Friday, May 11, 2012


గద్దరన్న మరో నిర్ణయం ఏన్నో యెండ్లుగా తన పాటతో ప్రజల్ని ముఖ్యంగా యువకులను ఉద్యమదిశగా నడిపిన ప్రజాయుద్దనౌక గద్దరన్నమరో పెద్ద సమస్యనుంచి తప్పించుకునె ప్రయత్నం విజయవంతంగా చెశాడా. ఉద్యమాల ద్వారనే తెలంగాణ సాద్యం అనే గద్దరన్న అసలు పార్టి పెట్టకుండా ఉంటె బగుండేదేమో......... తెలంగాణ కె పరిమితం కాదు దెశవ్యాప్త సాంస్కృతిక ఉద్యమాలు చెస్తానన్న గద్దరన్న కూట్లె రాయి తియనోడు యేట్లె రాయి తీస్తడా ... ఇవి ఇప్పుడు గద్దరన్న ఏదుర్కుంటున్న విమర్శలు.........కాని
http://www.tehelka.com/story_main49.asp?filename=Ws090411CrazyCrusaders.asp

Sunday, May 6, 2012

జైళ్లలో సంస్కరణల ఊసే కనిపించడం లేదు


ఖైదీలను సంస్కరించి దారిలో పెట్టాల్సిన అధికారులు వారిని సంక్షేమం మరిచి మనుషులకు బదులు శవాలను విడుదల చేస్తున్నారు లేదా మరింత కరుడుగట్టిన నేరస్తులుగా మార్చి సమాజంలోకి వదులుతున్నారు. జైళ్లలో సంస్కరణలు ఊసే కనిపించడం లేదు. నేరస్తుల మనస్సు మార్చి సరైన దారిలో పెట్టడానికి, వారు బాహ్యప్రపంచంలోకి వెళ్లిన తరువాత గౌరప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి ఏలాంటి చర్యలు జైళ్లలో చేపట్టడం లేదు. పది మంది నేరస్తులను ఒకే బ్యారక్‌లో పెడుతున్నారు. తాము బయటకు వెళ్లిన తరువాత ఇంతకన్నా పెద్ద నేరాలు ఎలా చేయాలా..? అని వారు మాట్లాడుకుంటున్నారు. బ్యారక్‌లు వీరికి సమావేశ మందిరాల్లాగా ఉపయోగపడుతున్నాయి. నేరస్తులకు ప్రతిరోజు ఉదయం యోగా, మెడిటేషన్‌ లాంటివి చేయిస్తున్న దాఖాలాలు లేవు. సైకాలజిస్టు ఉపన్యాసాలు ఏర్పాటు చేసి ఖైదీలలో మానసిక మార్పునకు ప్రయత్నించడం లేదు. కొందరు గ్యాంగ్‌స్టర్లు జైలు అధికారులనే భయపెట్టే స్థాయికి ఎదిగారు. తమ మాట కాదంటే మీ పని చూసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కొందరు జైలు అధికారులు పేర్కొనడం పరిస్థితులకు అద్దంపడుతోంది. ముఠాల నాయకులు, తీవ్రవాద నేరాలతో జైలుకు వచ్చిన వారు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. జైళ్లలోనూ ముఠాల మధ్య ఘర్షణలు జరగడం జైలు సిబ్బందిపై దాడులు చేయడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన జైలు అధికారులు, సైకాలజిస్టు ఏర్పాటు చేసి జైళ్ల పరిపాలనా విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

ఆదివారం 06-05-2012: ఏబియన్ ఆంద్రజ్యోతి లో రిపోర్టర్ గా చెరి నెటికి తోమ్మిది రోజులైంది.క్రైం రిపోర్టింగ్ లో నా లైఫ్ తారా అనుచరుడు హనిఫ్ ను జైల్లో కలవడం మరియి ఏటియమ్ దోంగల స్టోరి తో మోదలైంది... క్రైం రిపోర్టింగ్ కోత్తగా ఉన్నప్పటికి పరవాలెదనిప్తోంది.టి.వి9 లో రిజైన్ చేసిన తరువాత కోన్ని రోజులు హలిడెస్ లాగా ఏంజాయ్ చేద్దాం అనుకున్నప్పటికి వెంట వెంటనే ఇంటర్వ్యుల పిలుపులు రావడంతో మనసంతా ఉరుమిద ఉన్నప్పటికి కేరిర్ కి ఇంపార్టేన్స్ ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాను.

Wednesday, May 2, 2012

Jagan's Political Story


రాజకీయాలలో ఒక ధీరీ ఉంది.సానుకూలం అయినా, వ్యతిరేకం అయినా ఎప్పుడూ జనంలో ప్రచారంలో ఉండాలన్నది ఆ ధీరి చెబుతుంది.గత మూడేళ్లుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది.జగన్ ఒక నాయకుడిగా ఎదిగిన తీరుపై(మేకింగ్ ఆఫ్ ఎ లీడర్ ) ఎవరైనా పుస్తకం రాయదలిస్తే ఈ పరిశీలన ఆసక్తికరంగా ఉంటుంది.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న రోజులలో జగన్ గురించి వచ్చే వ్యతిరేక వార్తలపై జనానికి ఉత్సుకత ఉండేది. ఆ తర్వాత అనూహ్యంగా జరిగిన పరిణామాలలో సైతం మొదట జగన్ కు వాతావరణం ఏమంతా అనుకూలంగా ఉండేది కాదు.కాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చివరికి మంత్రులు సైతం జగన్ నే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు అంతా చిత్రంగా చూశారు. రాజశేఖరరెడ్డి కుమారుడు కనుక జగన్ సి.ఎమ్. అవుతారని అంతా భావించారు. కాని కాంగ్రెస్ అధిష్టానం , అధినేత్రి సోనియాగాంధీ మరోరకంగా తలిచారు. అప్పట్లో కాంగ్రెస్ లో తిరుగుబాటు వస్తుందేమోనని ఢిల్లీ పెద్దలు భయపడ్డారంటే ఆశ్చర్యం కాదు. చివరికి శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి వెనుకాడారు. అయినా జగన్ పట్ల ఎమ్మెల్యేలలో సానుకూలత ఉన్నా ప్రజలలో మంచి అనుకూలత వచ్చేసిందని అనుకునేవారు కాదు.ఆ తర్వాత ఆయన ఓదార్పుయాత్ర ఆరంభించారు. రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోయి మృతి చెందినవారి జాబితాను సిద్దం చేసుకుని జగన్ పర్యటించడం ఆరంభించిన రోజున కూడా జనం విరగబడలేదు. కాని మరి ఎప్పుడు జగన్ పట్ల ఆదరణ ఎలా పెరిగింది?ఎందుకు పెరిగింది? అన్నది కచ్చితంగా పరిశీలనార్హమే.జగన్ ఇలా చిన్న మొక్కగా ఆరంభమై ఇప్పుడు వృక్షంగా ఎదిగిన చందంగా అనుభవం కలిగిన నాయకులకు దడ పుట్టిస్తున్నాడు. ప్రత్యేకించి కాంగ్రెస్, టిడిపిలకు పెద్ద సవాలు విసిరే స్థాయికి ఎదిగారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు , మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఒకటి,రెండు పత్రికలు , ఇలా కొద్ది మంది జగన్ కు బాగా ఉపయోగపడ్డారనిపిస్తుంది. ఎల్లప్పూడు జగన్ జనం నోళ్లలో నానేలా వీరు చేశారనిపిస్తుంది.ఇక్కడ చరిత్రలో కొన్ని ఘట్టాలు గుర్తుకు వస్తాయియి.1977లో జనతా పార్టీ ఏర్పడి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఓడించింది. కాని జనతా పార్టీ అధికారంలో ఉన్నా, ఎప్పుడూ ఇందిరగాంధీని ఏమి చేయాలన్నదానిపైనే ఆ పార్టీ నేతలు ఎక్కువగా దృష్టి ఎట్టారు. షా కమిషన్ వంటి విచారణ కమిషన్లను నియమించారు. దాంతో ఆమె ఎప్పుడూ జనంలో ఉండడమే కాకుండా 1980 నాటికి జనతా పార్టీ పతనం అయి, ఆమె తిరిగి అదికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఒక దశను ఎదుర్కున్నారు. 1983 కి ముందు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు మామ ఎన్.టి.ఆర్.కొత్తగా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయనపై పోటీ చేస్తానని సవాలు విసరడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన చంద్రబాబు ఎన్.టి.ఆర్. అల్లుడు అవడం ద్వారా రాష్ట్రస్థాయికి వచ్చేశారు. తదుపరి కాంగ్రెస్ ను వీడి టిడిపిలోకి వచ్చాక కొంతకాలం కాస్త తగ్గి ఉన్నట్లు కనిపించినా 1984లో నాదెండ్ల తిరుగుబాటు తో బాగా క్రియాశీలకం అయ్యారు.ఆ తర్వాత ఏడాది ఎన్.టి.ఆర్. మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాత్ర బాగా పెరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఎన్.టి.ఆర్.తోపాటు చంద్రబాబుపైనే ఎక్కువగా దాడి చేసేది. కర్షక పరిషత్ ఛైర్మన్ గా చంద్రబాబు ఉన్నప్పుడు అనేక వివాదాలు ముసురుకునేవి. తెలుగుదేశంలో ఎవరిపైన లేనంతగా చంద్రబాబు టార్గెట్ అయ్యేవారు. తద్వారా ఆయన ఎప్పుడూ జనం నోళ్లలో ఉండేవారు. మీడియాలో ఎప్పుడూ చంద్రబాబు గురించిన కధనాలు వస్తుండేవి.ఆ తర్వాత 1989లో టిడిపి ప్రతిపక్షంలోకి రావడం కూడా చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది. శాసనసభలోను, బయట చంద్రబాబు తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకున్నారు. పార్టీలో చంద్రబాబు వంటి నాయకుడు అవసరం అన్న భావన కలిగించగలిగేవారు. చంద్రబాబు కు వ్యతిరేకంగా కార్టూన్లు వేసిన ఒక ప్రధాన మీడియాను తనవైపునకు తెచ్చుకోగలిగారు.ఈ రకంగా చంద్రబాబే టిడిపిలో ఎన్.టి.ఆర్ కు సరైన వారసుడు అన్న అబిప్రాయాన్ని పార్టీలో కలిగించడంలో సఫలం అయ్యారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన పిదప కూడా చంద్రబాబు చుట్టూ రాజకీయాలు నడిచాయి. దగ్గుబాటు వెంకటేశ్వరరావు కూడా సొంతంగా వర్గాన్ని నిర్వహించినా చంద్రబాబు వ్యూహాల ముందు ఆగలేదనే చెప్పాలి.చివరికి ఒక సందర్భంలో లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఎంతగానో కలిసి వచ్చాయి. పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు పెంచుకుంటూ, మరో వైపు వ్యూహాత్మకంగా పార్టీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా ఎన్.టి.ఆర్.పై చేసిన తిరుగుబాటుకు చంద్రబాబు ప్రజాస్వామ్య ముద్రను వేయగలిగారు.ముప్పైనాలుగేళ్ల అనుభవం కలిగి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందువల్లనో జగన్ విషయంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసినట్లు అనిపిస్తుంది. ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నూట డెబ్బై మంది తనకు మద్దతు ఇస్తే అది ప్రజాస్వామ్యం అన్న ఆయన జగన్ కు నూట ఏభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ముఖ్యమంత్రిని చేయాలని అంటే అది శవరాజకీయం అని విమర్శించారు. ముందుగా కాంగ్రెస్ చేసింది తప్పు అని చెప్పి, ఆ తర్వాత జగన్ ది శవరాజకీయం అని విమర్శించి ఉంటే సరిగా ఉండేదనిపిస్తుంది.అలాగే రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులపై ముందుగా అవినీతి ఆరోపణలు చేసి, వారి సంగతి తేల్చండని ముందుగా డిమాండ్ చేసి, తదుపరి జగన్ పైకి దండెత్తితే హెతుబద్దంగా ఉండేది. కాని కాంగ్రెస్ వారి గొడవల్లో తెలుగుదేశం ఎక్కువ ఆత్రపడి జగన్ పై కోర్టులకు వెళ్లింది.అనవసరంగా టిడిపి కి లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాలన్నిటిని గమనిస్తున్న జనం ఇదంతా జగన్ పై ద్వేషంతో చేస్తున్నారని భావించేలా పరిస్థితి ఏర్పడింది. దాంతో జగన్ టిడిపికి ప్రధాన ప్రత్యర్ధి అన్న భావనను వీరే కల్పించారు.అంతదాకా ఎందుకు కొద్ది రోజుల క్రితం మంగలి కృష్ణకు సూట్ కేసు బాంబు కేసులో శిక్ష పడితే, ఆ వెంటనే చంద్రబాబు నాయుడు మీడియా సమవేశం పెట్టి జగన్ కు ఆపాదించడానికి ప్రయత్నించారు. పరిటాల రవి హత్యకేసులో జగన్ ముద్దాయి అని ఆరోపించారు. నేర రాజకీయాల గురించి మాట్లాడిన ఆయనను ఎవరైనా పరిటాల రవి నేర రాజకీయాలకు దూరంగా ఉన్నారా?ఆయనకు ఎందుకు టిడిపి టిక్కెట్ ఇచ్చిందని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజానికి చంద్రబాబు తన పాలనలో ఫ్యాక్షన్లను ప్రోత్సహించని మాట నిజమే. కాని అంతమాత్రాన అసలు ఫ్యాక్షన్ ముఠాలు లేవని అనుకుంటే పొరపాటు. ఇలాంటి వైరుధ్యాల వల్ల చంద్రబాబు ఎక్కువ ఆందోళన చెందుతున్నారన్న భావన కలిగించారు. ఏకంగా జగన్ ముఖ్యమంత్రి అయితే దొంగలే మంత్రులు అవుతారని ఉపమానం చెబుతున్నారు. ఒక కోణంలో చూస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యే దశకు ఎదిగారని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతుందన్న సంగతిని వారు మర్చిపోతున్నారు.అంటే ఎంతసేపు జగన్ పై వ్యక్తిగత దాడికి అధినేతే సన్నద్దమవుతున్నారు.నిజానికి చంద్రబాబు విధానపరమైన అంశాలకు పరిమితమై, ఆ తర్వాత శ్రేణి నాయకులతో ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటేబాగుండేదేమో. ఇలా నిత్యం జగన్ పై నే విమర్శలు కురిపిస్తుండడంతో జగన్ ఎప్పుడూ జనంలో ఉండడానికి చంద్రబాబు కూడా ఉపయోగపడ్డారనిపిస్తుంది.జగన్ పై మోతాదుకు మించి దాడి చేసి తాము నష్టపోయామని, ఇది అర్దం అయ్యేసరికి తాము వెనక్కిరాలేని పరిస్థితి లో పడ్డామని టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఇక సోనియాగాంధీ కూడా అదేమాదిరి ఎవరి చెప్పుడు మాటలు విన్నారో కాని ఓదార్పుయాత్ర విషయంలోకాని, ఇతర అంశాలలో కాని రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల, జగన్ పట్ల వ్యవహరించిన తీరు రాజశేఖరరెడ్డి అభిమానులలో బాధ కలిగించింది. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం ఇది తమను అవమానించడం గా భావించింది. వారంతా జగన్ కు అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు.మామూలుగా అయితే జగన్ ఓదార్పు యాత్ర చేసుకుంటూ జనాన్ని సమకూర్చుకోవడానికే సతమతమవ్వాల్సి వచ్చేది.కాని ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య దీని గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఒకటి,రెండు సందర్భాలలో జగన్ త్వరలో రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందని అని ఉండవచ్చు. అలాంటప్పుడు రోశయ్య పిలిపించుకుని దాని గురించి నచ్చచెప్పి ఉండవచ్చు.కాని ఆయన దీనిని కూడా ప్రతిష్టగా తీసుకున్నారు.జగన్ వెంట ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు చెప్పడం,కొందరు కాంగ్రెస్ నేతలు నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం ద్వారా ఆయన ప్రాముఖ్యతను విశేషంగా పెంచేశారు.ఇక డాక్టర్ శంకరరావుతో కోర్టులో కేసు వేయించిన తీరుకాని, హైకోర్టు తీర్పు ఇచ్చిన వైనం కాని, తదుపరి సిబిఐ విచారణ జరుగుతున్న పద్దతి కాని ఇవన్ని జగన్ పట్ల సానుభూతిని పెంచేవిగానే ఉన్నాయి. ఇక జగన్ అరెస్టు అవుతారా? లేదా? అందుకు లా ప్రకారం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతోందన్న భావన .. ఇవన్ని జగన్ కు సానుభూతి తెచ్చిపెట్టాయి. వీటికి తోడు జగన్ ఓదార్పుయాత్ర విషయంలో సోనియాను సైతం దిక్కరించి ఒక పెద్ద నేతకు సవాలు విసిరారన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే యాత్రను కొనసాగిస్తూ, ఆయా అంశాలపై దీక్షలను నడుపుతూ నిరంతరం జనంలో ఉంటున్నారు.ఇది కూడా ఒక రికార్డుగానే చెప్పవచ్చు.పైగా రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోయి మృతి చెందిన అభిమానులకు లక్ష రూపాయల పరిహారం అందించడం కూడా ఆయా వర్గాలను ఆకర్షించింది.తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు కూడా లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నామని హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఎమ్.పిలు రెండు , మూడు జిల్లాలలో సభలు పెట్టి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఈ నేపధ్యంలో జగన్ ఎక్కడా అభిమాన కుటుంబాలను వదలి పెట్టడం లేదు. ఇక ఇదే పనిపై వరంగల్ జిల్లాకు వళ్లబోతే వద్దని చెప్పి రోశయ్య ప్రభుత్వం రైలుపై రాళ్లు వేసినవారిని అడ్డుకోకుండా, రైల్లో వెళుతున్న జగన్ ను అడ్డుకుని ఆయనను హీరోను చేసింది.అంతేకాదు. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్,టిడిపిలు డిపాజిట్లు పోగొట్టుకుని , ఇప్పుడు ఉప ఎన్నికలలో ఉనికిని రక్షించుకోవడానికి తంటాలు పడుతున్న తీరు...ఇవన్ని జగన్ ను నాయకుడిగా తయారు చేశాయి.వీటికి తోడు దళితులు, ముస్లింలను ఆకట్టుకోవడానికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అమలు చేసిన కొన్ని స్కీములను కూడా జగన్ విజయవంతంగా వాడుకున్నారు. మొత్తం మీద దేశ చరిత్రలో రెండు, మూడేళ్లలోనే ఒక బలమైన నాయకుడిగా ఎదిగిన ఖ్యాతి జగన్ కే దక్కిందని అనుకోవాలి. ఇక్కడ మరో పాయింట్ ఏమిటంటే జగన్ గతంలో అవినీతి ద్వారా ఆస్తులు సంపాదించలేదని ఎవరూ అనుకోవడం లేదు. కాని అవినీతి చేయని నేతలు ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నను జనం వేస్తున్నారు. పైగా జగన్ ఒక్కడే అవినీతిపరుడన్నట్లు ఇతర పార్టీలు చేస్తున్నవిమర్శలు కూడా ఆయన ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి.వీటన్నిటిని చూస్తే జగన్ తనంతట తాను నాయకుడిగా ఎదగడానికి కష్టపడినదానికన్నా, ప్రత్యర్ధులు చేసిన సాయం కూడా ఎక్కువేనని అర్ధం కావడం లేదూ..