వయసు 50 పైనే , గుండె సమస్యలతో సతమతం అవుతున్నాడు, షుగర్ వ్యాదితో కాలు తిసేయాల్సిన పరిస్థితి, ఈ ఆపత్కాలంలో అయినవారంతా వున్నా వారి సేవలకు సైతం ఆ అబాగ్యుడు నోచుకోలేదు. క్షణికావేశంలో తెలిసో తెలియకో చేసిన నేరానికి 22 ఏళ్లుగా జైల్లో మగ్గుతూ కుటుంబానికి దూరమై మదనపడుతున్నాడు .కుటుంబ పెద్ద చేసిన నేరానికి ఆ కుటుంబం కూడా పెద్ద శిక్షే అనుబవిస్తుంది.తండ్రి విడుదలకోసం కొడుకు చెయని ప్రయత్నంఅంటూ లేదు, అనారోగ్యంగా ఉన్న బర్తను చూసి ఆ ఇల్లాలు విలవిలలాడుతోంది.
ఖధీర్ క్షణికావేశంలో తెలిసో తెలియకో చేసిన నేరానికి శిక్షగా 22 ఏళ్లుగా జైళ్లలోనే మగ్గిపోతున్నాడు.
ఖదీర్ ఇప్పుడు వయసు పైబడి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాదపడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. షుగర్ వ్యాది తీవ్రత అధికంగా ఉండడంతో ఖధీర్ కాలు కూడా తిసేయల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.తన బర్తకు జీవిత చరమాంకంలోనైనా సేవలు చేసుకునే సౌకర్యం లేకపోయింది ఆ అబాగ్యురాలికి...ఖధీర్ లాంటివాళ్లేందరో మన జైల్లల్లో మగ్గిపోతున్నారు...........
ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే అతనిలో పరివర్తన కలుగుతుందని పలు కమిషన్లు నివేదికలిచ్చాయి.
క్షనికావేశంలో చేసిన నేరాలకు జీవితాంతం జైలు నాలుగు గోడల మధ్య ఉండిపోవాల్సిందేనా అని ఆ ఖైదీలు విలపిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో ఉండిపోతే మా కుటుంబాలు పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రసాదించే క్షమాభిక్ష దొరికేనా అని ఖైధీలు వారి కుటుంబం ఎదురు చూస్తున్నారు. నిజానికి ఒక ఖైదీ ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే అతనిలో పరివర్తన కలుగుతుందని పలు కమిషన్లు నివేదికలిచ్చాయి. అయినా, ప్రభుత్వానికి అవి చెవికెక్కవు. ఇప్పటికీ ఎంతో మంది ఖైదీలు రెమిషన్‌తో కలుపుకొని 20 సంవత్సరాలు దాటినా ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు. మానావ హక్కుల సంఘాలు సైతం ప్రభుత్వ పోకడలపై మండిపడుతున్నారు. ఖదీర్ లాంటి వారిని మనవాతాకోణంలో ఆలోచించి మెర్సి పిటిషన్ కు స్పందించి విడుదల చేయలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చెస్తున్నాయి....
ఏళ్లకేళ్లు జైల్లలో మగ్గుతున్న వారిగురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ప్రభుత్వాలు సైతం వారి గురించి మరిచిపోతుంది. కనీసం జాతీయ పర్వదినాలు, గాంధీ జయంతి నాడు లభించే క్షమాభిక్షకైనా నోచుకొంటామా లేదా అని ఆ ఖైధీల ఆశలు అడిఆశలే అవుతున్నాయి....
ఇలా జైలు గోడలకే పరిమితమవ్వడానికి కారణం వారికి రాజకీయ అండదండలు, అర్థ బలం లేకపోవడమే. ఇలాంటి ఖైదీలు చర్లపల్లి జైలులో కోకొల్లలు.
ఖదీర్ లాంటివారి విషయంలో కోందరు స్థానిక నేతలు ప్రయత్నాలు చేసిన అవి సఫలం అవుతాయన్న గ్యారింటీ లెకుండా పోయింది.
ప్రజా ప్రతినిధులను హత్య చేసిన వారు క్షమాబిక్ష పరిదిలోకిరారు....
ఫ్యాక్షనిస్టులు, మద్దెల చెరువు సూరి, గౌరు వెంకట్‌డ్డిలాంటి వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ప్రభుత్వం సాధారణ ఖైదీలపట్ల శ్రద్ధ కనబరచటం లేదని ఖైదీలు వారి కుటుంబాలు వాపోతున్నాయు. ఉదాహరణకు ఖధీర్ విడుదలపై జైలు అధికారులను వివరణ కోరగా, ఆయుధాల చట్టం, 120బీ, 302, 353, ప్రభుత్వాధికారులను, ప్రజా ప్రతినిధులను హత్య చేసిన వారిని క్షమాభిక్ష పరిధిలోకి తీసుకు రావద్దని ప్రభుత్వమే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసినందున కొందరికి క్షమాభిక్ష దొరకలేదని అధికారులు అంటున్నారు.తెలిపారు. ఈ ఆగస్టు 15న క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని, అందిన వెంటనే అర్హులైన ఖైదీలందరిని క్షమాభిక్షపై విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని జైలు అధికారులు అంటున్నారు.
22యేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్న సరబ్‌జిత్‌ను విడుదల చేయాల్సిందిగా కోరుతోంది భారత ప్రభుత్వం.....
మానవతా కోణంలో బారతియుడి విముక్తి కోసం దాయాది దేశానికి విజ్ఞప్తి చెస్తున్న ప్రభుత్వాలు మన దేశంలోనే సంవత్సరాల తరబడి దుర్బర జైలు జివితం గడుపుతున్న పౌరులపై ఎందకింత వివక్ష చుపుతోందనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది.
No comments:
Post a Comment