Saturday, May 25, 2013

కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది

కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. కొంత కాలంగా అధిష్ఠానాన్ని ఎదిరిస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పా ల్గొని తెలంగాణవాణి వినిపిస్తున్న పెద్దపల్లి ఎంపీ జి వివేక్ టీఆర్ఎస్‌లో చేరేందుకు సమాయత్తం అయ్యారు. ఎంపీ తన అనుచర వర్గంతో హైదరాబాద్‌లో ని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో టీఆర్ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు జరుపుతున్నా రు. కాంగ్రెస్ ఎంపీలు జి వివేక్, ఎస్ రా జయ్య, మంద జగన్నాథంలను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
ఎంపీ బాటలోనే అనుచర వర్గం కూడా పెద్ద ఎ త్తున టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సమాయత్తం కావడంతో కాంగ్రెస్‌లో కల కలం మొదలైంది. తెలంగాణ ఏర్పాటు పై ఈ నెల 30వ తేదీలోగా తేల్చాలని కాంగ్రెస్ ఎంపీలు గడువు విధించినా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందిస్తున్న వి శ్వాసం లేకపోవడంతో వీరు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రంతో తాడోపేడో తే ల్చుకోవడానికి కాంగ్రెస్ ఎంపీలు యూ పీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాందీలను కలిసేందుకు యత్నించగా అవ కాశం లభించకపోవడంతో టీఆర్ఎస్ లో చేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కు ఉద్యమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం కాంగ్రె స్‌లో ఉన్న ఎంపీ వివేక్ టీఆర్ఎస్‌లో చే రితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఎవరి స్థానంలో వారు టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నిర్ణయించుకొని టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావుతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాతనే వచ్చే నెల 2న టీఆర్ఎస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఎంపీ వివేక్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ముహూర్తం నిర్ణయించడంతో ఆయన అనుచర వర్గం ఆందోళన చెందుతోంది.
ఇటీవలనే కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో ఎంపీ వర్గానికి చెందిన వారికి కూడా పదవులు దక్కాయి. ప్రస్తుతం ఎంపీ కాంగ్రెస్‌ను వీడితే వీరి పదవులు మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలి పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలోని తూర్పు ప్రాంతంలో తెలంగాణ ఉద్య మం బలోపేతంగా ఉండగా టీఆర్ఎస్‌లో కూడా సంస్థాగత పార్టీ పదవుల ను ఉద్యమంలో చురుకుగా పని చేస్తున్నవారికి కట్టబెట్టారు. ఎంపీ అనుచర వర్గం టీఆర్ఎస్‌లో చేరితే ద్వితీయ శ్రేణి నాయకులుగా పని చేసే పరిస్థితులు ఉంటాయి. దీనికి కొందరు ఎంపీ అ నుచర వర్గం నాయకులు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లోనే ఉండేందుకు సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో పదవు లు దక్కించుకున్న వారు రెండు రోజుల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుతో మంతనాలు జరిపి కాంగ్రెస్‌లోనే ఉండేందుకు నిర్ణయించుకోగా మరి కొందరు ఎంపీ బాటలోనే టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుల మధ్య కొం తకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇరు వర్గాల వారు పరస్పర ఆరోపణలు చేసుకొని దిష్టిబొమ్మలను దహనం చేసుకున్న సంఘటనలు కూ డా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై తె లంగాణ విషయంలో ఒత్తిడి తెస్తూ ముఖ్యమంత్రి పై ప్రత్యేక ఆరోపణలు చేసిన ఎంపీకి అధిష్ఠానం మద్దతు లభించలేదు. ఇదే సమయంలో ప్రేం సాగర్‌రావు అధిష్ఠానానికి దగ్గరయ్యా రు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాలలో నిర్వహించిన ముఖ్య మంత్రి సభను వి జయవంతం చేసి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేశారు.
సహకార సంఘాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు భారీ మెజార్జీ తెప్పించడంతో అ«ధిష్టానం పార్టీ పదవుల కేటాయింపులో కూడా మాజీ ఎమ్మెల్సీ వర్గానికే ప్రాధాన్యతను ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇమడ లేకపోతున్న ఎంపీ కొంత కాలంగా టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుండగా ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు.
 

Thursday, May 9, 2013

27 ఏళ్ల కిందట సర్‌సిల్క్ ఫ్యాక్టరీతో ఉన్న పోగు బంధం తెగిపోయింది

మనుగడ కోసం పోరాటం... మనిషి జీవితంలోనే కష్టం ఉంది. కష్టాలు సహనాన్ని పరీక్షిస్తాయి. భయపడితే నేలమట్టం చేస్తాయి. ఎదురీదితే తలవంచి సలాం చేసి పక్కకు తప్పుకుంటాయి. 27 ఏళ్ల కిందట సర్‌సిల్క్ ఫ్యాక్టరీతో ఉన్న పోగు బంధం తెగిపోయింది. కుటుంబం రోడ్డున పడ్డది. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు... కుటుంబానికి పెద్ద దిక్కు కూడా పోయా డు. ముందు చూస్తే పేగు తెంచుకుపుట్టిన నలుగురు పిల్లలు. పుట్టెడు దుఃఖం. అయినా ఆమె కష్టాలకు వెరవలేదు. బాధ్యతను నెరవేర్చుకుంది. సమస్యలకు భయపడటంతోనే మన పతనం మొదలవుతుంది... కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుందంటున్న ఓ సాధారణ గృహిణి కథ... 
fgdfgsgf-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
27 ఏండ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ ఫ్యాక్టరీ మూతపడ్డది. అందులో పని చేసే కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అలా జీవనోపాధి కోల్పోయిన కుటుంబం బంక రాయమల్లు, ఆయన భార్య బంక లక్ష్మీ. ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డతో ఆనందంగా ఉన్న కుటుంబం. ఫ్యాక్టరీ మూసివేతతో దిక్కుతోచని స్థితి. అప్పుడే అక్కున చేర్చుకుంది సింగరేణి. ఎందరికో బతుకుదెరువు చూపినట్టుగానే ఆ కుటుంబాన్ని తన ఒడిలో చేర్చుకుంది. రాయమల్లు కుటుంబం సింగరేణి ప్రాంతంలోని శ్రీరాంపూర్‌కు వలసవచ్చింది. చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే ఈ స్టోరీ ఉండేది కాదు. అనారోగ్యం హఠాత్తుగా రాయమల్లు ప్రాణం తీసింది. నలుగురు పిల్లలతో భార్య లక్ష్మీ. ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్తపోవడంతో ఆమెది దిక్కుతోచని స్థితి. 

‘‘కాగజ్‌నగర్‌లో సర్‌సిల్క్ నడిచినన్ని రోజులు బాగుండేది... అది ఒక్కటే సారి బందయి మా లెక్క చాలా మంది జీవితాలు ఆగమయిపోయినయ్... నిలదొక్కుకున్నోళ్లు నిలదొక్కుకున్నరు. నిలదొక్కుకోనోల్లు ఆగమయిపోయిండ్రు... చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోయిండ్రు... ఆ బాధ తలచుకుంటే దుఃఖం ఆగదు కొడుకా... మా ఆయన సచ్చిపోయినంక చిన్న కిరాణ దుకాణం పెట్టుకున్న. పెద్ద కొడుకు హైదరాబాద్‌లో గుమస్తా పని చేసేటోడు. ఆయన చనిపోయిండు. ఇంకో కొడుకు శ్రీనివాస్8 హైదరాబాద్‌ల ప్రైవేటు ఆసుపవూతిలో పని చేస్తడు... ఇంకో కొడుకు కుమార స్వామి శ్రీరాంపూర్ డిష్‌ల పని చేస్తడు. బిడ్డ బండి పద్మ, అల్లుడు లక్ష్మీరాజంలు నా పక్కనే షాపు పెట్టుకొని ఉంటుండ్రు. మనిషికి ధైర్యం ఉండాలే కాని అన్ని సాధించుకోవచ్చు.

కష్ట పడి పని చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటది. సర్‌సిల్క్‌ల ఉద్యోగం పోయిందని మేం భాదపడలేదు. సింగరేణి మాలాంటి వాళ్లనెందరినో కడుపుల పెట్టుకొని సాదుతుంది. ఏదో రకంగా బతుకుదెరువు సాగకపోతదా అని నమ్మకంతోని ఇక్కడికి వచ్చినం. ఇక్కడి ప్రజలు మంచి మనుషులు... మనుసున్నోళ్లు.


 అక్కడ సర్‌సిల్క్ పరిశ్రమ కళకళలాడింది!  ఆ ఫ్యాక్టరి వేలాది మంది కార్మికులకు జివనోపాదినిచ్చింది... మొన్నటి దాకా కార్మికులు, వారిపై ఆధారపడి బతికేవారితో కళకళలాడిన ఫ్యాక్టరీలు పరిసర ప్రాంతాలు వెలవెలబోయాయి....  కార్మికులను నట్టేట ముంచి బడాబాబులు చెక్కెసారు... ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిర్వాహకుల అవినీతి, నిగ్గదీయాల్సిన కార్మిక సంఘాల చేతగానితనం, ఇంత జరుగుతున్నా పట్టించుకోవడానికి తీరిక, ఆసక్తి లేని ప్రజా ప్రతినిధులు! వెరసి..ఆదిలాబాద్ జిల్లా పారశ్రిమిక సంక్షోభం!!......

.... ముడి సరుకు లేక చితికి చేరిన సర్ సిల్క్ పరిశ్రమ..కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ వస్త్ర తయారీ పరిశ్రమ 1985 ఏప్రిల్ 16న మూతపడింది. 9.72కోట్లతో ప్రారంభమైన ఈ పరిక్షిశమలో సిల్క్ వస్త్రాల తయారీ కోసం 503 మరమగ్గాలుండేవి. 3900మంది కార్మికులు పని చేసేవారు. ఫ్యాక్టరీ మూడపడడంతో వీరంతా వీధిన పడ్డారు. సిల్కు వస్త్రాల తయారీకి అవసరమైన అల్కాహాల్, రేయాన్ తదితర ముడి సరుకు కొరత వల్లే ఈ పరిశ్రమ మూత పడింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన మిల్లు ప్రభుత్వ విధానాల వల్ల నష్టాల బాట పట్టి.. క్రమంగా మూతపడింది.

... 27 యెళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ ఫ్యాక్టరీ మూతపడ్డది. అందులో పని చేసే కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అలా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలెన్నో... ‘‘కాగజ్‌నగర్‌లో సర్‌సిల్క్ నడిచినన్ని రోజులు బాగుండేది... అది ఒక్కటే సారి బందయి మా లెక్క చాలా మంది జీవితాలు ఆగమయిపోయినయ్... నిలదొక్కుకున్నోళ్లు నిలదొక్కుకున్నరు. నిలదొక్కుకోనోల్లు ఆగమయిపోయిండ్రు... చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని సచ్చిపోయిండ్రు... ఆ బాధ తలచుకుంటే దుఃఖం ఆగదు కొడుకా...అంటూ ఒ మహిళ  ఆవేదన వ్యక్తం చెస్తుంది....

...నిర్వహణ లోపంతో వచ్చిన నష్టాల కారణంగా యాజమాన్యం మిల్లును మూసేసి, యంత్ర సామక్షిగిని సైతం అమ్మేసింది. దీంతో వెయ్యి మందికి పైగా కార్మికుల జీవితాలు దారం  తెగిన బతుకులయ్యాయి. 1984 ఫ్యాక్టరీ మూత పడ్డాక 5000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు....వేల మంది కార్మకులు కూలీ పని చేసుకుంటూ, హోటల్ పనీ చేసుకుంటూ బోంబాయ్, దూబాయ్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలైన మంచిర్యాల, కరీంనగర్ వలస వెళ్లారు...... రోడ్డున పడ్డా కుటుంబాలు 5000 పైగానె ఉంటాయి...


....... ఇ ఫ్యాక్టరి ముసివెత పాపంలో యాజమాన్యం, ప్రభుత్వమె కాకుండా    అప్పటి కార్మక సంఘాలు సైతం పాలుంచుకున్నాయు...అప్పటి కార్మిక సంఘ నేత ఏ.నరేందర్ మరియూ ఇతర నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కై (సర్ స్కిల్ మిల్లు) ఫ్యాక్టరీని లేఅవుట్ కు మద్దతిచ్చారు. లేఅవుట్ ప్రకటించిన తర్వాత సుమారు 4000 మంది కార్మికులు ఉద్యమబాట పట్టారు. కాని అప్పటి ఎన్.టీ. ఆర్. (తెలుగుదేశం) ప్రభుత్వము ఫ్యాక్టరీ నష్టాలను చూపిస్తున్న బిర్లా యాజమాన్యంకు మద్దతిచ్చింది.1985 ఎప్రల్ 26వ తేదీన ఫ్యాక్టరీని లాకౌట్ ప్రకటించారు. 1985 మే నెల నుండి ఫ్యాక్టరీ పూర్తిగా మూత పడిపోయింది.

... అప్పటి వరకు సాఫిగా సాగిన బ్రతుకుల్లో ఫ్యక్టరి  లాకౌట్  ఒక్కసారిగా అతలాకుతలం చెసింది...నెలనెల వచ్చె డబ్బులతో ఇల్లు గడిపె వారికి హఠాత్తుగా జీతం ఆగిపోవడంతో చాలామందికి కుటుంబ పోషణ పెనుబారంగా మారింది...ఇప్పుడున్న ఉపాది  అవకాశాలు అప్పడు లెక పోవడంతో కుటుంబపోషణ బారంనుండి తప్పించుకునెందుకు చాలామంది ఆత్మహత్యలు సైతం చెసుకున్నారు...... కెవలం 1985-88 ప్రాంతoలో 19 మంచి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
....నష్టాల పేరుతో లిటికేషన్ కు అప్పజెప్పాలని యాజమాన్యము నిర్ణయించిన యాజమాన్యం చివరకు దిన్ని అమ్మెసింది.......2002 సంవత్సరములో సారీ సిల్క్ మిల్లును అమ్మివేసిన యాజమాన్యము కోట్లాది రూపాయలు దక్కించుకుంది......2002 సంవత్సరంలో పూర్తిగా లిటికేషన్ చేతిలో కి ఫ్యాక్టరీ వెల్లింది.....2003 సం..లో కోర్టుకు వెల్లిన కార్మకులకు 70 శాతం వాటా ఇవ్వాలని హైకోర్టు తీర్పు సైతం ఇచ్చింది....అయితె కేవలం 18 శాతం మాత్రమే చెల్లించిన లిటికేషన్ అంటే 20 నుండి 30 వేలు మాత్రమే కార్మకులకు అందజెసి చెతులు దులుపుకుంది.ఇంకా 50 శాతం డబ్బులు రావాల్సిఉంది....కాని ఆ ఫ్యాక్టరీకి చెందిన మిషనరీని స్ర్కాప్ కింద అమ్మివేసినారు.
.....కంపేని నష్టపరిహారం అందకముందే  3500 మంది కార్మికులు చనిపోయారు.. ఇప్పుడు కేవలం 1000 నుండి 1200 మంది కార్మకులు మాత్రమే బ్రతికి ఉన్నారు......1984 కు ముందు ఫ్యాక్టరీ స్థలం845 ఎకరాలు ఉండేది. ఇప్పుడుకేవలం 68 ఎకరాలు ఫ్యాక్టరీ 100 ఎకరాల స్థలం మాత్రమే ఉంది. ...అంతా కబ్జాకారులు, రాజకీయ నాయకుల దోపిడకి గురైంది.....హైకోర్టు తీర్పు డబ్బులు చెందేది ఎప్పుడో, మిగిలిన1000 మంది కూడా 60 నుండి 80 సం..ల వయస్సువారు ఇకనో ఇప్పుడో అన్న పరీస్థితిలో ఉన్నకార్మికులే మిగిలారు....ఇప్పటికి సారీ సిల్క్ మిల్లు గుర్తులు జిల్లావాసులను ఎవరిని అడిగినా చెప్తారు. ఇలాంటి దయనాయపరీస్థతి దేశంలో ఎక్కడను జరగలేదని