Saturday, August 18, 2012

అవి నీళ్లు కాదంట...నీళ్లకంటే ఏక్కువేనంటున్నారు......



అందం కావాలా అయితే అయిదు లీటర్ల నీళ్లు తాగండి... ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా దానికీ నీళ్లే తాగాలి ..రోజూ ఉదయాన్నే రేండు లీటర్లని మద్యాహ్ననికి మరో మూడులీటర్లని రాత్రికి మరిన్ని లీటర్లంటు నీళ్లే సర్వరోగనివారినిలా ప్రచారం జరిగిపోయింది.ఇలా నీళ్లు తాగించే తతంగం వెనక అసలు కథేంటీ....కలికాలంలో ఖరీదైన వస్తువుల జాబితాలో చేరిపోయిన నీళ్లను అదే పనిగా తాగించేస్తూ మన డబ్బులను మంచినిళ్లలా ఖర్చు చేయించడం వేనక వ్యాపారుల ప్రయెజమేనా అంటే అవుననే అంటున్నారు సైంటిస్టులు.నిజంగా ఎన్ని నీళ్లు తాగాలి....ప్రపంచవ్యాప్తంగా జరిగిపోయిన ఈ నీళ్ల ప్రచారానికి కారాణాలేంటి....

ఈ మద్యకాలంలో అన్ని రోగాలకు నీళ్లే నివారణ అని ఏన్ని ఏక్కువ నీళ్లు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటామంటూ ప్రచారం జరిగపోయింది..
చర్మం పై ముడుతలు పోవాలన్నా , అందంగా తయారవ్వాలన్నా నీళ్లు తాగండంటూ చెప్పేస్తున్నారు..కిడ్ని వ్యాదులుంటే ఇంకోంచేం ఏక్కువ నీళ్లు తాగాలని అనుకుంటూ తాగేస్తున్నారు.. కాని అసలు దీని వేనుక బాటిళ్ల వ్యాపారుల ప్రయెజనాలే తప్ప అసలు నిజం వేరే ఉందంని వ్యాపారుల ప్రయెజనాలకోలసం అపోహలను విజయనంతంగా ప్రచారంలోకి తెచ్చారంటున్నారు శాస్త్రవేత్తలు ...ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీ పరిశోదకుడు స్పెరో సిండోస్ చేసిన సర్వేల్లో ఈ విషయాలు వేలుగులోకి వచ్చాయి...

అసలు ఆరోగ్యంగా ఉండే మనిషి రోజుకి ఏన్ని నీళ్లు తాగాలి ...రోజుకి రెండు లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుందని డాక్టర్లంటున్నారు ...కీడ్నీ వ్యాదులతో బాదపడే వారు ఏక్కువ నీళ్లు తాగితే మరింత ఇబ్బందులను ఏదర్కోవాల్సుంటుందని డాక్టర్లు చేబుతున్నారు. ....గుండె జబ్బులున్న వారు సైతం నీళ్లు తక్కువ తాగలని సూచిస్తున్నారు వైద్యులు....మనం రోజూ జ్యూస్ లు , పాలు తదితర ద్రవపదార్థాలన్నింటినిలో నీళ్లు ఉంటాయి కావునా వాటిని కలుపుకోని 2లీ వచ్చేలా తాగితే సరిపోతుందంటున్నారు. ఏక్కువ నీళ్లు తాగినంత మాత్రానా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదంటున్నారు...ఏండాకాలంలో మాత్రం కోంచెం ఏక్కువ నీళ్లు తాగాలని ..వర్షాకాలం, చలికాలం మాత్రం నీళ్లు అతిగా తాగాల్సిన అవసరముండదంటున్నారు...



నీళ్లు ఏక్కువ తాగాలన్నది కేవలం అపోహేనని ..తాగల్సినన్ని నీళ్లకంటే ఏక్కువ నీళ్లు తాగితే ఇబ్బందులను ఏదర్కోవాల్సి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.. నీళ్లు తక్కువ తాగినా ఏక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు.. గతంలో ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని ఓ ప్రచారం జరిగిపోయిందని దానిలో ఏలాంటి శాస్త్రీయత లేకున్నా ప్రజలు గుడ్డిగా నమ్మి అయిల్ పుల్లింగ్ చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అలాంటి ప్రచారమే ఇప్పుడు నీళ్ల విషయంలో జరిగుతోందంటున్నారు డాక్టర్లు ....



వ్యాపారులు మాత్రం తమ ప్రయెజనాల కోసం ప్రచారాన్ని మరింత ముందుకు తిసుకేళ్తున్నారు... మా నీళ్లలో ఏక్కువ మినరల్స్ ఉంటాయని ఓకరంటే మా నీళ్లలో ఏక్కువ ఆక్సిజన్ ఉందంటూ జనాల్లోకేళ్తు వారి జేబులు కాలీ చేసేస్తున్నారు....కోత్తగా ఓ కంపేని అయితే మా నీళ్లు అసలు నీళ్లే కావని విటిలో న్యుట్రియంట్స్ సైతం ఉంటాయంటూ ప్రచారానికి తెరలేపారు...ఏవరికి తోచిన పద్దతిలో వారు తమ దాహాన్ని తీర్చుకుంటే చాలని అపోహలను అసత్యాలను నమ్మి ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దంటున్నారు శాస్త్రవేత్తలు......









1 comment:

  1. మంచినీళ్ళంటూ కూడా మనుషుల్ని మోసంచేస్తున్నారని మంచి ఉపయుక్తమైన పోస్ట్ ద్వారా చెప్పారు. అభినందనలు!

    ReplyDelete