Sunday, November 4, 2012

చెట్టుకు కట్టెసి కాల్చిచంపారు...



జంపాల...
జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్...1975 నవంబర్ 5 ఖమ్మం జిల్లా ఇల్లెందు అడవుల్లో చెట్టుకి కట్టెసి మరి కాల్చిచంపారు... ఆయన పేరు జేసీఎస్ ప్రసాద్... జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్.. భారత విధ్యార్ధి ఉద్యమంలో చెరగని పేజీ జంపల...ఈ దేశంలో అసమానతలు లేని రాజ్యం రావాలని కలలు కన్న జార్జి రెడ్డి వారసుడు... ఉస్మానియా ఇంజనిరింగ్ కాలేజీ విద్యార్ధి... ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమ నిర్మాత... ఓయు క్యాంపస్ లో చెలరేగిన కొన్ని అభ్యుదయ భావాలను రాష్ట్ర వ్యాప్తగా వేదజల్లిన నాటి స్టుడెంట్ లీడర్... జంపాల చంద్రశేఖర్ ప్రసాద్... పుట్టింది నిజమాబాద్ జిల్లా బోధన్ తాలుకా ఎత్తోండ గ్రామం... మద్య తరగతి కుటుంబం... అందరి విద్యార్ధుల మదిరిగానే తల్లి తండ్రుల అనంతమైన ఆశలను మోసుకుంటూ ఉస్మానియా క్యాంపస్ చేరుకున్నాడు జంపాల... కాని అక్కడి పరిస్ధితులు ప్రసాద్ ను చదువుకోనివ్వలేదు... అప్పటికే జార్జి రెడ్డి నాయకత్వంలో ఓయు ఉద్యమాలకు ఖిల్లగా మారింది...
అ నాటి దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్ధితుల్లో మార్పు ఆవసరమని గుర్తించిన విద్యార్ధుల్లో ప్రధాముడిగా నిలిచాడు జంపాల ప్రపాద్.... సనాతన దర్మాలకు... తాతా గారి భామ
్మ గారి భావాలకు నీళ్ళు వోదిలి... అప్పుడే ఎగసిపడుతున్న ప్రగతీశీల ఉద్యమానికి నాయకత్వం వహించాడు... జార్జి రెడ్టి వోదిలిన జీనాహైతో మర్న సీగో కథం కథం పర్ లాడ్న సీగో అనే నినాదన్ని అందిపుచ్చుకోని .... అలజడి మా ఉపిరి... ఆందోళన మా వేధంతం... తిరుగుబాటు మా సిద్దాంతం... అంటూ నినాదించాడు జంపాల ప్రసాద్.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పీడీయస్ యు) తొలి నాయకుడు... ఈ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలోనే జేసీయస్ ప్రసాద్ ను నాటి వెంగల్ రావు పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో కల్చిచంపారు. సరిగ్గా నవంబర్ 5 1975 రోజున ఖమ్మం జిల్లా ఇల్లెంద్ అడవుల్లో ప్రసాద్ ను చంపిచేశారు. నాటి నుంచి ఉయ్యాలో జంపాల... ఈ దోపిడి కూలదోయ్యల... అంటు భారత విప్లవ విధ్యార్ధి ఉద్యమం పాడుతూనే ఉంది... జేసీయస్ ఆశయ సాధన కోసం అనేక త్యాగాలను అయన నిర్మించిన విద్యార్ధి సంఘం చేస్తూనేవుంది... ప్రతి ఏడు జంపాల ప్రసాద్ ను అయన సహచారులు, తోటి మిత్రులు, ఉద్యమకారులు స్మరించుకుంటూనే ఉన్నారు.... అయితే నాడు ఆయనకు అనుచరులుగా ఉన్న వారందరూ ఒకచోటికి చేరి జంపాల జ్ఞాపకాలను, ఉద్యమాల సవ్వడిని స్మరించుకోవడంతోపాటు ఒకరికొకరు అభివూపాయాలనుపంచుకోవడానికి ఆదివారం ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో గల హరిత గార్డెన్స్‌లో సంస్మరణ సభను నిర్వహించుకున్నారు. ఈ సభకు 1972లో ఓయూలో విద్యనభ్యసించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు ఇతర దేశాల్లో స్థిరపడిన వారందరూ హాజరైనారు..కేవలం ఖమ్మంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతట జంపాల ప్రసాద్ వర్ధంతులు జరుపుకుటున్నారు... పాత, కొత్త తరం విద్యార్ధులు జంపాలను స్మారించుకుంటు సూతన వ్యవస్ధను స్వప్నిస్తున్నారు... ఎల్లలు లేని విశాల ప్రపంచాం కోసం ఎదురు చూస్తున్నారు.........................................

No comments:

Post a Comment