ఖైదీలను సంస్కరించి దారిలో పెట్టాల్సిన అధికారులు వారిని సంక్షేమం మరిచి మనుషులకు బదులు శవాలను విడుదల చేస్తున్నారు లేదా మరింత కరుడుగట్టిన నేరస్తులుగా మార్చి సమాజంలోకి వదులుతున్నారు.
జైళ్లలో సంస్కరణలు ఊసే కనిపించడం లేదు. నేరస్తుల మనస్సు మార్చి సరైన దారిలో పెట్టడానికి, వారు బాహ్యప్రపంచంలోకి వెళ్లిన తరువాత గౌరప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి ఏలాంటి చర్యలు జైళ్లలో చేపట్టడం లేదు. పది మంది నేరస్తులను ఒకే బ్యారక్‌లో పెడుతున్నారు. తాము బయటకు వెళ్లిన తరువాత ఇంతకన్నా పెద్ద నేరాలు ఎలా చేయాలా..? అని వారు మాట్లాడుకుంటున్నారు. బ్యారక్‌లు వీరికి సమావేశ మందిరాల్లాగా ఉపయోగపడుతున్నాయి. నేరస్తులకు ప్రతిరోజు ఉదయం యోగా, మెడిటేషన్ లాంటివి చేయిస్తున్న దాఖాలాలు లేవు. సైకాలజిస్టు ఉపన్యాసాలు ఏర్పాటు చేసి ఖైదీలలో మానసిక మార్పునకు ప్రయత్నించడం లేదు.
కొందరు గ్యాంగ్‌స్టర్లు జైలు అధికారులనే భయపెట్టే స్థాయికి ఎదిగారు. తమ మాట కాదంటే మీ పని చూసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కొందరు జైలు అధికారులు పేర్కొనడం పరిస్థితులకు అద్దంపడుతోంది. ముఠాల నాయకులు, తీవ్రవాద నేరాలతో జైలుకు వచ్చిన వారు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. జైళ్లలోనూ ముఠాల మధ్య ఘర్షణలు జరగడం జైలు సిబ్బందిపై దాడులు చేయడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన జైలు అధికారులు, సైకాలజిస్టు ఏర్పాటు చేసి జైళ్ల పరిపాలనా విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment