Tuesday, July 24, 2012

సిరిసిల్ల టూర్ లో YS విజయ కోల్పోయిందేంటి? సాదించిందెంటి?




చేనేత దీక్ష పేరుతో విజయ చెపట్టిన తెలంగాణ యాత్రకు అడుగడుగునా తెలంగాణ వాదులు అడ్డుతగిలే ప్రయత్నం చెసినా బారిబలగాలతో బాగానే కట్టడి చెశారు.తెలంగాణలో ప్రత్యెకవాద సెంటిమెంట్ తో పోలిస్తే ysవారి సింపతి అయింటిమెంట్ అస్సలు పనిచెయదన్నది జగనెరిగిన సత్యం అందుకే మొన్నటి ఉపఏన్నికల్లో kcrతో మిలాకత్ అయ్యారని టాక్ వచ్చినా సరేఅని తెలంగాణలో
పోటినుండి తప్పుకున్నాడు పోటీచేస్తే ఓడిపోవడం కాయమని డిసైడ్అయి సైడ్ అయ్యాడు. CBI దాడి , ED వేడి, జగన్ అరెస్ట్ పరిణామాలతో తెలంగాణలో సైతం రాజుగారి ఫ్యామిలికి సింపతి ఎర్పడింది పాపం ఓంటరయ్యాడు అని అనడం వినిపించింది. అటు ఆంద్రలో జగన్ ఇటు తెలంగాణలో KCR అనుకున్నారంతా........ TDP తో పోలిస్తే YSRCP నయం అన్నారంతా...


కాని ఈ టూర్ తో సీన్ రివర్స్ అయింది పోలిసుల ఓవరాక్షన్ , YSRCP కార్యకర్తల వీరంగం తెలంగాణ వాదుల్లో నెగిటివ్ ఫిలింగ్స్ నింపాయి... జీప్ ఎక్కి నిరసణ తెలిపిన మహిళను తోసేయడం, విద్యార్థులను చితకబాదడం టివిల్లో చూసిన తెలంగాణ వాదులు ఎలా ఆలోచిస్తారు ..మొన్నటివరకు YS విజయ పై ఉన్న సింపతిపోయి వ్యతిరెఖత ఎర్పడ్డానికి ప్రధాన కారణాలుగా ఇలాంటివే అవుతాయి. విజయ టూర్ లో ఆమె ట్రూప్ చెలరేగిపోవడం భావోధ్రేకాలు రెచ్చగోట్టడం మాకెంతో మేలు చెస్తుందని TRS లోని ముఖ్య నేత ఓకరు ఆఫ్ ధి రికార్డ్ మాట్లాడుతూ చెప్పారు. ఇలా టీ ప్రజల సింపతీని YS ఫ్యామిలి కోల్పోయినట్టయింది


ఇక సాదించిందేదైనా ఉందంటే KCR తనయిడి ఇలాకాలో అనుకున్నవిదంగా దీక్ష నిర్వహించడం దిని ద్వారా తమ సత్తాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించడం. YS ఫ్యామిలికి మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోగలిగే సత్త ఉందని నిరూపించుకోవడం ... తద్వారా సిమాంధ్రలో హిరోలుగా నిలబడోచ్చు తెలంగాణలో సైతం క్యాడర్ ను తయారుచెసుకోవడం ...మొన్నటి బై ఏలక్షన్ ల లాగా కాకుండా తెలంగాణలో 2014 నాటికి గట్టిపోటీ ఇచ్చే పార్టిగా తయరుకావచ్చు.
YSRCP మొలకేత్తిందే సానుభూతి తోటలో మరి అదే కోల్పోతున్నప్పుడు తదుపరి ప్రయోజనాలెలా పోందగలరో.....





No comments:

Post a Comment