Saturday, May 25, 2013

కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది

కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. కొంత కాలంగా అధిష్ఠానాన్ని ఎదిరిస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పా ల్గొని తెలంగాణవాణి వినిపిస్తున్న పెద్దపల్లి ఎంపీ జి వివేక్ టీఆర్ఎస్‌లో చేరేందుకు సమాయత్తం అయ్యారు. ఎంపీ తన అనుచర వర్గంతో హైదరాబాద్‌లో ని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో టీఆర్ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు జరుపుతున్నా రు. కాంగ్రెస్ ఎంపీలు జి వివేక్, ఎస్ రా జయ్య, మంద జగన్నాథంలను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
ఎంపీ బాటలోనే అనుచర వర్గం కూడా పెద్ద ఎ త్తున టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సమాయత్తం కావడంతో కాంగ్రెస్‌లో కల కలం మొదలైంది. తెలంగాణ ఏర్పాటు పై ఈ నెల 30వ తేదీలోగా తేల్చాలని కాంగ్రెస్ ఎంపీలు గడువు విధించినా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందిస్తున్న వి శ్వాసం లేకపోవడంతో వీరు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రంతో తాడోపేడో తే ల్చుకోవడానికి కాంగ్రెస్ ఎంపీలు యూ పీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాందీలను కలిసేందుకు యత్నించగా అవ కాశం లభించకపోవడంతో టీఆర్ఎస్ లో చేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కు ఉద్యమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం కాంగ్రె స్‌లో ఉన్న ఎంపీ వివేక్ టీఆర్ఎస్‌లో చే రితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఎవరి స్థానంలో వారు టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నిర్ణయించుకొని టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావుతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాతనే వచ్చే నెల 2న టీఆర్ఎస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఎంపీ వివేక్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ముహూర్తం నిర్ణయించడంతో ఆయన అనుచర వర్గం ఆందోళన చెందుతోంది.
ఇటీవలనే కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో ఎంపీ వర్గానికి చెందిన వారికి కూడా పదవులు దక్కాయి. ప్రస్తుతం ఎంపీ కాంగ్రెస్‌ను వీడితే వీరి పదవులు మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలి పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలోని తూర్పు ప్రాంతంలో తెలంగాణ ఉద్య మం బలోపేతంగా ఉండగా టీఆర్ఎస్‌లో కూడా సంస్థాగత పార్టీ పదవుల ను ఉద్యమంలో చురుకుగా పని చేస్తున్నవారికి కట్టబెట్టారు. ఎంపీ అనుచర వర్గం టీఆర్ఎస్‌లో చేరితే ద్వితీయ శ్రేణి నాయకులుగా పని చేసే పరిస్థితులు ఉంటాయి. దీనికి కొందరు ఎంపీ అ నుచర వర్గం నాయకులు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లోనే ఉండేందుకు సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో పదవు లు దక్కించుకున్న వారు రెండు రోజుల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుతో మంతనాలు జరిపి కాంగ్రెస్‌లోనే ఉండేందుకు నిర్ణయించుకోగా మరి కొందరు ఎంపీ బాటలోనే టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుల మధ్య కొం తకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇరు వర్గాల వారు పరస్పర ఆరోపణలు చేసుకొని దిష్టిబొమ్మలను దహనం చేసుకున్న సంఘటనలు కూ డా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై తె లంగాణ విషయంలో ఒత్తిడి తెస్తూ ముఖ్యమంత్రి పై ప్రత్యేక ఆరోపణలు చేసిన ఎంపీకి అధిష్ఠానం మద్దతు లభించలేదు. ఇదే సమయంలో ప్రేం సాగర్‌రావు అధిష్ఠానానికి దగ్గరయ్యా రు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాలలో నిర్వహించిన ముఖ్య మంత్రి సభను వి జయవంతం చేసి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేశారు.
సహకార సంఘాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు భారీ మెజార్జీ తెప్పించడంతో అ«ధిష్టానం పార్టీ పదవుల కేటాయింపులో కూడా మాజీ ఎమ్మెల్సీ వర్గానికే ప్రాధాన్యతను ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇమడ లేకపోతున్న ఎంపీ కొంత కాలంగా టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుండగా ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు.
 

No comments:

Post a Comment