గత కొన్ని రొజులుగా రాష్ట్ర రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయు.రాబోయే కాలం మరింత గడ్డుకాలంగా మారనుంది...... ఇప్పటికే రాష్ట్ర ప్రధాన నేతలందరు ఏదో ఓక సమస్యతో ఉన్నారు ఏప్పుడు ఏవరి పదవికి గండం వస్తుందోనని ఏవరికివారు టెన్షన్ పడడంతో సరిపోతుంది...ఏంతో మంది ఏదురుచూస్తున్నట్టుగా కిరణ్ సీటుకిందికి నీళ్లోస్తాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికి ... అదిగో ఇదిగో అంటూ పుకార్లు మాత్రమె వరదలై ప్రవహిస్తున్నాయు..అజాద్ మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఉండదని చెప్పలేనని, అయితే ఆ చర్చ జరగలేదని అజాద్ అనడంతో మరోసారి సంక్షోభానికి, లాబీయింగ్ లకు అవకాశం ఇచ్చినట్లయింది.
ఇక బోత్సా సంగతి సరేసరి సత్తిబాబు ను మర్చెస్తున్నారని దాదాపు అధికారిక ప్రకటనే తరువాయు అన్నంత లెవల్లో ప్రచారం జరిగింది. ఆయనగారు కూడా డిసైడ్ అయి...వేదాంత దోరణిలో పదవి ఉంటే ఏంతా ఉడితే ఏంతా అని సన్నిహితులతో చెప్పుకున్నారు..అయితే ఇ ప్రచార పర్వాల వెనక ఏవరున్నరోనన్నదీ అందరికీ తెలిసిందే..బొత్సను మార్చుతారని ముఖ్యమంత్రి వర్గం ప్రచారం చేయగా, సి.ఎమ్.ను మార్చవచ్చని బొత్స వర్గం ప్రచారం చేసింది.ఈ మధ్యలో ఇద్దరిని మార్చరని కొందరు అభిప్రాయపడినా, బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయనను తప్పిస్తారేమోనన్న భావన కలిగించాయి.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి మరోలా ఉంది... అదికారంలో లేకున్నా ప్రభుత్వలోపాలపై స్పందిద్దాం అంటే ......బాబు గారి పాలన పదేళ్లు దాటినా ప్రజలు ఇంకా మరిచిపోలేక పోతున్నారు..విద్యుత్ పోరులో తెలుగు తమ్ముల్లు పాల్గోంటున్నప్పటికి బషీర్ బాగ్ ఉదంతాలు వారిని పిడకలల్లా వెంటాడుతున్నాయ్ ..ఇక SC వర్గికరణ లాంటి తెనే తట్టులను కెలికి మరో సమస్యకు తానే శ్రీకారం చుట్టుకున్నాడు...తెలంగాణ పై తెల్చేస్తానంటూ ప్రకటిస్తుండడంతో దాని పర్యావసానం ఏలా ఉంటుందో చూడాలి..
సెప్టెంబర్ నెలలొ తెలంగాణ పై ఏదో తెల్చేస్తానంటు కేంద్రం సంకేతాలిస్తుండడంతో మరోసారి అదికార, ప్రతికార పక్షాలు మరిన్ని ఇబ్బందులు ఏదుర్కోక తప్పదు .కేంద్రం ఏ నిర్ణయం తిసుకున్నా సమస్యలు మాత్రం తక్కువో ఏక్కువో ఉండనైతే ఉంటాయు... సెప్టేంబర్ 30 మిలియన్ మార్చ్ తరహాలో మరో కార్యక్రమం రుపోందిస్తుంది TJAC అది కార్యరుపం దాల్చితే అదో సమస్య అయ్యే అవకాశం ఉంది...ఇలా సమస్యల మీద సమస్యలతో సెప్టేంబర్ రాబోతుంది. మరో పెద్ద సమస్య మద్యంతరం ముంచుకోస్తుందా అనేది వస్తే రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది ........ఏమొ ఏదైనా జరగోచ్చు..చుద్దాం ఏం జరుగుతుందో.....