Showing posts with label Pranab. Show all posts
Showing posts with label Pranab. Show all posts

Sunday, July 29, 2012

తెలంగాణ ఇస్తే సమస్యలు...... మరి ఇవ్వకపోతే?




తెలంగాణ ఇస్తే నదీ జలాల కొట్లాటలు జరుగుతాయని భౌగోళిక సమస్యలు వస్తాయని కేంద్రం భయపడుతోందని, అందుకే తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా లెదంట ...మరి తెలంగాణ ఇవ్వకపోతే నష్టాలేం లేవా గొడవలేం జరగవా.. అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ను సమస్య పరిష్కార కోణంలో కాకుండా, ఓట్ల రాజకీయ కొణాల్లోనే వాడుకుంటున్నాయి...... అపరమెధావుల్లా అధిరకారాన్ని ఎంజాయ్ చెస్తున్న ఢిల్లీ నేతలకు ఇ సమస్య పరిష్కారానికి సమయమే దొరకడంలేదా..రాష్ట్రం మొత్తం రణరంగం అవుతున్నప్పుడల్లా తాత్కాలికంగా ఆపడానికేన్నో తాంత్రిక విద్యలు ఢిల్లీనుంచే అమలుచెస్తు సద్దుమనిగించే వారికి శాశ్వత పరిష్కారమే దోరకడంలెదా ..ఓ సారి తెలంగాణ ఇస్తామని ఓ సారి కాదని మరోసారి చర్చ జరగాలని గందరగోళం క్రియెట్ చెస్తున్నారు...ఎందుకిదంతా ?
విభజించకపోతే సమస్యలు రావని ఎవరైనా చెప్పగలరా.. ఒకప్పుడు చెన్నారెడ్డి ని కోన్నారు తరువాత KCR వచ్చాడు , ఇయనగారినీ ఒప్పిస్తే కొన్నాల్ల తరువాత మరో నేత ఇదే వాదాన్ని బుజానెత్తుకోని బయలుదేరుతాడు ఇలా ఎంతమంది ఎన్నేల్లు..తరానికో నేత రెచ్చగోడతాడు వందలు వేల మంది విద్యార్ధులు చచ్చిపోతారు దీనికి అంతమేలేదా.........ఉంటే దాన్నిఎవరు చూపాలి? ముమ్మాటికే ఢిల్లీ పెద్దలే... వారిని ఆ దిశగా నడపాల్సింది రాష్ట్ర నేతలే విరిరువురుని ఆ దిశగా నడపాల్సింది వారికి ఓట్లేసే ప్రజలే ...................


Monday, July 23, 2012

ఓట్లే వేయడంరాని,ఓట్లేయని వారికా మనం ఓట్లేసెది.........


రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు ఇది అభినందించదగ్గ విషయమే. ఫలితాల్లో కూడా తన దాదగిరీ ప్రదర్శించిన దాదాజి 25న ప్రధమ పౌరుడిగా మారనున్నాడు .. ఇదంతా బాగానే ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు ప్రజాప్రతినిదుల ఓట్లు చెల్లలేదు, కొందరైతే ఓట్లే వేయలేదు దిన్ని'భావి'భారత పౌరులు ఎలా అర్థం చెసుకోవాలి...ఓట్లేయడమేరాని నేతలకు మనం ఓట్లేసామా.. ఓట్లేయడానికే బయటకు రాని నేతలనా మనం చట్టసభల్లోకి పంపింది..ఆంద్ర ప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు చెల్లని ఓట్లున్నాయ్.... అంటే ఇ ప్రభుద్దులకు ఓట్లేసిన ఓటరు తల ఎక్కడ దాచుకోవాలి
విళ్లేనా ఎన్నికల్లో ఓటేయమని ఇళ్ళ చుట్టు తిరిగేది. అక్షరం ముక్క కూడా రానివారేందరో బొమ్మలను చుస్తూనే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యపు గణతంత్ర రాజ్యాన్ని 60 యెండ్లకు పైగా బతికిస్తున్నారు. కాని ఓట్లేపించుకున్న నేతలు మాత్రం ఏన్నికల గేమ్ లో ఓటర్లనే ఔట్ చేసి ఏసి కార్లలో తిరుగుతున్నారు.
ఇంటిల్లిపాది పనికేళ్తేనె పుటగడవని కూలిలుసైతం పోద్దున్నే పోలింగ్ బుత్ లవద్ద గంటలతరబడి నిలబడి గర్వంగా ఓటేస్తాడు. లేచి లేవలెని ముసలోళ్శు సైతం ఓట్ల పండక్కి ముస్తాబవుతారు....గేలిచిన తరువాత వాడేం చెస్తాడో చెయడో అనే విషయాన్ని పక్కకు పెట్టిమరీ ఓట్లేస్తారు. అధికారంలో ఉన్న వాడితో విసిగేత్తి ప్రతిపక్షాన్ని గెలిపిస్తుంటారు అలా అని ప్రతిపక్షంవాడేమి ప్రతివ్రతెం కాదు ఇద్దరు ఓక్కటే కాని ఓటుకున్న పవిత్రత కాపడడం కోసం పతితల్లాంటివారినైనాసరే ఏన్నుకుంటారు తమ తమ రాజకీయకారణాలు ఎత్తి చుపుతూ ఓట్లేయడానికే బయటకురాని విరిని చూసి ఓటర్లు కూడా ఓట్లేయకుంటే విరి పరిస్థితేంటి.

దాదా మన కొత్త రాష్ట్రపతి


రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్ కు అభినందనల పరంపర వెల్లువెత్తుతుంది. మొత్తానికి దేశ 13 వ రాష్ట్రపతి గా 25న ప్రమాణస్వికారం చెయనున్నాడు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
రాష్ట్రాల వారిగా ఓట్లు:
ఏపీ ఎమ్మెల్యేల ఓట్లలో ప్రణబ్‌కు 182, సంగ్మాకు 3, చెల్లని ఓట్లు 5 అరుణాచల్‌ ప్రదేశ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, చెల్లని ఓట్లు 3 అసోం ఓట్లలో ప్రణబ్‌కు 110, సంగ్మా 13, చెల్లని ఓట్లు 2 బీహార్‌ ఓట్లలో ప్రణబ్‌కు 146, సంగ్మా 90 జార్ఖండ్‌లో ప్రణబ్-60, సంగ్మా-20 ఓట్లు జమ్మూకాశ్మీర్‌లో ప్రణబ్-68, సంగ్మా-15 ఓట్లు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రణబ్-23, సంగ్మా-44 ఓట్లు హర్యానాలో ప్రణబ్-53, సంగ్మా-29 ఓట్లు ఛత్తీస్‌గఢ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, చెల్లని ఓట్లు 1
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌లో సంగ్మాకు ఆధిక్యం లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో క్రాస్ ఓటింగ్‌ నమోదైంది.
కర్ణాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103 మధ్యప్రదేశ్‌లో ప్రణబ్-73, సంగ్మా-156 ఓట్లు గోవా ఓట్లలో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, చెల్లని ఓట్లు 1 గుజరాత్‌లో ప్రణబ్-59, సంగ్మా-123 ఓట్లు