Monday, July 23, 2012

ఓట్లే వేయడంరాని,ఓట్లేయని వారికా మనం ఓట్లేసెది.........


రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు ఇది అభినందించదగ్గ విషయమే. ఫలితాల్లో కూడా తన దాదగిరీ ప్రదర్శించిన దాదాజి 25న ప్రధమ పౌరుడిగా మారనున్నాడు .. ఇదంతా బాగానే ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు ప్రజాప్రతినిదుల ఓట్లు చెల్లలేదు, కొందరైతే ఓట్లే వేయలేదు దిన్ని'భావి'భారత పౌరులు ఎలా అర్థం చెసుకోవాలి...ఓట్లేయడమేరాని నేతలకు మనం ఓట్లేసామా.. ఓట్లేయడానికే బయటకు రాని నేతలనా మనం చట్టసభల్లోకి పంపింది..ఆంద్ర ప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు చెల్లని ఓట్లున్నాయ్.... అంటే ఇ ప్రభుద్దులకు ఓట్లేసిన ఓటరు తల ఎక్కడ దాచుకోవాలి
విళ్లేనా ఎన్నికల్లో ఓటేయమని ఇళ్ళ చుట్టు తిరిగేది. అక్షరం ముక్క కూడా రానివారేందరో బొమ్మలను చుస్తూనే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యపు గణతంత్ర రాజ్యాన్ని 60 యెండ్లకు పైగా బతికిస్తున్నారు. కాని ఓట్లేపించుకున్న నేతలు మాత్రం ఏన్నికల గేమ్ లో ఓటర్లనే ఔట్ చేసి ఏసి కార్లలో తిరుగుతున్నారు.
ఇంటిల్లిపాది పనికేళ్తేనె పుటగడవని కూలిలుసైతం పోద్దున్నే పోలింగ్ బుత్ లవద్ద గంటలతరబడి నిలబడి గర్వంగా ఓటేస్తాడు. లేచి లేవలెని ముసలోళ్శు సైతం ఓట్ల పండక్కి ముస్తాబవుతారు....గేలిచిన తరువాత వాడేం చెస్తాడో చెయడో అనే విషయాన్ని పక్కకు పెట్టిమరీ ఓట్లేస్తారు. అధికారంలో ఉన్న వాడితో విసిగేత్తి ప్రతిపక్షాన్ని గెలిపిస్తుంటారు అలా అని ప్రతిపక్షంవాడేమి ప్రతివ్రతెం కాదు ఇద్దరు ఓక్కటే కాని ఓటుకున్న పవిత్రత కాపడడం కోసం పతితల్లాంటివారినైనాసరే ఏన్నుకుంటారు తమ తమ రాజకీయకారణాలు ఎత్తి చుపుతూ ఓట్లేయడానికే బయటకురాని విరిని చూసి ఓటర్లు కూడా ఓట్లేయకుంటే విరి పరిస్థితేంటి.

No comments:

Post a Comment