ప్రత్యెకంగా బోనాల పండుగకు మహిళలు ఎక్కువ హజరవుతారు . వారి తో పాటు పిల్లలు కూడా ఎక్కువగానే సంబరాల్లో పాల్గోంటుండడంతోగతంలో కన్నాఎక్కువ సంఖ్యలో మహిళా పోలిసులను భద్రతా విదుల్లో వాడనున్నారు. మహిళలు ఎక్కువగా వస్తుండడంతో చైన్ స్నాచర్స్ తమ చేతివాటం చుపె అవకాశం ఉన్నందున పోలిసులు దినిపై ప్రత్యెక శ్రద్ద వహించనున్నారు. ఎక్కువమంది పాల్గోనే ఉత్సవాల్లో పిల్లలు తప్పి పోవడం కూడా పెద్ద సమస్యే విటికోసం ప్రత్యెకంగా కోంత మంది CI ల అద్వర్యంలో నిఘా వుంచనున్నారు.సెన్సిటివ్ ప్రాంతాల్లో లోకల్ పోలిస్ లతో పోలిస్ పికెటింగ్ లను ఎర్పాటు చెసి గస్తి పెంచనున్నారు .పలు ప్రాంతాలను ఇప్పటికే ఆధినంలోకి తిసుకొని బాంబ్ స్క్వాడ్ లతో చెక్ చెశారు. ఉగ్రవాదుల దాడులలాంటి హెచ్చరికలేవి లెవని ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా క్లీన్ గానే ఉందని పోలిసులు చెప్తున్నారు.
చార్ మినార్ , మీర్ చౌక్ ,ఫలక్ నుమా డివిజన్ లలో ట్రాఫిక్ ఆంక్షలు నేటినుండే అమలులోకి రానున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. వైన్ షాప్ లను జాతర జరిగినన్నిరోజు లు ముసేయలని ఆదేశించారు .ఆలయ కమిటి నేతలతో కూడా ఎప్పటికప్పుడు ఎర్పాట్లపై సమిక్షిస్తున్నారు . రాజకీయనేతలు, విఐపిల కొసం ప్రత్యెక ఎర్పాట్లు చెస్తున్నారు.
మతసామరస్య ఇబ్బందులేవి తలేత్తకుండా SI CI లతో పాటు ACP స్థాయిల్లో స్థానిక రాజకీయనేతలతో మత పెద్దలతో సమవెశాలు ఎర్పాటు చేసి శాంతిభద్రతల పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.నగర కమిషనర్ అనురాగ్ శర్మ కూడా సమవెశాల్లో పాల్గోని శాంతియుత వాతావారణంలో ఉత్సవాలను జరిపుకోవాలని పిలుపునిచ్చారు
No comments:
Post a Comment