Friday, December 28, 2012

ముప్పై రోజుల్లో తెలంగాణ

కేంద్రం మరో సారి తెలంగాణపై తెల్చేస్తెం అని చెప్పి ఏమి చెప్పలెదని...ఇప్పట్లో చెప్పెలా లెదని తెలిపోయింది....అఖిలపక్ష

సమావెశం ఒక ఆర్బాటంగానె మిగిలిపోయిందా అని అందరూ నిట్టుర్చెలా చెసింది...అటు ప్రజల్లో ఆత్రుతను...మిడియాలో అటెన్షన్

తెచ్చిన మీటింగ్ లో తెలింది అంతంతమాత్రమె.....ఏతా..వాతా..తెలంగాణ కు మరో బంద్ ను నెలరోజుల పాటు ఏవరికి తొచినట్లు

వారు విశ్లేషించుకునెలా 30రోజుల నిర్ణయం మాత్రమె తెలింది...చివరి సమావెశం అనడం చివరి కొసమెరపు....

ఇక పార్టిల విషయానికోస్తే టిడిపి కొంత ముందడుగెసినప్పటికి వైఏస్స్ఆర్సిపి , కాంగ్రెస్ లు మాత్రం కేంద్రం మీద బారాన్ని తోసి

అటు ఇటు కాకుండా పోయాయు... పార్టిలు తమ వైఖరి ప్రకటించకుండా కేంద్రాన్ని నిర్ణయం త్వరగా తిసుకొమని మాత్రమె

చెప్తున్నాయు...మరి కేంద్రం ఏ నిర్ణయం తిసుకున్నా కట్టుబడి ఉంటాం అని చెప్పడం లేదు... ..ఇది పాత పాటే దినికోసం

సమావెశం అవసరమా....దిన్ని సైతం సంతృప్తికర సమావెశం అనడంలో షిండె గారి ఆంతర్యం సాగదీత...పలాయన వాదమే

అనుకోవాలా...సమావెశంలో రాష్ట్ర పార్టిల ప్రతినిదులకు వ్యూహం ప్రకారం తెలంగాణ ఇస్తామనె సంకేతాలు ఇచ్చె ప్రయత్నం చెసిన షిండే

నెలరోజుల గడువు ఏందుకు పెట్టారో మరి... ... హోంమంత్రి ముప్పైరోజుల్లో తెలంగాణం ఏలా నెర్చుకుంటాడో చూడాలి ........




Sunday, November 18, 2012

అవిశ్వాసపు కూనిరాగాలే వినిపిస్తున్నాయి....


ఇప్పడు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీని కదిపిన అవిశ్వాసపు కూనిరాగాలే వినిపిస్తున్నాయి. ఎవరైనా అవిశ్వాసం ప్రవేశపెడితే ప్రభుత్వాన్ని మేం కూల్చేస్తామని జగన్ బ్యాచ్ భీరాలు పలుకుతుండగా... ఆ పనేదో మీరే చేయవచ్చుగా ... మీ చేతగాదా అని టీడీపీ ఎదురు ప్రశ్నిస్తోంది. ప్రజల కోసం కాకుండా... జగన్‌ బేరసారాల కోసం అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. అటు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించేవారికి తమ వంతు సాయం తప్పకుంటుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. విపక్షాల దూకుడుకు అధికార పక్షం కూడా ధీటుగానే స్పందిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తర్వాత అవిశ్వాసం అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికున్న స్టామినా ఎంతో తెలియదు గాని... అసలు విపక్షాలకు అవిశ్వాసం పెట్టే ఉద్దేశం ఉందా అన్నదే ఇప్పుడు అంతుపట్టని అంశం. పైకి మాత్రం టీడీపీ, జగన్ పార్టీ, టీఆర్ఎస్‌తో సహా అన్ని పార్టీలు కిరణ్ సర్కార్‌కు నూకలు చెల్లిపోతున్నాయంటూ కేకలు వేస్తున్నాయి. అవిశ్వాసం విషయంలో జగన్ పార్టీ చాలా తెలివిగా దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని జనాన్ని నమ్మించేందుకు ... పదేపదే అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నాక కూడా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని హడావిడి చేస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించండి మద్దతిస్తాం లేదా మేమే అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తాం మీరు మద్దతివ్వండంటూ టీడీపీ ముందు జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి ఓ తెలివైన ప్రతిపాదన కూడా ఉంచారు. అయితే ఇందుకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతూ మీకు మద్దతిస్తున్న ఓ ఐదుగురు ఎమ్మెల్యేలను గవర్నర్ దగ్గరకు పంపితే కిరణ్‌ సర్కార్ కూలిపోతుందని సలహా ఇచ్చింది. ప్రజాసమస్యలపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము సిద్ధమేనని అయితే... జగన్ బేరసారాలు, బ్లాక్ మెయిల్‌ కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
అటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా కిరణ్‌ సర్కార్ మనుగడపై అనుమానం వ్యక్తం చేశారు. మరో 15 రోజులకు మించి కిరణ్‌ ప్రభుత్వం కొనసాగే సూచనలు లేవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పతనాన్ని ఆపే శక్తి ఎవరకీ లేదన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెడితే... తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అయితే... విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ పార్టీకి దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్టు సవాల్ విసిరారు. టీడీపీతో కుమ్మకై రాజకీయాలు నడుపుతోంది జగన్ పార్టీయేనని విమర్శించారు


Sunday, November 4, 2012

చెట్టుకు కట్టెసి కాల్చిచంపారు...



జంపాల...
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్...1975 నవంబర్ 5 ఖమ్మం జిల్లా ఇల్లెందు అడవుల్లో చెట్టుకి కట్టెసి మరి కాల్చిచంపారు... ఆయన పేరు జేసీఎస్ ప్రసాద్... జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్.. భారత విధ్యార్ధి ఉద్యమంలో చెరగని పేజీ జంపల...ఈ దేశంలో అసమానతలు లేని రాజ్యం రావాలని కలలు కన్న జార్జి రెడ్డి వారసుడు... ఉస్మానియా ఇంజనిరింగ్ కాలేజీ విద్యార్ధి... ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమ నిర్మాత... ఓయు క్యాంపస్ లో చెలరేగిన కొన్ని అభ్యుదయ భావాలను రాష్ట్ర వ్యాప్తగా వేదజల్లిన నాటి స్టుడెంట్ లీడర్... జంపాల చంద్రశేఖర్ ప్రసాద్... పుట్టింది నిజమాబాద్ జిల్లా బోధన్ తాలుకా ఎత్తోండ గ్రామం... మద్య తరగతి కుటుంబం... అందరి విద్యార్ధుల మదిరిగానే తల్లి తండ్రుల అనంతమైన ఆశలను మోసుకుంటూ ఉస్మానియా క్యాంపస్ చేరుకున్నాడు జంపాల... కాని అక్కడి పరిస్ధితులు ప్రసాద్ ను చదువుకోనివ్వలేదు... అప్పటికే జార్జి రెడ్డి నాయకత్వంలో ఓయు ఉద్యమాలకు ఖిల్లగా మారింది...
అ నాటి దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్ధితుల్లో మార్పు ఆవసరమని గుర్తించిన విద్యార్ధుల్లో ప్రధాముడిగా నిలిచాడు జంపాల ప్రపాద్.... సనాతన దర్మాలకు... తాతా గారి భామ
్మ గారి భావాలకు నీళ్ళు వోదిలి... అప్పుడే ఎగసిపడుతున్న ప్రగతీశీల ఉద్యమానికి నాయకత్వం వహించాడు... జార్జి రెడ్టి వోదిలిన జీనాహైతో మర్న సీగో కథం కథం పర్ లాడ్న సీగో అనే నినాదన్ని అందిపుచ్చుకోని .... అలజడి మా ఉపిరి... ఆందోళన మా వేధంతం... తిరుగుబాటు మా సిద్దాంతం... అంటూ నినాదించాడు జంపాల ప్రసాద్.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పీడీయస్ యు) తొలి నాయకుడు... ఈ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలోనే జేసీయస్ ప్రసాద్ ను నాటి వెంగల్ రావు పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో కల్చిచంపారు. సరిగ్గా నవంబర్ 5 1975 రోజున ఖమ్మం జిల్లా ఇల్లెంద్ అడవుల్లో ప్రసాద్ ను చంపిచేశారు. నాటి నుంచి ఉయ్యాలో జంపాల... ఈ దోపిడి కూలదోయ్యల... అంటు భారత విప్లవ విధ్యార్ధి ఉద్యమం పాడుతూనే ఉంది... జేసీయస్ ఆశయ సాధన కోసం అనేక త్యాగాలను అయన నిర్మించిన విద్యార్ధి సంఘం చేస్తూనేవుంది... ప్రతి ఏడు జంపాల ప్రసాద్ ను అయన సహచారులు, తోటి మిత్రులు, ఉద్యమకారులు స్మరించుకుంటూనే ఉన్నారు.... అయితే నాడు ఆయనకు అనుచరులుగా ఉన్న వారందరూ ఒకచోటికి చేరి జంపాల జ్ఞాపకాలను, ఉద్యమాల సవ్వడిని స్మరించుకోవడంతోపాటు ఒకరికొకరు అభివూపాయాలనుపంచుకోవడానికి ఆదివారం ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో గల హరిత గార్డెన్స్‌లో సంస్మరణ సభను నిర్వహించుకున్నారు. ఈ సభకు 1972లో ఓయూలో విద్యనభ్యసించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు ఇతర దేశాల్లో స్థిరపడిన వారందరూ హాజరైనారు..కేవలం ఖమ్మంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతట జంపాల ప్రసాద్ వర్ధంతులు జరుపుకుటున్నారు... పాత, కొత్త తరం విద్యార్ధులు జంపాలను స్మారించుకుంటు సూతన వ్యవస్ధను స్వప్నిస్తున్నారు... ఎల్లలు లేని విశాల ప్రపంచాం కోసం ఎదురు చూస్తున్నారు.........................................

Thursday, November 1, 2012

నిజ జీవితంలోనూ సినిమాలోలాగ నటిస్తున్నారు..............


మొహన్ బాబు ఫ్యామిలి నిజ జివితంలో కూడా సినిమాలో నటించినట్లు నటిస్తున్నారు....చంపేస్తాం నరికేస్తాం అంటూ ఓపెన్ గా మిడియా ముందే బేదిరింపులకు పాల్పడుతున్నారు ...బుదవారం రాత్రి జరిగిన సంఘటనలు యదాతథంగా........
బ్రాహ్మణ సంఘాల యువకులు ఇంటిముందుకు వస్తున్నారని ముందే తెలుసుకున్న మొహన్ బాబు అనుచరులు దాడి చెయడానికి సిద్దం అయ్యారు...సెక్యురిటి రూమ్ లో దాచిన ఫైబక్ స్టిక్స్ తిసుకోని దెనికైనా రెడి అంటూ సిద్దం అవుతుండగా...మీడియా కెమేరాలు చిత్రికిరించాయు..ఓ తెల్ల బట్టలేసుకున్న వ్యక్తి (మొహన్ బాబు మేనేజర్) కెమేరాలతో షుట్ చెయకండి అంతా అయుపోయున తరువాత మిమ్మల్ని పిలుస్తాను అప్పటివరకు కార్ లో కుర్చోండంటూ వేడుకున్నాడు...అక్కడున్న వారు మాట విన్నట్టు కనపడకుండా పోయో సరికి బేదిరించడానికీ సిద్దం అయ్యాడు ...అప్పటికే బ్రాహ్మణ సంఘాల వారు వస్తున్నట్లుగా దూరం
నుండి కనబడడంతో వారిపై దాడికి మొహన్ బాబు సెక్యురిటి సిబ్బంది దాడి చెయడానికి పగిగెత్తారు...అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ బ్రాహ్మణుల్ని ఆపి మాట్లాడుతున్నారు..అదే సమయంలో ఫైబర్ లాఠిలతో దాడి

ప్రారంభం అయింది...తప్పించుకోని పోతున్న వారి బైక్ ల వైపు లాఠిలు విసరడంతో కోంతమంది కిందపడి గాయపడ్డారు.. మరికోంతమంది కింద పడగా వారిని కాలితో తోక్కుతూ వారి కసి తిర్చుకున్నారు..రోడ్డుపై వేళ్తున్న ఇతరులపై సైతం దాడి చేసి వారి వాహనాలను పగలగోట్టారు...ఇదంతా ఒక వైపు జరుగుతుండగా మరోవైపు.మరికోంత మంది సిబ్బంది గెటు ముందు ఉన్న లైట్లను పగలగోట్టి కోన్ని రాళ్ళు విసురుకున్నారు ...ఇదంతా మిడియావారి ముందే జరిగింది అపుడే బయటోకోచ్చిన విష్ణు .."లోపలికి రండిరా" అంటూ పరుష పదజాలంతో విరుచుకపడ్డారు..మీడియాను సైతం బెదిరించారు....నిజంగా సినిమా షుటింగ్ ను తలపించే లా కోన్ని సంఘటనలు మా ముందే జరిగాయి....ఇంటిమిదికి దాడికి రాకముందే...రాళ్లు విసరకముందే...ఏవీ పగలకముందే...మాపై దాడి దరిగిందంటూ మీడియాకు చెప్పడంతో ...తెల్లబోవడం మావంతైంది...వీజువల్స్ లో కనబడుతున్న సంఘటనల్ని సైతం జరగలేదంటూ చెప్తుండడంతో వారి నటనా చాతుర్యం మాకూ.. అర్థం అయింది....

మొహన్ బాబు గతంలో కూడా తెలంగాణ పై నోటికోచ్చినట్లు మాట్లాడి ఆ ప్రాంతం వారితో వైరం కోని తెచ్చుకున్నాడు...ఇష్యు పెద్దది కావడంతో సైలేంట్ అయి మళ్లి అలాంటి మాటలు మట్లాడ్డంలేదు...గత కోన్నేళ్లుగా మొహన్ బాబు ఫ్యామిలి తిసే సినిమాలేవి హిట్టు కోట్టలేదు... ఒరకవేళ హిట్ అయితే ఇంటి ముందునుంచి వేళ్లేవాళ్లను సైతం కోడతారని...వ్యంగ్యంగా కోంత మంది మొహన్ బాబు పై ఒ కామేంట్ చెయడం బుదవారం రాత్రి సంఘటనతో నిజమైందనిపించింది...సినిమాకు ఫ్రి పబ్లిసిటికోసం వివాదాలు చెస్తారనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది..ఇప్పటి ఇ సంఘటన ద్వార పబ్లిసిటి ఏమొగాని ఇలా దాడి చెయడం ద్వారా మొహన్ బాబు ఫ్యామిలి సినిమాలను భవిష్యత్ లో బ్రహ్మణులు వ్యతిరేఖ కోణంలో చుస్తారు....అనవసరంగా ఓ వర్గాన్ని ఒ ప్రాంతాన్ని దూరం చెసుకోవడమే...ఇపుడంటె సినిమా కాస్త బాగుంది చుస్తారు అన్నిసార్లు అలా జరగదు కదా అపుడు ఇదే సిని తారలు ప్రేక్షక దేవుళ్లు అంటూ మీడియా ముందు సినిమా చూడండంటూ వేడుకుంటారు..... సినిమాల్లో సవాల్ విసిరితే బాగుంటుంది...హిరో ఏవరిని కోట్టిన ...ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది ..కాని రియల్ లైఫ్ లో అలాకాదు ...............ఏందుకంటే వీరు రియల్ లైఫ్ లో హిరో లు కారు కాబట్టి.....



Thursday, October 11, 2012

తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరుగుతోంది?


రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏంతో ఉత్కంఠ రెపిన తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరిగింది.. టి ఆర్ ఏస్ , జెఏసి ల మద్య సఖ్యత తగ్గిందా ? జెఏసిలో ఉద్యోగ సంఘాల ఆదిపత్యం పెరిగిందా?టిఆర్ఏస్ ఏం చెయలనుకుంటుంది. జెఏసితో కలసి నడుస్తుందా ..జెఏసి నే మర్చాలనుకుంటుందా? జెఏసిలోని ఇతర సంఘాలేమనుకుంటున్నాయ్..మార్చ్ సబలో జేఏసి ప్రకటించిన ఉద్యమ కార్యచరణ ఏందుకు లెటవుతుంది?.

తెలంగాణ మార్చ్ పై రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా , దేశం మొత్తం పెద్ద చర్చే జరిగింది .. పక్కాగా రాజకీయజెఎసి ఆధ్వర్యంలో జరిగన ఇ కార్యక్రమం ఓకింత ప్రశాంతంగానే జరిగనప్పటికి తెలంగాణ సాదన కోసం పోరాటం చెసే సంఘాలు , పార్టిల మద్య అప్పటికే ఉన్న దురాన్ని మరింత పెంచిందనే బావన సర్వత్రా వెళ్లడవుతోంది... టి మార్చ్ పై మొదటినుంచి అంటిముట్టనట్టుగా ఉన్న కెసిఆర్ ఈ మర్చ్ లో జరిగిన కోన్ని సంఘటనల ద్వారా జెఏసి నేతలపై కోపంగా ఉన్నారని వినిపిస్తుంది..ఈటెల రాజేందర్ ను సభ జరుగుతున్న సమయంలో స్టేజిపైనుండి కిందికి దిగి జనాల్లో కుర్చోవాలని ,, హరిష్ రావ్ ను స్టేజి వెనకాల ఉండండంటూ టి ఉద్యోగసంఘం నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను అక్కడే ఉన్న కవిత కెసిఆర్ కు అప్పిటకప్పుడు ఫోన్లో వివరించడంతో సిరియస్ అయిన గులాబినేత తమవారిని వెంటనే మార్చ్ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని ఆర్డర్ వెశారంట... లక్షలాది మంది ని తరలించి బారి బహిరంగ సభలు నిర్వహించిన అనుబవం ఉన్న టిఆర్ఏస్ నే టి-మార్చ్ లో ప్రెక్షక పాత్ర వహించేలా చెయడమే కాకుండా అవమానించేలా ప్రవర్తించడంతో కెసిఆర్ జెఏసి గురించి తివ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం ..అయితె టిఆర్ఏస్ నేతలు మాత్రం చిన్నపాటి గ్యాప్ మాత్రమే ఏర్పడిందని..ఒకవెల ఏమైనా ఉంటే వాటిని సవరించుకునే ప్రయత్నం చెస్తామని జెఏసిని స్థాపించిందే టిఆర్ఏస్ అని చెప్పుకోస్తున్నారు...

తెలంగాణ మార్చ్ నిర్వహణలో చిన్న చిన్న లోపాలుజరిగాయని వాటివల్ల కోందరు నోచ్చుకునే అవకాశం కూడా లెకపోలెదని జెఏసిలోని ఇతర పార్టి నేతలు అంటున్నారు. జేఏసి గతంలో ఏప్పుడు ఇలాంటి భారి సబలు నిర్వహించిన అనుభవం లెనందున నిర్వాహకుల వల్ల కోన్ని పోరపాట్లు జరిగాయంటున్నారు..జెఏసిలోని బాగస్వామ్య పక్షాల మద్య దూరం పెరగకుండా ఏమేం చర్యలు చెపట్టాలో కూడా ఆలోచిస్తున్నట్లు వారంటున్నారు....ఇందుకోసం త్వరలో జెఏసి స్టిరింగ్ కమిటి మిటింగ్ ఏర్పాటు చేసి దానికి కేసిఆర్ తో సహా అందరిని పిలిచి సమస్యలు సామరస్యపుర్వకంగా సర్దుకునేలా చెస్తామంటున్నారు...మార్చ్ సబలో ప్రకటించిన ఇందిరాపార్క్ దిక్షలలాంటి జెఏసి కార్యక్రమాలను లెట్ అయ్యే అవకాశం ఉందని స్టిరింగ్ కమిటి మిటింగ్ తరువాతే చెపడతామాంటున్నారు జెఏసి నేతలు..

జెఏసి లోని ఉద్యోగ సంఘాల నేతలు,సిపిఐ న్యు డెమోక్రసి నెతలు కెసిఆర్ కలవడం కూడా నష్టనివారణ చర్యల్లో బాగమేనని అంటున్నారు..కెసిఆర్ ఏవరిని పిలవకపోయునప్పటికి జరిగిన పోరపాట్లను వివరించేందుకే వెళ్ళినట్లు వారు చెప్తున్నారు...త్వరలో కోదండరామ్ సైతం కెసిఆర్ ను కలిసెందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం... బాహాటంగా టిఆర్ఏస్ తో కలవడానికి ఇష్టపడని వారందరిని జెఏసి ద్వారా వినియోగించుకునే కెసిఆర్ జెఏసిని వదులుకోనే సాహసం చెయడంటున్నారు విశ్లేశకులు. ఏన్ని ఆగ్రహాలు , పట్టింపులు ఉన్నప్పటికి కలిసి నడవాల్సిందేనంటున్నారు..విడిగా చెస్తే వీరు సాదించేదిమి లెదంటున్నారు.. మరోవిదంగా చుస్తే కాంగ్రేస్ తో టిఆర్ ఏస్ విలీన వార్తల వినిపిస్తున్న తరుణంలో కేసిఆరే జెఏసిని దూరంగా ఉంచుతున్నారా అనే అనుమాలు రెకేత్తుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కెసిఆర్ ఏలాంటి నిర్ణయం తిసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లెదంటున్నారు... మా మద్య విబెదాలేం లెవని కోదండరాం అంటున్నప్పటికి కెసిఆర్ మాత్రం దినిపై స్పందించకపోవడం విరి మద్య గ్యాప్ రూమర్లకు బలాన్ని చెకుర్చుతున్నాయంటున్నారు...

తెలంగాణ మార్చ్ తరువాత ఢిల్లి లో ఏ మేరకు కదలిక వచ్చిందో కాని ప్రత్యేకరాష్ట్రోద్యమంలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు మాత్రం ఏర్పాడ్డాయు..అన్ని సంఘాలు, పార్టిలు ఓకరిపైఓకరు గుర్రుగా ఉన్నారు..ఇ సందిగ్ధ పరిస్థితి ఏటు దారి తిస్తుందోనన్నది అందరికి ప్రశ్నగానే మిగిలిపోతుంది..


Saturday, October 6, 2012

మీకు తెలియకుండానే మికు విషాన్ని ఇంజెక్ట్ చెస్తున్నాయు....


మిరు ఏ సూపర్ మర్కేట్ కో ,రైతుబజార్ కో వెళ్లినప్పుడు కూరగాయలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయా.....పెద్ద పెద్ద సైజలుతో..మంచి రంగుతో తాజాగ కనిపిస్తూ ఉరిస్తున్నాయా....కాస్త ఆగండి ...ఇవి చూడడానికి అందంగా ఉన్నా ...తాజాగా కనిపిస్తున్నా ..మీకు తెలియకుండానే మి ఓంట్లోకి విషాన్ని ఇంజేక్ట్ చెస్తున్నాయు.. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించే పండ్లు ,
కూరగాయలు ఆరోగ్యాన్ని కాకుండా ఆనారోగ్యాన్ని మొసుకోస్తూన్నాయు...

మనం తినే ఆహారంలో ఆరోగ్యకారకాలెన్ని? ,ఆనారోగ్యానికి దారితిసె అవశేషాలెన్ని ?. అసలు మనం ఏం తింటున్నాం కురగాయలనా?కాలకూటవిషాలనా? ప్రకృతితో మమేకమై సహజ వనరులతో,సేంద్రియ ఏరువులతో పాడిపంటలతో పండించిన పంటలను మనకు దూరం చేసిన పాలకులు...ఆధునికత పేరుతో చెసిన పోరపాట్ల పాపమే ప్రస్తుతం అయోమయ.. అస్థవ్యస్థ పరిస్థితి కి కారణం అయ్యారు....

ఆరోగ్యం కోసం ఆహరంలో కూరగాయలు,ఆకుకూరలు ఏక్కువగా తిసుకోవాలని డాక్టర్లు మనకు సూచిస్తారు...నిజంగా ఈ రోజుల్లో కూరగాయలద్వారా ఆరోగ్యం వస్తుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం ..ఏందుకంచే వాటిల్లోని రసాయన అవశేషాల మొతాదు రోజురోజుకి పెరిగిపోతుంది..ఇది ఏవరో చెప్తుంది కాదు సాక్షాత్తు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యుట్రిషన్ నిర్వహించిన సర్వేలే చెప్తున్నాయు..హైదరాబాద్ లోని కూరగాయలు, పల్లల్లో ఏకంగా 18 రకాల ప్రాణాంతక రసాయన అవశేషాలున్నాయు..విటిల్లో కోన్ని రసాయన మందులను మన ప్రభుత్వాలు 30సంవత్సరాలకు ముందే నిషేదించాయంట ...
సెంద్రియ ఏరువులతో పంటలు పండిస్తు దిగుబడితోపాటు ఆరోగ్యాన్ని పెంచుకున్న మన రైతన్న ను రసాయన ఏరువులు ,ఇతర ఫైర్టిలైజర్స్ దిశగ మళ్ళించాయు మన ప్రభుత్వాలు, రసాయన ఏరువులను విచ్చలవిడిగా మార్కేట్ లోకి వదిలి ఇదే అసలైన వ్యవసాయం అంటూ రైతుల పోలాల్లోకి ,ఓంట్లోకి రసాయనాలను వెదజల్లాయు..దిగుబడి పెరుగుతుందని ఆశ చూపి మొదటికే మొసం వచ్చేలా చెశారు..తాత్కాలికంగా దిగుబడి పెరిగినప్పటికి సారవంతమైన నెలను సాగుకు పనికి రాకుండా చెశారు...

వినియోగదారుల ఇంట్రెస్ట్ ను క్యాష్ చెసుకునెందుకు...తమ షాపుల్లోకి జనాలను ఆకర్శించేందుకు..కూరగాయలు ,పండ్లు ఆకర్షనీయంగా ఉండేందుకు రిటైల్ వ్యాపార సంస్థలు ఏంతటి దారునానికైనా ఓడిగట్టేందుకు సిద్దం అవుతున్నాయు..తమకు కావలిసిన రకం సరుకు ను పండించేందుకు రైతులను ప్రబావితం చెస్తున్నారు.. ఏ సమయంలో ఏ ఫేస్టిసైడ్స్ వాడితే రంగు , సైజు పెరుగుతాయే వాటిని రైతుల చెత వాడిస్తు తమ మార్కేట్ ను వృద్ది చెసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.....

హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాల చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల రైతులను రసాయన ఏరువులదిశగ ప్రోత్సహిస్తు తమ పబ్బం గడుపుకుంటున్నాయు రిటైల్ మర్కేట్ సంస్థలు..రిటైల్ రంగం వ్యవసాయం లోకి చోరబడకముందు ఇంతగా రసాయన ఏరువులను వాడకపోయేదని ఏందకంటే సైజు, రంగుతో పనిలెకుండా పంట పండించి అమ్మేవారిమని రైతులంటున్నారు..కాని సుపర్ మార్కేట్ వారు కోనలంటే సైజు పెద్దగా ఉండి... రంగు బావుండి తాజగా ఉండాలని అందుకే ఇంతగా మందులను వాడల్సివస్తుందని రైతులంటున్నారు...

దరలు పెరిగి కూరగాయలు కోనడానికే జంకుతున్న ప్రజలకు కోన్న ఆ కాస్త కూరగాయలు కూడా రసాయన అవశేషాలను మొసుకోస్తూ ఆనరోగ్యానికి దారితిస్తుండడంతో ఏం చెయాలో పాలుపోనిస్థితి ....అంతర్జాతియ సదస్సుల్లో సేంద్రియ పద్దతులగురించి ఉపన్యాసాలిచ్చే పెద్దలు ఇకనైన సమస్య ములాలు పై దృష్టి పెట్టి సమస్తజివకోటిని బ్రతికించిల్సిన అవసరం ఏంతైనా ఉంది....

Sunday, September 9, 2012

అర్నభ్ గోస్వామి బయపడుతూ ఇంటర్వ్యు చేసాడా???


జాతియ మిడియా పై రాజ్ థాకరే మండిపడడం , TRP కొసం ఏమైనా చెస్తారంటు చెప్పడంతో పాటు మరెన్నో విశేషాలున్న ఇంటర్య్యు ఇది
Frankly Speaking అనే కార్యక్రమంలో రాజ్ థాకరే ఇచ్చిన ఇంటర్య్యు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.....
అర్నభ్ గోస్వామి గత ఇంటర్య్యు లతో పోలిస్తే రాజ్ థాకరే ఇంటర్య్యు స్పెషల్ అని చెప్పాలి..ఏదుటివారిని బయపెట్టే అర్నబ్ ఈ సారి రాజ్ ముందు కాస్త బయపడ్డడా అని అనిపించింది.....






http://www.youtube.com/watch?v=48ZbElYzQb4&feature=relmfu