Sunday, September 9, 2012

అర్నభ్ గోస్వామి బయపడుతూ ఇంటర్వ్యు చేసాడా???


జాతియ మిడియా పై రాజ్ థాకరే మండిపడడం , TRP కొసం ఏమైనా చెస్తారంటు చెప్పడంతో పాటు మరెన్నో విశేషాలున్న ఇంటర్య్యు ఇది
Frankly Speaking అనే కార్యక్రమంలో రాజ్ థాకరే ఇచ్చిన ఇంటర్య్యు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.....
అర్నభ్ గోస్వామి గత ఇంటర్య్యు లతో పోలిస్తే రాజ్ థాకరే ఇంటర్య్యు స్పెషల్ అని చెప్పాలి..ఏదుటివారిని బయపెట్టే అర్నబ్ ఈ సారి రాజ్ ముందు కాస్త బయపడ్డడా అని అనిపించింది.....






http://www.youtube.com/watch?v=48ZbElYzQb4&feature=relmfu

Saturday, September 8, 2012

పోగాకు ప్రాణం ప్రాణాలు పణం


అది ఆరోగ్యానికి హానికరం అని తెలుసు....అత్యంత బయంకరమైన వ్యాదులకు అదే ములం అని తెలుసు అయిన దాన్ని వదలరు..సరదాగా మొదలైనా.... సర్వం నాశనం అయ్యేంత వరకు అది వదలదు......అదేనండి మన జేబులు కాలి చెస్తూ శరిరాలను కాల్చేస్తున్న మహమ్మారి సిగరేట్ ... ' పోగాకు ప్రాణం ప్రాణాలు పణం" అన్న చందంగా మరింది ప్రస్తుత మన జీవణ శైలి.....
గుట్కాలు తింటూ , సిగరెట్లు కాలుస్తు ఆరోగ్యాన్ని కాల్చుకుంటూ వారి కుటుంబాలను తోటివారి జివితాలను సైతం బుడిద చెస్తున్నారు....సిగరేట్టే కదా అని లైట్ తిసుకుంటున్న వారి లైఫ్ ను సైలేంట్ గా స్పాయిల్ చేస్తుంది.
స్మోకింగ్‌కి చిన్నాపెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులు అన్న లింగబేధం అంతకన్నాలేదు. అందర్నీ పీల్చి పిప్పిచేస్తున్నదీ సిగరెట్‌. ఆరోగ్యంగా ఉండేవారిని సైతం సైలెంట్‌గా చంపగల శక్తి సిగరేట్ కే ఉంది. స్మోకర్లు ఓరల్ కాన్సర్‌కు గురికావడంతో పాటుగా అనేక ఇతర రోగాల బారిన కూడా పడుతుంటారు. పిల్లలు, పెద్దల్లో అకాల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. హార్ట్ఏటాక్ లాంటి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి. ఓక్కోసారి బ్రేయిన్ స్ట్రోక్ కు కారణం అవుతున్నాయ్.13 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో 14.1 శాతం మంది పొగాకు వినియోగదారులవుతున్నారని గ్లోబల్‌ యూత్‌ టొబాకో సర్వే తేల్చిచెప్పింది. మన దేశంలో ఏటా లక్షలాది మందిపొగాకు సంబంధిత రోగాల వల్ల మృత్యువాత పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో 40 శాతం మంది, కాన్సర్‌ రోగంతో బాధపడుతున్న వారిలో 50 శాతం మంది పొగాకు వాడకందార్లే.పోగాకు వినియోగం మన కల్చర్ లో బాగం కావడం బాదాకరమైన విషయం....
39.7శాతం మగవారు....18.8శాతం స్త్రీలు పోగా తాగుతున్నారు.
సిగరెట్ 17.7శాతం ...18.5 మగవారు...3.7 మహిళలు
బీడిలు 6.8
పాన్ , గుట్కాలు..15.1
పోగాకు వినియోగదారులు ఉదయం లెవగానే అర్ధగంటలోపు 66 శాతం మంది పోగాకు వాడుతున్నారు..
పొగాకు చేసే హాని , రోగాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు కూడా తీసుకువచ్చింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం, అమ్మకాలపై ఆంక్షలు పెడుతూ 2003లో ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం దేశమంతటా అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగడాన్ని నిషేధించారు. అంతేకాదు, మైనారిటీ దాటని పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదు. వీటికి సంబంధించిన వ్యాపార ప్రకటనలపై కూడా నిషేధం విధించారు. విద్యాసంస్థలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తులు ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలో మార్పులు చేసిన నిబంధనలు 2010 అక్టోబర్‌ రెండవ తేదీ నుంచి అమలు చేశారు. ఈ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధిస్తూ, బహిరంగ ప్రదేశాలంటే ఏమిటో వివరణ ఇచ్చారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే 200 రూపాయల దాకా జరిమానా విధించే వీలు కల్పించారు.కాని అలాంటి చట్టం ఒకటుందని కూడా చాలా మందికి తెలియదు.....
నోట్లో సిగరెట్‌ పెట్టుకుని దాన్ని స్టైల్‌గా వెలిగించి రింగ్‌రింగ్‌లుగా పొగవదలడంలో ఆనందం ఉండవచ్చు. మరి ఖర్చుమాటేమిటి? పొగరాయుళ్లు సిగరెట్లపై పెట్టే ఖర్చు తక్కువేమీకాదు. లక్షాధికారుల సంగతి ఎలా ఉన్నా, మధ్యతరగతి, పేదవారికి మాత్రం ఈ ఖర్చు భరించలేనిదే. ఆరోగ్యాన్నే కాకుండా జేబును కూడా కాల్చేస్తున్నదీ సిగరెట్‌.
స్మోకింగ్‌ మీ జేబుకు చిల్లుపెడుతుంది. మధ్యతరగతిలో అనేక మంది కేవలం స్మోకింగ్‌కే నెలకు వెయ్యి నుంచి 1500 రూపాయలదాకా ఖర్చుపెడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దీనికి తోడు మద్యం ఇంకా ఇతర దుర్వ్యసనాలు ఉంటే నెలకు మూడునాలుగు వేలు ఖర్చుఅవుతుంటుంది. దీంతో అనేక మధ్య, అల్పాదాయ వర్గాలు అతలాకుతలం అవుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అంటే సరదాగా మొదలయ్యే స్మోకింగ్‌ చివరకు వారి కుటుంబాన్ని వీధినపడేస్తున్నది. సిగరెట్ లేదా ఇతర పోగాకు ఉత్పత్తులు వాడి రోగాల బారిన పడ్డవారి కుటుంబాలు చిన్నాబిన్నం అవుతాయు.
ఆర్ధికంగా కుంగిపోయు కుటుంబపోషణ ప్రశ్నార్ధకంగా మారి ఓక్కోసారి సాముహిక అత్మహత్యలకు దారితిస్తున్నాయు.

క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారి కుటుంబాలను బయపెట్టే అంశం ....మరోసారి పోగాకు ఉత్పత్తులకు ఆకర్షంచబడుతారెమొ అని ......బడి, గుడి అన్న తేడా లేకుండా ఏక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్మేస్తున్న గుట్కాలు ,సిగరెట్లు మానేసిన వారిని మరోసారి మొదలు పెట్టేలా చెస్తుండడం విరిని అందోళనకు గురిచేస్తున్నాయు...పచ్చని జివితాల్లో చిచ్చు పెడుతున్న క్యాన్సర్ కారకాలను ఏందుకు నిషెదించకూడదో తెలపాలని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు...
ప్రభుత్వ అధికారులు మాత్రం గుట్కా నిషేదాలపై నిలదిస్తే తప్పించుకునేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు. మన రాష్ట్రంలో నిషేదించినా పక్క రాష్ట్రాలనుండి సరఫరా జరుగుతుందని.ఇది దేశ వ్యాప్తంగా జరగాల్సిన పని అని తప్పించుకుంటున్నారు....గతంలో నిషేదం విదించినప్పుడు ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు.....పక్కా ప్రణాలిక ప్రకారం జరగకపోతె నిషేదం విధించికూడా లాబం లేకుండా పోతుందంటున్నారు...
పొగతాగడం అలవాటున్నవారిలో పది శాతం మందిలో ఎక్కువగా దీనికి సంబంధించిన రోగాలతోనే బాధపడుతున్నారు. స్మోకింగ్‌ మానేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏవో కారణాల వల్ల మానలేకపోతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రేపటి నుంచి సిగరెట్‌ మానేద్దామని అనుకంటే అంతలో ఏదో ఒక కష్టం వస్తుంది. దీంతో కష్టాన్ని మరచిపోవడానికి ఇంకా ఎక్కువ సిగరెట్లు కాల్చడం మొదలుపెడతాడు. సిగరెట్‌ మానలేకపోతున్నామని చెప్పడానికి అనేక కారణాలు వెతుక్కుంటాడు. ఇదో బలహీనత. నిజానికి సిగరెట్‌లోని నికోటిన్‌ అనే అల్కలాయిడ్‌ మెదడుపై ప్రభావం చూపడంతో సిగరెట్‌ మానేయలేని స్థితి ఏర్పడుతుంది.కాని మానేయలని నిశ్చయించుకుంటే మాత్రం చాలా దారులన్నాయ్...వాటికోసం ప్రత్యేకంగా రిహబిలిటేషన్ సేంటర్లు కూడా ఉన్నాయ్......
ఇలా డబ్బును ,విలువైన అరోగ్యాన్ని ఆకరికి ప్రాణాలను కూడా తియడంలో కీలక పాత్రపోషిస్తున్న ఈ పోగాకు ఉత్పత్తులను నిషేదించాలని కోరుతున్నారు..ప్రజల ప్రాణాలను హరించే పదార్థాలను ఏవరి ప్రయోజనాలకోసం మార్కెట్లోకి వదులుతున్నారో కాని విలైనంత తోందరగా విటిని నిషెదించాలని కోరుతున్నారు...