Wednesday, August 1, 2012

KVP కి YS గుర్తోచ్చాడు.........



వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబందువు కేవిపి రాంచందర్రావ్ ఉన్నట్టుండి మిత్రుడిపై ప్రేమను గాంధీ భవన్ లో జరిగిన పార్టిమిటింగ్ లో బయటపెట్టారు. కాంగ్రెస్ అంతా ఓకదిక్కు జగన్ మరోదిక్కు అయినప్పుడు KVP మాత్రం కాంగ్రేస్ తోనే ఉండిపోయారు. ఏనాడు జగన్ పై నేగిటివ్ గా కాని పాజిటివ్ గా గాని కామెంట్ చేయలేదు. సమయం దోరికినప్పుడల్లా ys ను సినియర్ నేతలు ఆడిపోసుకుంటున్నా మనోడు మౌనంగానే ఉన్నారు ...కాని గాంధి భవన్ లో మంగళవారం జరిగిన యువజన కాంగ్రేస్ నేతల ప్రమాణ స్వికారోత్సవం రోజున మాత్రం YS జిగిరి దోస్త్ KVP తన మిత్రుడి ఫోటో లేదని తెగ ఫిలయిపోయారు... దాదాపు ఏడ్చినంత పనిచేశారు.
ఈ ఫోటో ఏడుపుల సీన్ చూసి మరికోందరు నేతలు కూడా ఫోటో కామెంట్లు చేసేశారు. కార్యకర్తలైతే ఓక్కసారిగా ఈలలు చప్పట్లు YS నినాదాలతో హొరెత్తించారు..
నిన్న గాక మొన్ననే ys ఫోటోలు తిసి ఇందిరమ్మ ఫోటోలు పెట్టాలని నివేదికలు సమర్పించుకున్న నేతలకు KVP మాటలు షాక్ ఇచ్చినట్లైంది.. సినియర్ నేతలు , ఇంతకీ KVP యువజన కాంగ్రెస్ మిటింగ్ లో YS సెంటిమెంట్ ను ఎందుకు తట్టిలేపాడో మరి? కాంగ్రెస్ సినియర్లు , రాజకీయవిశ్లేషకులు ఈ మాటలకు అర్థాలను కొత్త కొత్త కోణాల్లో ఏకి పీకి పారేయడంలో అప్పుడే బిజి అయిపోయారు..

No comments:

Post a Comment