Sunday, July 29, 2012

తెలంగాణ ఇస్తే సమస్యలు...... మరి ఇవ్వకపోతే?




తెలంగాణ ఇస్తే నదీ జలాల కొట్లాటలు జరుగుతాయని భౌగోళిక సమస్యలు వస్తాయని కేంద్రం భయపడుతోందని, అందుకే తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా లెదంట ...మరి తెలంగాణ ఇవ్వకపోతే నష్టాలేం లేవా గొడవలేం జరగవా.. అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ను సమస్య పరిష్కార కోణంలో కాకుండా, ఓట్ల రాజకీయ కొణాల్లోనే వాడుకుంటున్నాయి...... అపరమెధావుల్లా అధిరకారాన్ని ఎంజాయ్ చెస్తున్న ఢిల్లీ నేతలకు ఇ సమస్య పరిష్కారానికి సమయమే దొరకడంలేదా..రాష్ట్రం మొత్తం రణరంగం అవుతున్నప్పుడల్లా తాత్కాలికంగా ఆపడానికేన్నో తాంత్రిక విద్యలు ఢిల్లీనుంచే అమలుచెస్తు సద్దుమనిగించే వారికి శాశ్వత పరిష్కారమే దోరకడంలెదా ..ఓ సారి తెలంగాణ ఇస్తామని ఓ సారి కాదని మరోసారి చర్చ జరగాలని గందరగోళం క్రియెట్ చెస్తున్నారు...ఎందుకిదంతా ?
విభజించకపోతే సమస్యలు రావని ఎవరైనా చెప్పగలరా.. ఒకప్పుడు చెన్నారెడ్డి ని కోన్నారు తరువాత KCR వచ్చాడు , ఇయనగారినీ ఒప్పిస్తే కొన్నాల్ల తరువాత మరో నేత ఇదే వాదాన్ని బుజానెత్తుకోని బయలుదేరుతాడు ఇలా ఎంతమంది ఎన్నేల్లు..తరానికో నేత రెచ్చగోడతాడు వందలు వేల మంది విద్యార్ధులు చచ్చిపోతారు దీనికి అంతమేలేదా.........ఉంటే దాన్నిఎవరు చూపాలి? ముమ్మాటికే ఢిల్లీ పెద్దలే... వారిని ఆ దిశగా నడపాల్సింది రాష్ట్ర నేతలే విరిరువురుని ఆ దిశగా నడపాల్సింది వారికి ఓట్లేసే ప్రజలే ...................


Saturday, July 28, 2012

ఇంతకీ సియమ్ పదవి ఉంటుందా ..ఊడుతుందా.....



గత కొన్నిరోజులుగా అటు రాజకీయవర్గాల్లో ఇటు మిడియాలో పెద్ద చర్చే సాగుతుంది. కనీసం మంత్రి పదవైనా అనుబవించకుండా ముఖ్యమంత్రైన కిరణ్ టెన్షన్ పడుతున్నాడోలేదోగాని ఆయనగారిని దించడానికి అసమ్మతి నేతలు బాగా టెన్షన్ పడుతున్నారు..ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివిధ కార్యక్రమాలకు సంబంధించి వేగం పెంచినట్లు కనబడెలా ప్రచారం చెయించుకుంటున్నాడు.ఇందుకోసం టాప్ చానల్ లలో స్లాట్స్ కోని న్యుస్ ఐటమ్స్ లాగా వెయించుకుంటున్నాడు...నత్త నడకకి ప్రతిరూపంగా వుండే కిరణ్ వేగం పెంచాడని ఆ చానల్లలో ప్రచారం మాత్రం ఊపందుకుంది.

CM పేషీలో ఫైళ్లు పేరుకు పోతున్నాయి బాబో అని మొత్తుకుంటుంటే ఆయనగారి వెగం పెరిగిందనే ప్రచారవేగం మాత్రం పెరుగుతోంద . ఓ వైపు కలంకిత మంత్రుల విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు సినియర్లు ఇయన గారిపై అధిష్టానానికి జగన్ తో అక్రమసంబందాన్నిచూపుతు ఫిర్యాదులు, మౌనదీక్షలు అంటూ హడావిడి మొదలుపెట్టారు. ఉన్న పధకాల అమలకే దిక్కులేదు మొర్రో అంటుంటే కోత్త పధకాలతో ముందుకు పోతున్నాడనే ప్రచారం మొదలైంది. కిరణ్ కుమార్ రెడ్డి CM అయి పోడిచిందేంటి దిగిపోతే పోయేదేంటో అర్ధంకావడంలేదు జనానికి


Thursday, July 26, 2012

మహేష్ బాబు ట్విట్టర్ లో ...........






సుపర్ స్టార్ కృష్ణ మనవరాలు ప్రిన్స్ మహేష్ బాబు కుతురు పెరును తన ట్విట్టర్ లో" సితార" అని ప్రకటించారు మహేష్ .... సితార పుట్టింది మొదలు వార్తల్లోకెక్కింది. మనం ఇదువరకే చర్చించుకున్నట్టు మహెష్ ఆ పాప పేరు ప్రకటించడాన్ని న్యుస్ చేసేశారు మన వెబ్ సైట్ రిపోర్టర్ లు...మహేష్ తన అభిమానులను డైరేక్ట్ గా పలకరించేందుకు ట్విట్టర్ ను గత రెండేళ్ళుగా వాడుతున్నాడు.. మిడియా ప్రదర్శించే అత్యుత్సాహాన్ని అస్సలు ఇష్టపడని ప్రిన్స్ వాటివనుండి మొదటునుంచి దూరంగా ఉంటాడు. మహేష్ కి సంబందించిన వార్తలను పబ్లిష్ చేస్తూ ప్రస్తుత మార్కేట్లో మాంచి వ్యాల్యు ఉన్న మహేష్ ద్వారా ప్రెక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు .

కాంగ్రెస్ పార్టికో టీవి చానల్ కావాలంట ..........



ప్రభుత్వ పథకాలను పటిష్టపరుస్తూ వాటిని కాంగ్రెస్‌ పార్టీ పథకాలుగా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటె మాకో టీవి
పేపర్ కావలని ఆ పార్టినేతలు అబిప్రాయపడుతున్నారు....అన్ని పార్టిలకూ తలా ఒకటి విలైతే రెండు చానల్లు, పెపర్లు
మెయింటేన్ చెస్తుంటె మనం మాత్రం వెనకబడిపోయమని ఫిలైపోతున్నారు. ఇ లెక్కలో TDP ముందుంటుంది.

రాష్ట్రంలో ప్రధాన పెపర్లు, రెండు ముడు చానల్ లు ఆ పార్టి సోంతం ఇది జగమెరిగిన సత్యం. ఇవే కాకుండా ఎపి నేం1
చానల్ కూడా బాబు గారికి వ్యతిరేఖంగా పల్లేత్తుమాట అనదు... మిడియా మెనేజ్మెంట్లో బాబు గారిదే పై చెయి..
తమకంటూ ఉన్న ఓ పెపర్ తో బండిలాక్కోస్తున్న కమ్యునిస్టులు సైతం ప్రజలకు చెరువవ్వాలంటే మాకో చానల్
కావలని నిర్ణయించేసుకున్నారు త్వరలో అది రాబోతుంది కూడా...... TV10 అనే పేరు ప్రచారంలో ఉంది.
ఇక TRS సంగతి సరేసరి తెలంగాణ కోసం చానల్ అంటూ T News ను విజయవంతంగా నడుపుకుంటుంది. ఇలా ఎవరికి
వారు తమ గళాన్ని వినిపించుకుంటున్నారు. అటూ BJP సైతం చానల్ పెట్టాలా అని ఆలోచించుకుంటూ కాలం
గడిపేస్తుంది .

ఇక మిగిలింది కాంగ్రెస్ గతంలో వారికొసమే అంటూ ఊరించి, ఊదరగోట్టిన సాక్షి చివరికి ఆ కాంగ్రస్

కంట్లోనలుసైంది,పక్కలో బల్లెంలా తయారైంది....అందుకే మాకూ ఓ చానల్ కావాలనుకుంటున్నారు .....కాని కాంగ్రెస్

చానల్ పెడితే దాన్ని నడిపే వారెవరు ....ఇపుడున్న గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ తరపున అందుకు నడుం

కట్టేదెవరు.ఆ తర్వాత నిలబడేదెవరు? అంతర్గత ప్రజాస్వామ్యమే ఆయివుగా బతికే పార్టికి ఇలా ఓ సంస్థను నడిపే

సత్తా ఉంటుందనేది ప్రశ్నార్ధకమే..
పెపర్లు, చానల్లు పెడితే ఎన్నికల్లో గెలిచేస్తారా ,వాటిల్లో ప్రచారం చెస్తే ప్రజలు నమ్మేస్తారా అలాగైతె ఇన్ని పెపర్లు ,

టీవిలను వెనకేసుకున్న బాబు గారిని ప్రజలెందుకు నమ్మడంలేదు.ప్రసార సాదనాలున్నంత మాత్రాన అంతా

అయిపోయితుందా.





విజయమ్మ పార్టికి ప్రచారం చేస్తుందా? మతానికా?



మత ప్రచారాలు కొత్త పుంతలు తోక్కుతున్నాయి...బడి,గుడి అనిలేదు..పల్లే పట్నం అన్న పట్టింపులేదు ఆకరికి
రాజకీయల్లో సైతం మెమున్నామంటూ వెకిలి వెశాలు వెస్తున్నాయి.మొన్నిమద్య ఓ నయా నాయకురాలి చెతిలో
బైబిల్ దర్శనమిచ్చి మరోసారి చర్చ్ మతాల చర్చకు దారితిసింది. ఆమె క్రిస్టియనే కావచ్చు అది ఆమె వ్యక్తిగతం కాని

హజరై ప్రసంగించింది మాత్రం పబ్లిక్ మిటింగ్ మత విశ్వాసానికి గుర్తుగా నిలిచే బైబిల్ ను చేతబట్టుకుని విజయ

ఎందుకు టూర్ చేస్తున్నారు? అంతేకాక, మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు చేతితో పట్టుకుంటున్నారన్నదే ప్రధాన చర్చ.
అక్కడికి వచ్చినవారికి టివిల్లో చుస్తున్నవారికి ఇ చర్య ద్వారా YSవిజయ ఎం సందేశం ఇస్తున్నారు.దేనికి ప్రచారం

చెస్తున్నారు పార్టికా మతానికా లేదా రాజకీయ ముసుగులో మత మార్పిడికా
సెక్యులర్ వ్యవస్థలో నేతలు ఆయా మతాల ప్రార్ధన మందిరాలకు వెళ్లవచ్చు.కాని ఒకే మతానికి చెందిన గ్రంధాన్ని పట్టుకుని తిరిగితే వ్యతిరేక సంకేతాలు ఇస్తుంది . విజయ తన బైబిల్ రహస్యం గురించి ఎం సమాదానం చెప్తారు..





Wednesday, July 25, 2012

ఉద్యమాలకు అగ్ని కణాలై ఎగసిపడాల్సిన అనివార్యత ఉంది



విద్యుత్‌ సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వామపక్ష పార్టీల నాయకులు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం నిర్వహించిన 'చలో సెక్రటేరియట్‌' కార్యక్రమం ఫ్లాప్ అయిందనే చెప్పాలి ...
పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరిత్రాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనతను మూటగట్టుకున్న చరిత్ర వారిది. సాయుధ రైతాంగంలో మడమ తిప్పని ఉద్యమకారులు..........

కాని అదంతా గతం మాట ఇప్పుడు కరేంట్ చార్జీలు తగ్గించాలని విద్యుత్‌ కోతలను నివారించాలని,ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై భారాలు మోపటం తదితర చర్యలను విడనాడాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టిలు చేసిన పోరాటరూపం పేళవంగా సాగింది...భారీగానే జనాన్ని సమీకరించామని చేప్పారు అదీగో వస్తున్నారు ఇదీగో వస్తున్నారంటూ మిడీయా మిత్రులంతా వేయిట్ చేస్తే తీరా అక్కడికొచ్చింది 100 మంది లోపే పోలిసుల బారి బందోబస్తు బాగానే ఆటంకం కల్పించింది ...........

పోలిసు వ్యవస్థ ముందస్తు వ్యుహల్లో పరిణతి చెందింది కాని కమ్యునిస్టులు మాత్రం మరింత తిరోగమణ దిశగా నడుస్తున్నారు. అంబెద్కర్ విగ్రహం దాటి రాఘవులు రాలేకపోయారు.నారయణా అంతే సెక్రటేరియట్ ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్దే అరెస్ట్ అయ్యారు..... ఒక్క CPI ML న్యూ డెమొక్రసి కర్యకర్తలు మాత్రమే లూంబీనీ పార్క్ లో ముందుగానే దాక్కొని విజయవంతంగా సచివాలయం గేట్ వరకు చేరకొని నినాదాల హొరు వినిపించారు...ధర్నాల్లో పాల్గోనేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తిసుకూనే కామ్రెడ్ లు ఎందకో ఇంత డీలా పడిపోయారు....
ఎర్రసైన్యమై కదం తొక్కిన వారసుల్లా ఉద్యమాలకు అగ్ని కణాలై ఎగసిపడాల్సిన అనివార్యత ఉంది. పేదలకు భూములు పంచినా, ప్రజా సమస్యలపై ఎర్రజెండా బావుటా ఎగరేసినా, పెట్టుబడి, సామ్రాజ్యవాదుల్లో వణుకు పుట్టించినా వారికి వారే సాటి. ఇంతటి త్యాగాలు, విశిష్ట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలు, పోరాటాల పట్ల కొడవలి మొద్దు బారకుండా ఎప్పటికప్పుడు పదునుపెట్టి అణగారిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలవాలి............


Tuesday, July 24, 2012

క్రిస్టియన్ ఉద్యోగులు ఏసుడే దేవుడంటూ ప్రచారం మొదలుపెట్టి అడ్డంగా దొరికిపోయారు


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం అందుకేనేమొ క్రైస్థవులు కన్నేసారు. ఇప్పటికే లెక్కలెనన్నిసార్లు ఎడుకోండలేక్కి ప్రచారమంటూ అపచారపు పనులు చెస్తునే ఉన్నారు. తాజాగా ఈశ్వరయ్య.యశోదమ్మ,కృష్ణమ్మ అనే ముగ్గురు హిందూ దేవుళ్ళ పేర్లుగల క్రిస్టియన్ ఉద్యోగులు ఏసుడే దేవుడంటూ ప్రచారం మొదలుపెట్టి అడ్డంగా దొరికిపోయారు.ఇలాంటివి తరుచుగా జరుగుతుంటే హిందూ మతస్థుల మనోబావాలు దెబ్బతింటాయి ఇలాంటివారిపై కోన్ని వర్గాలు కక్ష పెంచుకోనే అవకాశం ఉంది దింతో మతసామరస్యత దెబ్బతినే అవకాశమూ లేకపోలెదు...
తమ మత వ్యాప్తికోసం ఏ మతం చెయని పనులెన్నో కూడా క్రైస్థవులు చెస్తుంటారు .ఉర్లల్లో దళితులను అగ్ర కులాలు వెదించినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకొని వారిని క్రిస్టియమ్ తిర్థం పుచ్చుకునేలా చెస్తారనేది జగమెరిగిన సత్యం. అనారోగ్యంగా ఉన్నవారిని మా దేవుడే కాపాడుతాడంటూ వారిలో కలుపుకుంటారు ఇలా ఇప్పుడు ప్రతి పల్లేలో కోనసాగుతోంది . కోన్ని గ్రామాల్లో కనీసం 500 జనాబాలేని ప్రాంతాల్లో 2 నుంచి 3 చర్చ్ లు వాటిల్లో ఓ ఐదారుగురు ఫాస్టార్ లు కోలువుతిరి మత వ్యాప్తి జరుపుతున్నారు ఇదంతా కాదనలెము కాని ఇతర మతస్థుల దేవాలయాల్లో ప్రచారమంటూ చేయడమంటే అది పాడుపనే . అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎదైనా చెయచ్చు కాని కొన్ని హద్దులంటూ ఎడ్చాయి వాటిని దాటడం నేరమే...

సిరిసిల్ల టూర్ లో YS విజయ కోల్పోయిందేంటి? సాదించిందెంటి?




చేనేత దీక్ష పేరుతో విజయ చెపట్టిన తెలంగాణ యాత్రకు అడుగడుగునా తెలంగాణ వాదులు అడ్డుతగిలే ప్రయత్నం చెసినా బారిబలగాలతో బాగానే కట్టడి చెశారు.తెలంగాణలో ప్రత్యెకవాద సెంటిమెంట్ తో పోలిస్తే ysవారి సింపతి అయింటిమెంట్ అస్సలు పనిచెయదన్నది జగనెరిగిన సత్యం అందుకే మొన్నటి ఉపఏన్నికల్లో kcrతో మిలాకత్ అయ్యారని టాక్ వచ్చినా సరేఅని తెలంగాణలో
పోటినుండి తప్పుకున్నాడు పోటీచేస్తే ఓడిపోవడం కాయమని డిసైడ్అయి సైడ్ అయ్యాడు. CBI దాడి , ED వేడి, జగన్ అరెస్ట్ పరిణామాలతో తెలంగాణలో సైతం రాజుగారి ఫ్యామిలికి సింపతి ఎర్పడింది పాపం ఓంటరయ్యాడు అని అనడం వినిపించింది. అటు ఆంద్రలో జగన్ ఇటు తెలంగాణలో KCR అనుకున్నారంతా........ TDP తో పోలిస్తే YSRCP నయం అన్నారంతా...


కాని ఈ టూర్ తో సీన్ రివర్స్ అయింది పోలిసుల ఓవరాక్షన్ , YSRCP కార్యకర్తల వీరంగం తెలంగాణ వాదుల్లో నెగిటివ్ ఫిలింగ్స్ నింపాయి... జీప్ ఎక్కి నిరసణ తెలిపిన మహిళను తోసేయడం, విద్యార్థులను చితకబాదడం టివిల్లో చూసిన తెలంగాణ వాదులు ఎలా ఆలోచిస్తారు ..మొన్నటివరకు YS విజయ పై ఉన్న సింపతిపోయి వ్యతిరెఖత ఎర్పడ్డానికి ప్రధాన కారణాలుగా ఇలాంటివే అవుతాయి. విజయ టూర్ లో ఆమె ట్రూప్ చెలరేగిపోవడం భావోధ్రేకాలు రెచ్చగోట్టడం మాకెంతో మేలు చెస్తుందని TRS లోని ముఖ్య నేత ఓకరు ఆఫ్ ధి రికార్డ్ మాట్లాడుతూ చెప్పారు. ఇలా టీ ప్రజల సింపతీని YS ఫ్యామిలి కోల్పోయినట్టయింది


ఇక సాదించిందేదైనా ఉందంటే KCR తనయిడి ఇలాకాలో అనుకున్నవిదంగా దీక్ష నిర్వహించడం దిని ద్వారా తమ సత్తాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించడం. YS ఫ్యామిలికి మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోగలిగే సత్త ఉందని నిరూపించుకోవడం ... తద్వారా సిమాంధ్రలో హిరోలుగా నిలబడోచ్చు తెలంగాణలో సైతం క్యాడర్ ను తయారుచెసుకోవడం ...మొన్నటి బై ఏలక్షన్ ల లాగా కాకుండా తెలంగాణలో 2014 నాటికి గట్టిపోటీ ఇచ్చే పార్టిగా తయరుకావచ్చు.
YSRCP మొలకేత్తిందే సానుభూతి తోటలో మరి అదే కోల్పోతున్నప్పుడు తదుపరి ప్రయోజనాలెలా పోందగలరో.....





ఢిల్లికెళ్లిన YSవిజయ ఒప్పందాల అమలులో ఇదో బాగం....



మొన్నటి ఉపఏన్నికల్లో సిమాంద్రను గెలిచిన (YSR)కాంగ్రెస్ తెలంగాణ పై కన్నేసినట్లు కనిపిస్తుంది.. పరకాలలో జస్ట్ మిస్ అయిందనపించడంతో సిరిసిల్లను వెదికగా చేసుకుంది . కేటియార్ ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతాన్ని ఎంచుకొవడం కవ్వింపు చర్యకు పాల్పడ్డం ఓ రాజకీయ ఎత్తుగడ ఇది ఢిల్లిలో పురుడుపోసుకుందనే చర్చ సాగుతుంది. మొన్న ఢిల్లికెళ్లిన YSవిజయ ఒప్పందాల అమలులో ఇదో బాగం....

జైల్ హిరో జగన్ కు విస్తున్న గాలి ద్వారా తెలంగాణ వాదాన్ని ఎదుర్కొనె ప్రయత్నం చెసింది YSRCP ముసుగులో ముసలోల్ల కాంగ్రెస్. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు వెయడంలో తలలు పండిపోయిన పంచెకట్టునేతల సలహతో నేతన్న సమస్యలంటూ సిరిసిల్లలో కాలుపెట్టిన విజయ దిక్ష విజయవంతం అయినట్టేనా?.....3000మంది పోలిసులనిచ్చి పంపిన కిరణ్ సర్కార్ ఇ టూర్ ద్వారా మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలెపుకున్నట్టైంది . మరొసారి రాళ్ల దాడులు , బంద్ లు మొదలయ్యేలా చెసింది ఉద్యమ వెడి తగ్గినప్పుడల్ల ఇలా ఎవరో ఒకరు కెలుకుతూ మంట చల్లారిందా లెదా అని చుస్తూ వేళ్ళు కాల్చుకుంటున్నారు. ఈ టూర్ లో పోలిసులూ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. TRS పార్టి కార్యలయంలోకి చొరబడి మరి చితకబాదారు దింతో తెలంగాణ భవన్ వద్ద ఉధ్రిక్తత నెలకొంది . మెదక్ లో టియర్ గ్యాస్ ప్రయోగం కూడా పోలిసుల దుకూడు చర్యే.


Monday, July 23, 2012

ఓట్లే వేయడంరాని,ఓట్లేయని వారికా మనం ఓట్లేసెది.........


రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు ఇది అభినందించదగ్గ విషయమే. ఫలితాల్లో కూడా తన దాదగిరీ ప్రదర్శించిన దాదాజి 25న ప్రధమ పౌరుడిగా మారనున్నాడు .. ఇదంతా బాగానే ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు ప్రజాప్రతినిదుల ఓట్లు చెల్లలేదు, కొందరైతే ఓట్లే వేయలేదు దిన్ని'భావి'భారత పౌరులు ఎలా అర్థం చెసుకోవాలి...ఓట్లేయడమేరాని నేతలకు మనం ఓట్లేసామా.. ఓట్లేయడానికే బయటకు రాని నేతలనా మనం చట్టసభల్లోకి పంపింది..ఆంద్ర ప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు చెల్లని ఓట్లున్నాయ్.... అంటే ఇ ప్రభుద్దులకు ఓట్లేసిన ఓటరు తల ఎక్కడ దాచుకోవాలి
విళ్లేనా ఎన్నికల్లో ఓటేయమని ఇళ్ళ చుట్టు తిరిగేది. అక్షరం ముక్క కూడా రానివారేందరో బొమ్మలను చుస్తూనే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యపు గణతంత్ర రాజ్యాన్ని 60 యెండ్లకు పైగా బతికిస్తున్నారు. కాని ఓట్లేపించుకున్న నేతలు మాత్రం ఏన్నికల గేమ్ లో ఓటర్లనే ఔట్ చేసి ఏసి కార్లలో తిరుగుతున్నారు.
ఇంటిల్లిపాది పనికేళ్తేనె పుటగడవని కూలిలుసైతం పోద్దున్నే పోలింగ్ బుత్ లవద్ద గంటలతరబడి నిలబడి గర్వంగా ఓటేస్తాడు. లేచి లేవలెని ముసలోళ్శు సైతం ఓట్ల పండక్కి ముస్తాబవుతారు....గేలిచిన తరువాత వాడేం చెస్తాడో చెయడో అనే విషయాన్ని పక్కకు పెట్టిమరీ ఓట్లేస్తారు. అధికారంలో ఉన్న వాడితో విసిగేత్తి ప్రతిపక్షాన్ని గెలిపిస్తుంటారు అలా అని ప్రతిపక్షంవాడేమి ప్రతివ్రతెం కాదు ఇద్దరు ఓక్కటే కాని ఓటుకున్న పవిత్రత కాపడడం కోసం పతితల్లాంటివారినైనాసరే ఏన్నుకుంటారు తమ తమ రాజకీయకారణాలు ఎత్తి చుపుతూ ఓట్లేయడానికే బయటకురాని విరిని చూసి ఓటర్లు కూడా ఓట్లేయకుంటే విరి పరిస్థితేంటి.

దాదా మన కొత్త రాష్ట్రపతి


రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్ కు అభినందనల పరంపర వెల్లువెత్తుతుంది. మొత్తానికి దేశ 13 వ రాష్ట్రపతి గా 25న ప్రమాణస్వికారం చెయనున్నాడు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
రాష్ట్రాల వారిగా ఓట్లు:
ఏపీ ఎమ్మెల్యేల ఓట్లలో ప్రణబ్‌కు 182, సంగ్మాకు 3, చెల్లని ఓట్లు 5 అరుణాచల్‌ ప్రదేశ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, చెల్లని ఓట్లు 3 అసోం ఓట్లలో ప్రణబ్‌కు 110, సంగ్మా 13, చెల్లని ఓట్లు 2 బీహార్‌ ఓట్లలో ప్రణబ్‌కు 146, సంగ్మా 90 జార్ఖండ్‌లో ప్రణబ్-60, సంగ్మా-20 ఓట్లు జమ్మూకాశ్మీర్‌లో ప్రణబ్-68, సంగ్మా-15 ఓట్లు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రణబ్-23, సంగ్మా-44 ఓట్లు హర్యానాలో ప్రణబ్-53, సంగ్మా-29 ఓట్లు ఛత్తీస్‌గఢ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, చెల్లని ఓట్లు 1
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌లో సంగ్మాకు ఆధిక్యం లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో క్రాస్ ఓటింగ్‌ నమోదైంది.
కర్ణాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103 మధ్యప్రదేశ్‌లో ప్రణబ్-73, సంగ్మా-156 ఓట్లు గోవా ఓట్లలో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, చెల్లని ఓట్లు 1 గుజరాత్‌లో ప్రణబ్-59, సంగ్మా-123 ఓట్లు

Sunday, July 22, 2012

ఆ పాప పుట్టుకతోనే సెలబ్రిటీ అయిపోయింది ........


తెలుగు సుపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతలకు పాప పుట్టడం మిడియలో ఆన్ లైన్ సైట్ల లో పెద్ద వార్తే అయ్యుంది. ఎంతో మంది సినీతారలకు పిల్లలు పుట్టారు అప్పుడు చిన్న స్ర్కోలింగ్ లతో సరిపోయింది కాని మహేష్ కూతురు విషయం అలాకాలేదు బ్రేకింగ్ న్యుస్ అంటు ఫోన్ ఇన్ లు పెట్టి మరి హంగామా చెశారు ఇక వెబ్ సైట్ లలో కొత్త కొత్త కోణాల్లో కథనాలు అల్లుతున్నారు. శ్రావణ శుక్రవారం అని, సింహరాశి అంటు పేరు సితార అని రాజమౌళి ఆ పెరు పెట్టడాంటె పూరీ ఇ పెరు సుచించాడని రాసేశారు.ఆకరికి స్టెమ్ సెల్స్ బద్రపరిచారన్న విషయాన్ని విశ్లేషించారు.అప్పుడె పుట్టిన పాప ను సెలిబ్రిటీ చేశారు. టాలివుడ్ సుపర్ స్టార్ గా వెలుగోందుతున్న మహేష్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఆ పాప విషయాన్ని హైలెట్ చెశారు. మొన్నోక న్యుస్ సైట్ అయితే అసలు ఆ పాప పుట్టకముందే పుట్టిందని వార్త ఇచ్చేసి సిన్ క్రియెట్ చేసింది. ట్విట్టర్ ద్వారా అభిమానులను పలకరించే మహేష్ బాబు ఇంతవరకు పాప విషయం పై ఎలాంటి కామేంట్ పోస్ట్ చెయలెదు రేపో ఎల్లుండో మహేష్ తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటే అదో న్యుస్ అవుతుంది. గౌతమ్ పుట్టినప్పుడు కూడా ఇంత హంగామా జరగలేదు కాని ఈ పాప మాత్రం పుట్టడానికి ముందే సెలబ్రిటి అయింది. మొన్న అమితాబ్ మనవరాలు ఐశ్వర్య కూతురు కూడా ఇలానే వార్తల్లోకెక్కింది ....................

Tuesday, July 17, 2012

వల్లభనేని వంశీ వాయిదా.......


విజయవాడలో జగన్ ను కౌగిలించుకొని పసుపు పార్టినేతలకు షాకిచ్చిన వల్లభనేని వంశీ YSRCP లో చెరడం కాయమని అందరు ఫిక్స్ అయ్యారు .రెండు ముడు రోజులకే బాబుకు సంజాయిషి ఇచ్చినప్పటికీ నానిలాగే వంశీ కూడా జంప్ కావడానికి సిద్దమయ్యాడన్నది జగమెగిన సత్యం.ఇ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ TDP ని విడిచి వెళ్లేదిలేదని మరోసారి వంశీ తెలిపారు.క్రిష్ణా జిల్లాలో పార్టి పటిష్టంగానే ఉందంటూ నేతల మద్య విభేధాలు లేవన్నారు. నాని విషయం పై స్పందిచడానికి నిరాకరించాడు.
అయితే ఇతర TDP నేతల లాగా నాని ని గాని జగన్ ని గాని పల్లేత్తుమాట అనకుండా ఉండడంతో వంశీ పై డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఒకేసారి అందరు నేతలు జగన్ వెంట వెళ్లకుండా కొంత గ్యాప్ ఇస్తూ వెళితూ బాబు గారిని టార్చర్ పెట్టడానికి జగన్ వర్గం ప్లాన్ కావచ్చు. ఇప్పుడు పార్టి వీడి కూడా చేసేదేం లేనందునే జంపింగ్ వాయిదా వెసుకున్నాడేమొ వంశీ ...........?

Monday, July 16, 2012

అవసరమైతే తిహర్ జైల్ కి తిసుకెళ్తారని బావించారు..కానీ....


జగన్‌ ఆస్తుల కేసులో జరిగిన మనీలాండరింగ్‌ పై ఈడీ అధికారుల విచారణ ఒ కొలిక్కి రానుందా?.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఐదుగురు ఈడీ అధికారులు తొమ్మిదిన్నర సమయంలో చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. పది గంటలకు విచారణ ప్రారంభమైంది. జగన్‌ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆరా తీసారు. సాయంత్రం వరకు ఈ విచారణపర్వం కొనసాగింది. అదెవిదంగా శనివారం కూడా జరిగింది
అయితే సీబీఐ విచారణలో నోరెత్తని జగన్ నుంచి ఈడీ అధికారులు అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. శనివారం కూడా కొనసాగిన ఈడీ విచారణలో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి విదేశాల నుంచి పెట్టుబడి ఎంత వచ్చింది.. ఏ పెట్టుబడులు ఎలా వచ్చాయ్.. ఇందులో ఏవైనా అక్రమ పెట్టుబడులు ఉన్నాయా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మలేషియా, సింగపూర్, లగ్జెంబర్గ్ తదితర దేశాల నుండి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ అధికారులు వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. ఎంతో వాడీ వేడిగా విచారిస్తారని , అవసరమైతె తిహర్ జైల్ కి తిసుకెళ్తారని బావించిన వారందరి ఆశలపై నిళ్ళు చల్లినట్లు ఈడీ అధికారులు సైలెంట్ గా తమ పని కానిచ్చి విచారణ చప్పగా సాగుతుందనిపిస్తున్నారని కొంతమంది ఫిల్ అవుతున్నారు పాపం.


రాహుల్‌గాంధీకి విషయం చెప్పిన తర్వాతే అధికారికంగా ప్రకటన


రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌ రెడ్డి విజయం సాధించడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌ ఇందిరా పార్క్ సమీపంలోని ఓ హోటల్‌లో జరిగిన ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 31,645ల ఓట్లకు పోల్ కాగా... 31,099 మాత్రమే చెల్లుబాటయ్యాయి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌ రెడ్డి... తన సమీప అభ్యర్థి, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తనయుడు అనీల్‌కుమార్‌ యాదవ్‌పై ఏడువేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వంశీచంద్‌కు 13799 ఓట్లు, అనీల్‌కుమార్‌కు 6326 ఓట్లు వచ్చాయి. యూత్‌ కాంగ్రెస్‌లో సభ్యులతో మంచి సంబంధాలు ఉన్న రవికుమార్‌ యాదవ్‌ (6167 ఓట్లు) మాత్రం అనూహ్యంగా మూడోస్థానానికే పరిమితం అయ్యాడు.
రిలయెన్స్‌పై దాడుల్లో వంశీచంద్‌ పాత్ర
వంశీచంద్‌ విజయం సాధించినా… జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రతినిధులు మాత్రం దాన్ని ప్రకటించలేదు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత టీవీ 5 ఛానల్‌లో వచ్చిన కథనం ఆధారంగా రిలయెన్స్‌ సంస్థలపై దాడులు జరిగాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ దాడుల వెనక వంశీచంద్‌రెడ్డి ఉన్నారని... అప్పట్లో ఆయనపై పలుకేసులు ఉండడం వల్ల గెలుపొందినట్టు ప్రకటించేందుకు వెనకాడుతున్నారని సమాచారం. రాహుల్‌గాంధీకి విషయం చెప్పిన తర్వాతే అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.
పనిచేసిన సామాజిక వర్గం
వంశీచంద్‌కు ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసిన అనుభవం, సామాజిక వర్గం, విజయవాడ ఎంపీ లగడపాటి మద్దతు సహకరించాయని యువజన కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందే డబ్బు పంపకం జరగకుండా నిఘా పెట్టాలని రాహుల్ గాంధీ ఆదేశించినప్పటికీ... ఈ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చుచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌ కార్యకర్తల విజయం: వంశీచంద్‌
తన విజయం వెనక కాంగ్రెస్‌ కార్యకర్తల కఠోర శ్రమ ఉందని వంశీచంద్‌ అన్నారు. రాహుల్‌గాంధీ ఆకాంక్షమేరకు యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు సైతం ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం మంచి పరిణామమన్నారు. వంశీచంద్‌పైన ఉన్న ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా… ‘నాకు ఆ విషయం తెలియదు. ఎందుకు ప్రకటన చేయలేదో వారినే అడగండి’ అని సమాధానమిచ్చారు.

Saturday, July 14, 2012

బోనాల ఉత్సవాలకు పోలిసులు ఎమేరకు సేక్యురిటీ కల్పించనున్నారు?.భక్తుల భద్రతకోసం ఎం ఎర్పాట్లు చెసారు?


తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్‌దర్వాజ బోనాల జాతర పండగ కు పాతబస్తీ సిద్ధమౌతోంది. నగరం నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండికూడా ప్రజలు తరలి వస్తుండంతో సందడి వాతావరణం నెలకొననుంది అయితె అదే స్థాయిలో పోలిసులు ప్రత్యెక శ్రద్ద వహిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్ల సమీక్ష సమావేశాన్ని ఇదువరకే నిర్వహించారు.నలుగురు ACPలు ,24 మంది CI లు,113 మంది SI లు,147 ASI లు, 585 కానిస్టేబుల్ లు,175 మంది హొంగార్డ్ లె కాకుండా 15 ప్లటూన్ల అడిషనల్ బలగాలను ప్రత్యెకంగా జాతర విదుల్లోఉంచారు. విరితో పాటు పలు జిల్లాల నుండి 3000మందికి పైగా పోలిసులను, స్పెషల్ ప్రోటెక్షన్ ఫొర్స్ లను జాతర విదుల్లో వాడనున్నారు. 15న జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు డిసిపి అకున్ సభర్వాల్ తెలిపారు.

ప్రత్యెకంగా బోనాల పండుగకు మహిళలు ఎక్కువ హజరవుతారు . వారి తో పాటు పిల్లలు కూడా ఎక్కువగానే సంబరాల్లో పాల్గోంటుండడంతోగతంలో కన్నాఎక్కువ సంఖ్యలో మహిళా పోలిసులను భద్రతా విదుల్లో వాడనున్నారు. మహిళలు ఎక్కువగా వస్తుండడంతో చైన్ స్నాచర్స్ తమ చేతివాటం చుపె అవకాశం ఉన్నందున పోలిసులు దినిపై ప్రత్యెక శ్రద్ద వహించనున్నారు. ఎక్కువమంది పాల్గోనే ఉత్సవాల్లో పిల్లలు తప్పి పోవడం కూడా పెద్ద సమస్యే విటికోసం ప్రత్యెకంగా కోంత మంది CI ల అద్వర్యంలో నిఘా వుంచనున్నారు.సెన్సిటివ్ ప్రాంతాల్లో లోకల్ పోలిస్ లతో పోలిస్ పికెటింగ్ లను ఎర్పాటు చెసి గస్తి పెంచనున్నారు .పలు ప్రాంతాలను ఇప్పటికే ఆధినంలోకి తిసుకొని బాంబ్ స్క్వాడ్ లతో చెక్ చెశారు. ఉగ్రవాదుల దాడులలాంటి హెచ్చరికలేవి లెవని ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా క్లీన్ గానే ఉందని పోలిసులు చెప్తున్నారు.
చార్ మినార్ , మీర్ చౌక్ ,ఫలక్ నుమా డివిజన్ లలో ట్రాఫిక్ ఆంక్షలు నేటినుండే అమలులోకి రానున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. వైన్ షాప్ లను జాతర జరిగినన్నిరోజు లు ముసేయలని ఆదేశించారు .ఆలయ కమిటి నేతలతో కూడా ఎప్పటికప్పుడు ఎర్పాట్లపై సమిక్షిస్తున్నారు . రాజకీయనేతలు, విఐపిల కొసం ప్రత్యెక ఎర్పాట్లు చెస్తున్నారు.
మతసామరస్య ఇబ్బందులేవి తలేత్తకుండా SI CI లతో పాటు ACP స్థాయిల్లో స్థానిక రాజకీయనేతలతో మత పెద్దలతో సమవెశాలు ఎర్పాటు చేసి శాంతిభద్రతల పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.నగర కమిషనర్ అనురాగ్ శర్మ కూడా సమవెశాల్లో పాల్గోని శాంతియుత వాతావారణంలో ఉత్సవాలను జరిపుకోవాలని పిలుపునిచ్చారు

Friday, July 13, 2012

ఇప్పుడిక వంశీ వంతు ....జూలై 21 న ముహుర్తం?


TDP నేతలు జగన్ వైపు జారడం కోనసాగుతూనే ఉంది.నిన్న నాని రేపు వంశీ ఇలా వన్ బై వన్ జంప్అవుతు బాబుగారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. వంశీ ఈ నెల 21 న జగన్ తో ములాఖత్ అయి ఆయన పార్టిలో చెరాలని నిశ్చయించుకున్నాడు.వంశీగారి జంప్ వేనక కూడా పలుకారణాలు వేతికే పనిలోపడ్డారు మన రాజకీయవిశ్లేషకులు. వాటిలో మొదటి కారణం దేవినేని ఉమ సేమ్ టూ సేమ్ నానిలాగే వంశీకుడా ఉమనే వెలెత్తి చుపిస్తున్నాడు. వంశీ కి కాంగ్రెస నేత దేవినేని నెహ్రు కి మద్య గోడవ జరిగినప్పుడు ఉమ తనవైపు నిలవలెదని వంశీకి కోపంగా ఉంది . ఇక రెండోది రాబోయే ఎన్నికల్లో విజయవాడ MP సిటు గాని గన్నవరం MLA సీటుగాని వచ్చె సంకేతాలు లెకపోవడం మరోకారణం..మొత్తం మిద TDPకి దురమవుతున్న నేతల్లో ఇద్దరుకూడా ఉమ వైపె వెళేత్తి చుపించారు. మరి బాబుగారు సమస్య దిశగా ఎందుకు ఆలోచించడంలెదు... తమ నేతలను అటు ఆంద్రాలో జగన్ ఇటు తెలంగాణలో kcr లు గద్దల్లా తన్నుకపోతుంటె మౌనంగ ఎందుకుంటున్నాడో .......

Thursday, July 12, 2012

నాని గారి కోయిల ముందే ఎందుకు కూసింది???


నాని రాజీనామా కథలో రోజుకో కోత్త కోణం వెలుగు చుస్తుంది. తెలుగుదేశంలో కొనసాగితె తన రాజకియ ప్రయాణం కోనసాగించడం కష్టమేననుకున్నాడని అందుకే రాజినామా చెసాడని అంతా అనుకున్నారు.TDP నేతల ప్రెస్ మిట్ లలో నాని రాజకీయ వ్యభిచారి అని డబ్బుకు అమ్ముడుపోయాడని ఉదరగోట్టారు కాని నాని మాత్రం తన ప్రెస్ మిట్ లో అన్నగారి అభిమాన బాణాన్ని సందించి NTR అభిమానులంతా TDP తోనే వుండాల్సిన పనిలెదని వారికి పార్టిలో స్థానం లెదని నోక్కివక్కానించాడు. దింతో కంగు తిన్న తెలుగు తమ్ముల్లు అదే అభిమాన అయింట్ మెంట్ రుద్దే ప్రయత్నం మొదలుపెట్టారు.
బాలయ్యబాబు గుడివాడ మిద మనసుపారేసుకున్నాడని 2014 లో అక్కడినుండే పోటిచేయలని ఉవ్విల్లురుతున్నాడని అందుకు బావబాబు ఒప్పుకున్నారని ప్రచారం మొదలైంది.బాలయ్యబాబు రంగంలోకి దిగితె తన సంగతెంటని ఆలోచించిన నాని 2014 వరకు ఆగి బాలయ్య వచ్చిన తరువాత జగన్ తో జంప్ అయితే ఇప్పుడు పాడుతున్న అభిమాన రాగం పాడలెడని అందుకె నాని కోయిల ముందే కుసిందని ప్రచారం మొదలయింది
అన్నగారి అభిమానినని చెప్పుకుంటున్న నాని బాలయ్యబాబు కోసం సిటు ఎందుకు వదులుకోలేక పోయాడని అందరు అనుకుంటారని బావించి ముందె భిచానా ఎత్తేసాడని అంటున్నారు .ఒకవేళ అదే నిజమయితే నాని వెసిన స్టెప్ కరెక్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా బాలయ్య 2014లో పోటి చెయాలమి భావించాడా అదే నిజమయితె ఇప్పుడు అయన పరిస్థితేంటి? మద్యంతరంగా ఎన్నికలకు అయన సిద్దమవుతారా .? కాలమే నిర్ణయించాలి..........................

Tuesday, July 10, 2012

వల్లభనేని వంశీ TDP కి జనగనమణ పాడి జగన్ కి జై అంటాడా?


వల్లభనేని వంశీ TDP కి జనగనమణ పాడి జగన్ కి జై అంటాడా? నాని బాటలో వంశీ పయనిస్తాడా?
నాని TDPకి గుడ్ బై చెప్పగానే ఇప్పుడు అందరు వంశీ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. తెలుగుదెశం నుంచి మాయం అయి ఏప్పుడోజగన్ శిబిరంలో తెలుతాడని అందరు డౌట్ గా చుస్తున్నారు.నాని జంప్ కు ముందే వంశీ జగన్ పార్టిలోకి వెళ్తారని అన్ని పార్టిల నేతలు భావించారు విజయవాడలో జగన్ ను కలిసిన తర్వాత వంశీ బాబుకు వివరణ ఇచ్చి మరి విషయాన్ని సద్దుమణిగించాడు.
కాని సేమ్ టూ సేమ్ నాని కూడా జగన్ తో కలిసేదిలేదని అధినేతకు చేప్పిన కోన్నిరోజులకే పార్టివీడాడు ఆ లేక్కన వంశీ పార్టి వదలడని గ్యారంటీ అయితెలెదనే చెప్పాలి.నాని వంశీలు జిగిరి దోస్త్ లు కావడంతో ఇద్దరు ప్లాన్ ప్రకారమే డ్రామ్ ప్లే చెస్తున్నారని అందరు అనుకుంటున్నారు.ఇంత చర్చ జరుగుతుంటే వంశీ సైడ్ నుండి స్పందన లేకపోవడం అందరి అనుమానాలకు బలం చేకుర్చుతుంది

Monday, July 9, 2012

Jagan ఆపరెషన్ ఆకర్ష్ తో Babu ఆగం


ఆపరెషన్ ఆకర్ష్ తో ఆగం
టిడిపి MLAల్లో అభధ్రతాబావం ఎక్కువవుతుందా ? మొన్నటి బై ఎలక్షన్ ఫలితాలతో బెంబేలేత్తిన తెలుగు తమ్ముల్ల భవిష్యత్ కార్యచరణ ఎంటి? రిసేంట్ గా నాని జగన్ పార్టిలోకి జంప్ కావడంతో ఈ ప్రశ్నలు మరోసారి రాజకియ వర్గాల్లో తలెత్తుతున్నాయ ఇప్పుడున్న పరిస్థితిలో టిడిపికి విజయావకాశాలు లేవని తమ్ముల్లు బలంగా నమ్ముతున్నారు. .దానికి తెలంగాణ లోల్లితోపాటు మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా వారి నిర్ణయానికి దోహదపడి ఉండవచ్చు. అటు ఆంద్రాగాని తెలంగాణలో గాని బాబు ధళం పుర్తి వ్యతిరేఖపవణాలను ఎదుర్కుంటుంది.మరోసారి టిడిపి తరపున MLA గా గెలవడం అసాద్యం అని ఆఫ్ ద రికార్డ్ గా రెవంత్ రేడ్డిలాంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.మొన్నటి వరకుTRS కోనసాగించిన ఆపరెషన్ ఆకర్ష్ పధకంలో గులాబి ధళంలో చెరి భవిష్యత్ పై ఆశలు నిలుపుకోవాలని బావించిన దేశం నేతల్లో కోందరు విజయవంతంగా గులాబి కండువా కప్పుకున్నప్పటికి ఇంకా చాలా మంది TDP నేతలు డైలమాలోనే మిగిలిపోయారు అయితే తెలంగాణలో ఆకర్ష్ పధకానికి కోంత బ్రేక్ పడ్డప్పటికి జగన్మోహన ప్రభంజనంలో ఆకర్ష్ సిమాంద్రలో కోనసాగుతుంది నల్లపురేడ్డి తో మొదలై నానిదాకా వచ్చింది ఇది ఇంకా ఎంతదురం పోతుందో ....జగన్ తో ఇప్పుడూ..ఎప్పూడూ బాబుకే నష్టమని విష్లేశకులు తేల్చేస్తున్నారు. ప్రభుత్వ పాలన తో విసిగివేసారిన ప్రజలకు ప్రత్యామ్నాయంకోసం చుసినప్పుడు ప్రతిపక్షం కనిపిస్తుంది అయితే చంద్రబాబు ఉండాల్సిన ఆ అపోజిషన్ సీట్ లో ఇప్పుడు జగన్ కనిపిస్తున్నారు ......

Friday, July 6, 2012

NRI కట్నం వేదింపుల జాబితాలో మరో మహిళ


హైదరాబాద్ నగరంలోని అంబరాపేట్ లో ఒ మద్యతరగతి కుటుంబానికి చెందిన తస్లిమా ఉస్సేని ని దుబాయ్ లో స్థిరపడ్డ షేక్ బాబా తో 2004 లో పెళ్ళి చేశారు . తస్లిమా MRI scanning Technician కోర్సు పెళ్ళికి ముందే పుర్తి చేసింది దుబాయ్ లో కోన్నిరోజులు ఉద్యోగం కుడా చేసిన తస్లిమా సంసారం ఇద్దరు పిల్లల పుట్టే వరకు సజావుగానే సాగింది ... అత్తింటి వారు అదనపు కట్నం కోసం మొదలుపెట్టిన గోడవలు ఉద్యోగం మాన్పించమని భర్త పై ఒత్తిడి తెవడంతోనే ఆగిపోకుండా విడాకుల వరకు తెచ్చాయి. NRI భర్తల మొసాల జాబితాలో తస్లిమా చెరిపోయింది.....

Thursday, July 5, 2012

సూర్జిత్ సింగ్


సూర్జిత్ సింగ్ భారతదేశ గుఢచారి.... ముప్పయేళ్ళ జైలు జివితం వెనక దాగిన రహస్యాలు...
Surjeet Singh, an Indian spy, was released last week after more than 30 years in a Pakistani prison. The BBC's Geeta Pandey travels to his village in the northern Indian state of Punjab to hear his story. When Surjeet Singh left home to go to Pakistan on a cold winter's day in December 1981, he told his wife he would return very soon. It was 30 years and six months before they saw each other again and his jet black beard had turned white. While he was incarcerated for spying in Lahore's Kot Lakhpat jail, his family had given him up for dead. He was utterly isolated; he didn't receive a single visitor or even a letter. Some of his time in prison was spent awaiting his end on death row. Only his faith sustained him. "All because of the almighty. He helped me through those long years," he says. While India's economy boomed in those three decades, tragedy struck his own family. His eldest son died, as did four of his brothers, his father and two sisters. 'Hurt and angry' So when Mr Singh came across the Wagah border last week at the age of 73, he returned to a country and a family that had undergone radical change. Surjeet Singh then and now Surjeet Singh is a changed man now Once on home ground he stunned everyone by openly admitting that he had gone to Pakistan "to spy". India has always denied claims by those returning after stints in Pakistani jails that they were spies for India. And this time it was no different. But after what felt like an enormous personal sacrifice for his country, Mr Singh is hurt - and angry- by the denial. "It was the Indian government which sent me to Pakistan. I did not go there on my own," he tells me when I meet him in his village Fidda, a little over a two-hour drive from the Golden Temple in Amritsar. Mr Singh rejects criticism that he is claiming to be a spy "just to get some importance" or because he is "suffering from "delusions of grandeur". In his absence, he says the army paid his family a monthly pension of 150 rupees ($3). "If I didn't work for them, then why did they pay my family?" he asks. Continue reading the main story “Start Quote Harbans Kaur After so many years he's rejoined the family, it has caused me immense pleasure” Harbans Kaur Surjeet Singh's wife Mr Singh says the government has treated him 'unfairly" and that he is willing to fight for what is rightfully his. But if the authorities continue to deny that he worked for them? "I have documentary proof, I will go to the Supreme Court to get what is my right," he threatens. Mr Singh declined to show me the documentary proof and it is unclear exactly what his role was. He seems to have acted partly as a courier and says he did some recruiting of Pakistani agents. He says that as a young man, he worked for a few years with the paramilitary Border Security Force before leaving it in 1968 to become a farmer. In the mid-1970s, he says the Indian army recruited him to work as a spy. "I did 85 trips to Pakistan," he says. "I would visit Pakistan and bring back documents for the army. I always returned the next day. I had never had any trouble." But on his last trip, things went horribly wrong. "I had gone across the border to recruit a Pakistani agent. When I returned with him, an Indian official on the border insulted him. He slapped the agent and wouldn't allow him in. The agent was upset so I had to escort him back to Pakistan. In Lahore, he revealed my identity to the Pakistani authorities." Mr Singh was arrested in Lahore and taken to an army cell for interrogation. In 1985, an army court sentenced him to death. In 1989, President Ghulam Ishaq Khan accepted his mercy plea and commuted his sentence into life in jail. Continue reading the main story “Start Quote We always had a feeling that if he was alive, we would have eaten better food, worn better quality clothes and had a better social standing” Parminder Kaur Surjeet Singh's daughter "Initially, I had no hope of returning home. When I was on death row, I thought this is it. But when it was commuted, I had hope." Given up for dead There are other Indians in Pakistan's jails. Mr Singh says there are 20-odd Indian prisoners in Lahore's Kot Lakhpat prison - all accused of spying. Two others - Sarabjit Singh, India's most famous prisoner, and Kirpal Singh - are on death row. But, he says, India has done little to secure their freedom. "The government doesn't care. It refuses to do anything for these Indian prisoners. The authorities forget that these men are also someone's husband, someone's son, someone's brother." India's policy on the issue is not to comment. When he did not return home as promised, his wife Harbans Kaur initially thought he was held up for work. But when days turned into weeks and weeks into months and months into years, she says she didn't know what to think. "I didn't know whether he was dead or alive," she told me. Daughter Parminder Kaur was 12 or 13 when her father went missing. Parminder and her siblings had to drop out of school soon after as the family couldn't afford to educate them. Surjeet Singh hugs his daughter Parminder Kaur Surjeet Singh returned to India amid emotional scenes "After a while we thought he was dead. We missed him. We always had a feeling that if he was alive, we would have eaten better food, worn better quality clothes and had a better social standing," she says. And then, suddenly in 2004, 25 years after he went missing, a letter arrived at the family home. Mr Singh had addressed it to his younger son, Kulwinder Singh Brar. And that is when the family knew that the man they had given up for dead was alive. "After we got his letter, I became hopeful that I will see my husband again," says Harbans Kaur. Family happiness Now Mr Singh is getting to know the new family members ­- eight young grandchildren. It has been four days since his return and he hasn't had a minute to himself - visitors and relatives have been pouring in besides the dozens of reporters who come to interview him. "I've lost count of how many interviews I've given. I was better off in jail," he says. Mr Singh's outbursts and reproaches in the past few days have had some impact and help has begun trickling in. The state administration has promised to build a concrete road to his farm, install a tubewell on his land and provide him with an electricity connection. Punjab's Irrigation Minister Janmeja Singh Sekhon visited him on Monday and gave him 100,000 rupees ($1,826; £1,164). Some local people and groups also pitched in by collecting 250,000 rupees ($4,565; £2,910) for him. Today, as his wife sits next to him, she cannot stop smiling. "He still looks the same," she says. "Yes, he's gone all grey, but so have I. After so many years he's rejoined the family, it has caused me immense pleasure." More on This Story Related Stories