Sunday, July 22, 2012

ఆ పాప పుట్టుకతోనే సెలబ్రిటీ అయిపోయింది ........


తెలుగు సుపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతలకు పాప పుట్టడం మిడియలో ఆన్ లైన్ సైట్ల లో పెద్ద వార్తే అయ్యుంది. ఎంతో మంది సినీతారలకు పిల్లలు పుట్టారు అప్పుడు చిన్న స్ర్కోలింగ్ లతో సరిపోయింది కాని మహేష్ కూతురు విషయం అలాకాలేదు బ్రేకింగ్ న్యుస్ అంటు ఫోన్ ఇన్ లు పెట్టి మరి హంగామా చెశారు ఇక వెబ్ సైట్ లలో కొత్త కొత్త కోణాల్లో కథనాలు అల్లుతున్నారు. శ్రావణ శుక్రవారం అని, సింహరాశి అంటు పేరు సితార అని రాజమౌళి ఆ పెరు పెట్టడాంటె పూరీ ఇ పెరు సుచించాడని రాసేశారు.ఆకరికి స్టెమ్ సెల్స్ బద్రపరిచారన్న విషయాన్ని విశ్లేషించారు.అప్పుడె పుట్టిన పాప ను సెలిబ్రిటీ చేశారు. టాలివుడ్ సుపర్ స్టార్ గా వెలుగోందుతున్న మహేష్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఆ పాప విషయాన్ని హైలెట్ చెశారు. మొన్నోక న్యుస్ సైట్ అయితే అసలు ఆ పాప పుట్టకముందే పుట్టిందని వార్త ఇచ్చేసి సిన్ క్రియెట్ చేసింది. ట్విట్టర్ ద్వారా అభిమానులను పలకరించే మహేష్ బాబు ఇంతవరకు పాప విషయం పై ఎలాంటి కామేంట్ పోస్ట్ చెయలెదు రేపో ఎల్లుండో మహేష్ తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటే అదో న్యుస్ అవుతుంది. గౌతమ్ పుట్టినప్పుడు కూడా ఇంత హంగామా జరగలేదు కాని ఈ పాప మాత్రం పుట్టడానికి ముందే సెలబ్రిటి అయింది. మొన్న అమితాబ్ మనవరాలు ఐశ్వర్య కూతురు కూడా ఇలానే వార్తల్లోకెక్కింది ....................

2 comments: