గత కొన్నిరోజులుగా అటు రాజకీయవర్గాల్లో ఇటు మిడియాలో పెద్ద చర్చే సాగుతుంది. కనీసం మంత్రి పదవైనా అనుబవించకుండా ముఖ్యమంత్రైన కిరణ్ టెన్షన్ పడుతున్నాడోలేదోగాని ఆయనగారిని దించడానికి అసమ్మతి నేతలు బాగా టెన్షన్ పడుతున్నారు..ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివిధ కార్యక్రమాలకు సంబంధించి వేగం పెంచినట్లు కనబడెలా ప్రచారం చెయించుకుంటున్నాడు.ఇందుకోసం టాప్ చానల్ లలో స్లాట్స్ కోని న్యుస్ ఐటమ్స్ లాగా వెయించుకుంటున్నాడు...నత్త నడకకి ప్రతిరూపంగా వుండే కిరణ్ వేగం పెంచాడని ఆ చానల్లలో ప్రచారం మాత్రం ఊపందుకుంది.
CM పేషీలో ఫైళ్లు పేరుకు పోతున్నాయి బాబో అని మొత్తుకుంటుంటే ఆయనగారి వెగం పెరిగిందనే ప్రచారవేగం మాత్రం పెరుగుతోంద . ఓ వైపు కలంకిత మంత్రుల విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు సినియర్లు ఇయన గారిపై అధిష్టానానికి జగన్ తో అక్రమసంబందాన్నిచూపుతు ఫిర్యాదులు, మౌనదీక్షలు అంటూ హడావిడి మొదలుపెట్టారు. ఉన్న పధకాల అమలకే దిక్కులేదు మొర్రో అంటుంటే కోత్త పధకాలతో ముందుకు పోతున్నాడనే ప్రచారం మొదలైంది. కిరణ్ కుమార్ రెడ్డి CM అయి పోడిచిందేంటి దిగిపోతే పోయేదేంటో అర్ధంకావడంలేదు జనానికి
No comments:
Post a Comment