలో తన ఆధిపత్యాన్ని చాటు తోంది. అలాగే ఓపెన్‌ కాస్టు గనులను నెల కొల్పుతుంది. రెండు దశాబ్ధాల క్రితం వరకు నష్టాల్లో ఉన్న సింగరేణి, అనేక కష్టనష్టాలకు ఓర్చి 1993-94లో 17.76కోట్లు, 1994-95లో 26.64 కోట్ల లాభాలను ఆర్జించి బీఐఎఫ్‌ఆర్‌ పరిధి నుంచి బయటపడింది. 2002లో సంస్థ లాభాలను ఆర్జించి ఐదు శాతం కార్మికులకు లాభాల బోనస్‌గా ప్రక టించింది. గతంలో సింగరేణి ప్రభుత్వరంగ యంత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించక పోవడం, బొగ్గు ధరల నియంత్రాణాధికారం భారత ప్రభుత్వం చేతిలో ఉండటంతో, ఉత్పత్తి ఖర్చు పెరిగినా, బొగ్గు ధరను పెంచే అవకాశం సంస్థ చేతిలో ఉండేదికాదు. ఎప్పు డైతే ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చిందో.. సింగరేణి సంస్థ లాభాలబాట పట్టింది. ఈ యంత్రాల ప్రవే శంలో యాజమాన్యం కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది.
.. 1998లో కార్మిక సంఘాలకు ఎన్ని కలు నిర్వహించి, సంస్కరణలు చేపట్టి అనేక సత్ఫలితాలను సాధించింది. కాగా, 2000 సంవత్సరంలో లక్షా 20 వేల మంది కార్మికు లకు 'గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్‌' ఇచ్చింది. ప్రస్తుతం దాదాపు 70 వేల మంది కార్మికులు గనుల్లో పనిచేస్తుండగా, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా మరో 20వేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. ఓ వైపు అధునాతనపరిక రాలు, మరోవైపు నిర్వహణఖర్చు వృథా తగ్గించడం... ఉత్పత్తి, ఉత్ఫాదకతలను పెంచడం, పొదుపు చర్యలు చేపట్టడంతో సంస్థ లాభాలలో కొన సాగుతున్నది. ఖరీదైన బొగ్గుకు తోడు, కార్మి కుల అంకితభావం, కష్టించే తత్వం కార ణంగా చిన్నస్థాయిలో ప్రారంభమైన సింగరేణి కంపెనీ నాలుగు వేల కోట్లు టర్నోవర్‌ చేసే స్థాయికి ఎదిగింది. జగతికి వెలుగునందిస్తున్న 'నల్లబంగారు సిరులొలికించే సిరుల తల్లి సింగరేణి'గా ప్రస్తుతింప బడుతుంది. సింగ రేణి ఉత్పత్తి చేసిన బొగ్గును జెన్‌కోతో పాటు, ఇతర విద్యుత్‌రంగ సంస్థలకు అందిస్తోంది. అలాగే పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపు కోసం సింగరేణి సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆవార్డులు అందించాయి.
.. స్వంత లాభాలు, అభివృద్ధి తప్ప నిర్వాసితుల యోగ క్షేమాలు పట్టనట్లు వ్యవహారిస్తుంది. యాంత్రీకరణ పేరుతో ఉద్యోగాలను తగ్గించి ఓసిల విస్తరణ పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. నిర్వాసిత కుటుంబాల యువకులకు చిన్న ఉద్యోగం కూడా ఇవ్వడంలేదు. పారిశ్రామికంగా సింగరేణి దేశంలో ప్రధానమైన సంస్థగా ఎదిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళ్తోంది. అదే విధంగా దేశంలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయింది. దీని ఫలితంగా సింగరేణికి స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

..ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కంపెనీ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను కార్మికులు సాధించినా యాజమాన్యం మాత్రం వారికి లాభాల వాటా ప్రకటించడంలో తాత్సారం చేస్తోంది. ఈ తంతు ప్రతి యేటా కొనసాగుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల విషయంలో సంస్థ చేసిన ప్రకటన స్పష్టత లేకుండా పోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసి 45 రోజులు గడిచినా నేటికీ కంపెనీ లాభాలు ప్రకటించలేదు. కష్టానికి న్యాయంగా దక్కాల్సిన ఫలితాన్ని సాధించుకోవడం కోసం కార్మికులు పోరాటాలకు దిగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.


..సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌ను 25 శాతం చెల్లించాలని గత ఏడాది నుంచే డిమాండ్ చేస్తున్నారు. అయితే యాజమాన్యం 2011-12 సంవత్సరం లాభాల్లో 17 శాతం వాటాతో సరిపెట్టింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కార్మిక కుటుంబాల ఆర్థిక అవసరాల రీత్యా 2012- 13 ఆర్థిక సంవత్సరం లాభాల్లో 25 శాతం వాటా చెల్లించా లని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి గుర్తిం పు, ప్రాతినిధ్య సంఘాలు సమా యత్తమవుతున్నాయి.
వాయిస్....12 ఏళ్లలో పెరిగింది ఏడు శాతమే 1999-2000 ఆర్థిక సంవత్సరంలో మొదటగా 10శాతం చెల్లించిన లాభాల వాటా దశాబ్ద కాలం దాటినా పెరిగింది ఏడు శాతమే. ప్రారంభం నుంచి లాభాల వాటా వివరాలను పరిశీలి స్తే.. 1999-2000, 2000-01, 2001-02లో 10శాతం, 2002-03లో 11శాతం, 2003-04, 2004-05, 2005-06లో 12శాతం, 2006-07లో 15 శాతం, 2007- 08, 2008-09, 2009-10, 2010-11లో 16శాతం, 2011-12లో 17శాతం లాభాల వాటా చెల్లించింది.
...దశాబ్దానికి పైగా గని కార్మికులు లాభాల వాటా పొందడాని కి సర్ఫేస్‌మైనర్ యంత్రం రాక కారణం కావడం గమనార్హం. ఇల్లెందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లో కార్మికుల సంఖ్యను కుదించేందుకు 2000-01 ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం సర్ఫేస్‌మైనర్ యంత్రాన్ని ప్రవేశ పెట్టింది. కార్మిక సంఘాలన్నీ ఒక్కటై సింగరేణి వ్యాపితంగా నిరవధిక సమ్మెను చేపట్టాయి. లాఠీ చార్జీలు, అరెస్టులు, నిర్బంధాలు, బంద్‌లతో ఏరియాలన్నీ అట్టుడికాయి. ఆందోళనలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దిగివ చ్చాయి. సర్ఫేస్ మైనర్‌ను వెనక్కి పంపలేదు కానీ కార్మికుల కు కంపెనీ లాభాల్లో వాటా(బోనస్) ఇవ్వడానికి అంగీకరిం చాయి. దీంతో 1999-2000 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులు లాభాల వాటా పొందుతున్నారు.
..సింగరేణి సంస్థ 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన 53.1 మిలియన్ టన్నుల బొగ్గును కార్మికులు ఎంతో శ్రమకు ఓర్చి సాధించా రు. గత ఏడాది లాభాలలో 25 శాతం వాటా ఇప్పిస్తామని నమ్మించి  17 శాతంతో సరిపెట్టింది. ఈ ఏడాది 25 శాతం లాభాల వాటా ఇప్పించేందుకు కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.... ప్రస్థుతం కార్మికులు కోరుతున్న వాటిలో ప్రధాన డిమాండ్ తమ జీతలనుండి ఇన్ కం ట్యాక్స్ కట్ చేయేద్దని ...సరహద్దులో సైనికుల వలె పని చెస్తున్న తమకు కూడా ఆదాయపు పన్ను మినహాయించాలని వారు కోరుతున్నారు...