మొన్నటి ఉపఏన్నికల్లో సిమాంద్రను గెలిచిన (YSR)కాంగ్రెస్ తెలంగాణ పై కన్నేసినట్లు కనిపిస్తుంది.. పరకాలలో జస్ట్ మిస్ అయిందనపించడంతో సిరిసిల్లను వెదికగా చేసుకుంది . కేటియార్ ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతాన్ని ఎంచుకొవడం కవ్వింపు చర్యకు పాల్పడ్డం ఓ రాజకీయ ఎత్తుగడ ఇది ఢిల్లిలో పురుడుపోసుకుందనే చర్చ సాగుతుంది. మొన్న ఢిల్లికెళ్లిన YSవిజయ ఒప్పందాల అమలులో ఇదో బాగం....
జైల్ హిరో జగన్ కు విస్తున్న గాలి ద్వారా తెలంగాణ వాదాన్ని ఎదుర్కొనె ప్రయత్నం చెసింది YSRCP ముసుగులో ముసలోల్ల కాంగ్రెస్. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు వెయడంలో తలలు పండిపోయిన పంచెకట్టునేతల సలహతో నేతన్న సమస్యలంటూ సిరిసిల్లలో కాలుపెట్టిన విజయ దిక్ష విజయవంతం అయినట్టేనా?.....3000మంది పోలిసులనిచ్చి పంపిన కిరణ్ సర్కార్ ఇ టూర్ ద్వారా మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలెపుకున్నట్టైంది . మరొసారి రాళ్ల దాడులు , బంద్ లు మొదలయ్యేలా చెసింది ఉద్యమ వెడి తగ్గినప్పుడల్ల ఇలా ఎవరో ఒకరు కెలుకుతూ మంట చల్లారిందా లెదా అని చుస్తూ వేళ్ళు కాల్చుకుంటున్నారు. ఈ టూర్ లో పోలిసులూ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. TRS పార్టి కార్యలయంలోకి చొరబడి మరి చితకబాదారు దింతో తెలంగాణ భవన్ వద్ద ఉధ్రిక్తత నెలకొంది . మెదక్ లో టియర్ గ్యాస్ ప్రయోగం కూడా పోలిసుల దుకూడు చర్యే.
No comments:
Post a Comment