Thursday, November 1, 2012

నిజ జీవితంలోనూ సినిమాలోలాగ నటిస్తున్నారు..............


మొహన్ బాబు ఫ్యామిలి నిజ జివితంలో కూడా సినిమాలో నటించినట్లు నటిస్తున్నారు....చంపేస్తాం నరికేస్తాం అంటూ ఓపెన్ గా మిడియా ముందే బేదిరింపులకు పాల్పడుతున్నారు ...బుదవారం రాత్రి జరిగిన సంఘటనలు యదాతథంగా........
బ్రాహ్మణ సంఘాల యువకులు ఇంటిముందుకు వస్తున్నారని ముందే తెలుసుకున్న మొహన్ బాబు అనుచరులు దాడి చెయడానికి సిద్దం అయ్యారు...సెక్యురిటి రూమ్ లో దాచిన ఫైబక్ స్టిక్స్ తిసుకోని దెనికైనా రెడి అంటూ సిద్దం అవుతుండగా...మీడియా కెమేరాలు చిత్రికిరించాయు..ఓ తెల్ల బట్టలేసుకున్న వ్యక్తి (మొహన్ బాబు మేనేజర్) కెమేరాలతో షుట్ చెయకండి అంతా అయుపోయున తరువాత మిమ్మల్ని పిలుస్తాను అప్పటివరకు కార్ లో కుర్చోండంటూ వేడుకున్నాడు...అక్కడున్న వారు మాట విన్నట్టు కనపడకుండా పోయో సరికి బేదిరించడానికీ సిద్దం అయ్యాడు ...అప్పటికే బ్రాహ్మణ సంఘాల వారు వస్తున్నట్లుగా దూరం
నుండి కనబడడంతో వారిపై దాడికి మొహన్ బాబు సెక్యురిటి సిబ్బంది దాడి చెయడానికి పగిగెత్తారు...అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ బ్రాహ్మణుల్ని ఆపి మాట్లాడుతున్నారు..అదే సమయంలో ఫైబర్ లాఠిలతో దాడి

ప్రారంభం అయింది...తప్పించుకోని పోతున్న వారి బైక్ ల వైపు లాఠిలు విసరడంతో కోంతమంది కిందపడి గాయపడ్డారు.. మరికోంతమంది కింద పడగా వారిని కాలితో తోక్కుతూ వారి కసి తిర్చుకున్నారు..రోడ్డుపై వేళ్తున్న ఇతరులపై సైతం దాడి చేసి వారి వాహనాలను పగలగోట్టారు...ఇదంతా ఒక వైపు జరుగుతుండగా మరోవైపు.మరికోంత మంది సిబ్బంది గెటు ముందు ఉన్న లైట్లను పగలగోట్టి కోన్ని రాళ్ళు విసురుకున్నారు ...ఇదంతా మిడియావారి ముందే జరిగింది అపుడే బయటోకోచ్చిన విష్ణు .."లోపలికి రండిరా" అంటూ పరుష పదజాలంతో విరుచుకపడ్డారు..మీడియాను సైతం బెదిరించారు....నిజంగా సినిమా షుటింగ్ ను తలపించే లా కోన్ని సంఘటనలు మా ముందే జరిగాయి....ఇంటిమిదికి దాడికి రాకముందే...రాళ్లు విసరకముందే...ఏవీ పగలకముందే...మాపై దాడి దరిగిందంటూ మీడియాకు చెప్పడంతో ...తెల్లబోవడం మావంతైంది...వీజువల్స్ లో కనబడుతున్న సంఘటనల్ని సైతం జరగలేదంటూ చెప్తుండడంతో వారి నటనా చాతుర్యం మాకూ.. అర్థం అయింది....

మొహన్ బాబు గతంలో కూడా తెలంగాణ పై నోటికోచ్చినట్లు మాట్లాడి ఆ ప్రాంతం వారితో వైరం కోని తెచ్చుకున్నాడు...ఇష్యు పెద్దది కావడంతో సైలేంట్ అయి మళ్లి అలాంటి మాటలు మట్లాడ్డంలేదు...గత కోన్నేళ్లుగా మొహన్ బాబు ఫ్యామిలి తిసే సినిమాలేవి హిట్టు కోట్టలేదు... ఒరకవేళ హిట్ అయితే ఇంటి ముందునుంచి వేళ్లేవాళ్లను సైతం కోడతారని...వ్యంగ్యంగా కోంత మంది మొహన్ బాబు పై ఒ కామేంట్ చెయడం బుదవారం రాత్రి సంఘటనతో నిజమైందనిపించింది...సినిమాకు ఫ్రి పబ్లిసిటికోసం వివాదాలు చెస్తారనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది..ఇప్పటి ఇ సంఘటన ద్వార పబ్లిసిటి ఏమొగాని ఇలా దాడి చెయడం ద్వారా మొహన్ బాబు ఫ్యామిలి సినిమాలను భవిష్యత్ లో బ్రహ్మణులు వ్యతిరేఖ కోణంలో చుస్తారు....అనవసరంగా ఓ వర్గాన్ని ఒ ప్రాంతాన్ని దూరం చెసుకోవడమే...ఇపుడంటె సినిమా కాస్త బాగుంది చుస్తారు అన్నిసార్లు అలా జరగదు కదా అపుడు ఇదే సిని తారలు ప్రేక్షక దేవుళ్లు అంటూ మీడియా ముందు సినిమా చూడండంటూ వేడుకుంటారు..... సినిమాల్లో సవాల్ విసిరితే బాగుంటుంది...హిరో ఏవరిని కోట్టిన ...ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది ..కాని రియల్ లైఫ్ లో అలాకాదు ...............ఏందుకంటే వీరు రియల్ లైఫ్ లో హిరో లు కారు కాబట్టి.....



1 comment: