Wednesday, August 1, 2012

బాబు గారి బిసి బిస్కేట్ రాజకీయ జపం యమ బోరు......



చంద్రబాబునాయిడు రాబోయే ఏన్నికల్లో సిట్ల పంపకం అప్పుడే మొదలుపెట్టాడు. బిసిలకే అన్ని అనేసరికి ఆ నేతలు ఇప్పుడే
స్విట్లుకూడా పంచుకుంటున్నారు...గెలిచేవారుంటే వందకుపైగా సిట్లిస్తామంటున్నాడు.బిసిలకిస్తున్న ఆఫర్లన్ని నిలబెట్టుకుంటాడో లెదో కాని కులాలు వర్గాల వారిగా ఓట్లరాజకీయాలను ప్రారంబించేశాడు. దినితో అన్ని పార్టిలు ఒక్కసారిగా బుజాలు తడుముకుంటున్నాయి అధికార కాంగ్రేస్ సైతం స్పందిచాల్సిన పరిస్థితి ఏర్పరిచారు మన బాబు..

కాని నిజంగానే బిసి వర్గాలకే వంద సీట్లు ఇస్తే అప్పుడు ఎదురయ్యే రాజకీయ పరిణామాల మీద పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరికి సందేహాలు కూడా ఉన్నాయి. అయినా పార్టీ విజయావకాశాలపై బిసి బిస్కేట్ రాజకీయం ఎంతగా పని చేస్తుందో కాని బలహిన వర్గాలపై నారావారి వరాల జల్లు చూసి టిడిపి బిసి నేతలంతా వారి అధ్యక్షులవారిని సన్మానాలతో ముంచేత్తిస్తున్నారు.ఈ సన్మానలే కోంచేం శృతి మించుతున్నాయి మొత్తం స్కిమ్ నే పబ్లిసిటీ స్టంట్ అనుకునేలా చేస్తున్నాయి.అయితే గేలిచేవారుంటే ఏ కులమైనా, మతమైనా సరే ఏ పార్టి అయినా వదులుకుంటుందా? మొత్తం మీద చంద్రబాబు 2014 ఏన్నికలకు బాగానే ప్రిపేర్అవుతున్నారు.........


No comments:

Post a Comment