Reporter Sridhar
Part of telling a new story has to be telling it in new ways
Thursday, January 25, 2018
Thursday, March 10, 2016
పూజా స్టోర్ ల శఠగోపం
.మానసిక బాదలు ,
ఆర్థిక ఇబ్బందులు,
ఇంకా ఎన్నో కష్టాలు......మరో వైపు... ఎన్నో
ఆశలు , ఉన్నత స్థాయిలో ఉండాలన్న కోరికలు....ఇవన్ని
ఇప్పుడు కొందరికి కొత్త ఉపాది ని తెచ్చిపెడుతున్నాయ్... .. వింత వింత వస్థువుల తో
పూజలు చెయాలంటు చెప్పె మొసగాళ్ల మాటలు ప్రజలు నమ్ముతుండడంతో పూజా స్టోర్ ల
వ్యాపారం జోరందుకుంది.... బలహినతలే ఆసరాగా చెసుకోని ముడనమ్మకాల, అశాస్త్రియ పద్దతుల ప్రచారం వలలో పడి మద్య
తరగతి జివి నలిగిపోతున్నాడు...
... మూడనమ్మకాలకు
మన దేశం పెట్టింది పేరు, ప్రతి సంస్కృతి,
మతం , ప్రాంతాల వారిగా వారికి తగ్గ విధంగా కొన్ని
మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు. అందులో కొన్ని మూఢనమ్మకాలకు కొన్ని సైంటిఫిక్ కారణాలు
కూడా ఉన్నాయి, వాటిలో సిల్లీగా కూడా
అనిపిస్తాయి కోన్ని అయినా ఫాలో అవుతున్నారు... దేశవ్యాప్తంగా ఉన్నఆధునీకరణ మరియు
కొత్త జనరేషన్ వారు కూడా ఇటువంటి పిచ్చి మూడనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూడ
నమ్మకాలతో పల్లెలు, గ్రామాల్లోనే
కాదు, పట్టణాల్లో కూడా
ఎక్కువుగా ప్రబలుతున్నాయి. అటువంటి మూఢనమ్మకాల ఆధారంగా నగరాల్లో కొత్త బిజినెస్ లు
నడుస్తున్నాయ్... అవే... గతంలో ఎక్కడా కనిపించని పూజా స్టోర్ లు ఇప్పుడు
గల్లికోకోకటి కనిపిస్తున్నాయ్...
.. ప్రతి మనిషికి
ఎదో ఓ కష్టం ఉంటుంది...చాలా మందికి ఇంటిలో కలహాలు కామన్...వాటిని తిర్చేందుకు ఎదో
సోల్యుషన్ కూడా ఉంటుంది ..కాని విలైనంత తోందరగా కష్టాలనుండి గట్టెక్కాలనుకునే ఆతృత లో దెన్నైనా నమ్మేస్తారు...సరిగ్గా ఆలాంటి
బలహినతలే ఆసరాగా చేసుకోని మొసపోతుంటారు...కష్టాలు తీరడం పక్కనపెడితే ..మరింత
మానసిక , ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కుంటున్నారు... అలాంటిదే ఓ సంఘటన ...ఓ వారం రోజుల కింద నిర్మల్ లో జరిగింది
...ఈ సంఘటన పూజ ల పేరుతో మూడనమ్మకాలు ఎ స్థాయిలో ఉన్నాయో తెలియచెస్తుంది...
మి ఇంట్లో కలహలా...మి పిల్లలు చదువులో ప్రతిభ కనభర్చాలా... వివాహాది శుభకార్యాలు
ఆలస్యం అవుతున్నాయా...మి ఇంట్లో ఎదో దోషం ఉండి ఉంటుంది ఆ దోశం పోవాలంటే ఈ రోజు
రాత్రి ఎకనారి కేలం మి ఇంటి గుమ్మానికి కట్టండి అంటు ఓ స్వామిజి టివిలో సెలవిచ్చారు......ప్రతి ఇంట్లో ఇలాంటి కోరికలు
కామన్ కాబట్టి ... టివిల్లో అది చూసిన జనం పూజా స్టోర్ లకు పరిగెత్తారు...జనం
బలహినత ను క్యాష్ చేసుకునేందుకు పూజా స్టోర్
వ్యాపారుల సిండికెట్ ఎకనారి కేలాలు
లేవని హైదరాబాద్ నుండి తెప్పిస్తున్నాని కస్టమర్ లను తిప్పిపంపారు ...సాయంత్రం
వరకు ఖచ్చితంగా కావాలని ముందే డబ్బులు సైతం ఇచ్చారు కస్టమర్లు...పది రూపాయల విలువ
కూడా చేయని ఎకనారి కేలాలు ఎకంగా 600 రూపాయలు ధర ఫిక్స్ చేసారు... రాత్రి 9.30వరకు
ఇంటి గుమ్మానికి కట్టాలి లేదంటే ఎదో జరుగుతుందనే భయంతో జనం పూజా స్టోర్ ల చుట్టు
తిరిగారు...సాయంత్రానికి ఎకనారి కేలాలు అందుకున్న కస్టమర్ లు ఆశ్చర్యపోయారు...
ఎకనారి కేలం అంటే ఎందో అనుకున్నారు... అది కేవలం ఓ కొబ్బరి కాయ పిందే..... కొబ్బరి
కాయకు ముడు (రంధ్రాలు) కన్నులుంటాయి....అదే పిందె గా ఉన్నప్పుడు ఒకే రంద్రం
(కన్ను) ఉంటుంది దాన్నే ఎకనారి కేలం అంటరని అప్పుడు తెలుసుకున్నారు...కాని ఎం చేయలేక
సైలెంట్ గా తిసుకోని పోయి ఇంటి గుమ్మాలకు కట్టుకున్నారు...చాలా మంది ఇళ్లల్లో
కొబ్బరి చెట్లు ఉన్నాయి...కాని తెలుసుకునే సమయానికి ఆ శుభముహుర్తం
అయిపోయింది...స్వామిజి అలా సెలవిచ్చారు మరి...
...ఇలా తాజాగా
నిర్మల్ లో జరిగిన ఈ సంఘటన అంతటా జరుగుతునే ఉంది....అసలు గతంలో ఎప్పుడు వినని
ఎ శాస్త్రాల్లో ఉన్నాయో ఎవరికి తెలియని
కొత్త వస్తువులు ...పూజా స్టోరో లలో అమ్మకానికి పెడుతున్నారు...అందుకు తగ్గట్టు
స్థానికంగా కొంత మంది ..టివిలు ఇతర ప్రసార మాద్యమాల్లో కొంత మంది ప్రజలను
ముడనమ్మకాల్లోని ముంచేస్తున్నారు... ప్రతి
ఉరి కి ఓక్కో స్వామిజి ఉంటు
భక్తులను పూజల పేరుతో మొసం చేస్తుండడంతో
పూజా స్టోర్ ల వ్యాపారం జోరందుకుంటుంది..ప్రతి గల్లి కి ఓ కిరిణా షాపు ఎట్లా ఉంటుందో అట్లా ఇప్పుడు పూజా
స్టోర్ లు ఉంటున్నాయ్... ఆ షాపుల్లో
ఎప్పుడు మనం వినని వింత వింత వస్తువులు అమ్మకానికి పెడుతున్నారు...
... ఎ
శాస్త్రాల్లో ఎవరు చెప్పారో కూడా తెలియని వస్తువుల జాబితా ఆ షాపుల్లో ఉంది...స్థానిక
జ్యోతిష్కులు జాతక దోషాల పేరుతో బయపెట్టి నివారణ కు పూజలు చేయాలంటుడడంతో బయంతో
ఎదంటే అది చేస్తున్నారు....వందల సంవత్సరాల క్రితం ఆ కాలంలో దోరికిన వస్తువులతో
పూజలు చేసారు... అప్పుడు అవే దోరికేవి అందుకే వాటినే వాడేవారు..ఇప్పుడు కూడా
వాటితోనే పూజలు చేయలనుకోవడం మూడనమ్మకమేనని పలువురు అబిప్రాయపడుతున్నారు....పలనా
వస్తువుతోనే పూజలు చేస్తేనే దేవుడు కరుణిస్తాడనడం మూర్ఖత్వమేనని కోట్టి
పారేస్తున్నారు.. మాన పసుపు, కస్తూరి పసుపు, కచ్చూరాలు, బాంచాలు, అతిమధురం, పిప్పళ్లు, ఆశ్వగంధ, వన, వాయు మిరియాలు, కలకండ, మంజిస్ట, ఆకుపత్రి నాకేశ్వరాలు, ఆవాల నూనె, విప్పనూనె, చిన కరక పిందెలు, చెంగల్వా కోస్టు, గుంట గలగరాకు ,సరస్వతి ఆకు, తెల్లఆవాలు, పెద్ద ద్రాక్ష, దానిమ్మ బెరడు, సరస్వతి ఆకుపోడి,
ఉసిరిగ పొడి, గుంటగలరాకు పొడి, మారెడు గుజ్జు, ఆకుపొడి, త్రిఫల చూర్ణం, పూజా నూనెలు, ఆయుర్వేద తైలములు, పాద రస లింగాలు, శ్రీ చక్రాలు, మెటల్ సింహాసనాలు, పీటలు, మెటల్ పైపు పూజా సామాగ్రి, గోపురం సామాగ్రి,
స్వాతి హెర్బల్స్,
, ధర్భాసనాలు, కమండలాలు, మునికర్రలు ఇట్లా ఎన్నో వస్తువులు అమ్మకానికి
పెడుతున్నారు... పేద మద్య తరగతి ప్రజలు
ఇలాంటి మాయల్లో పడి డబ్బు విలువైన సమయం వృదా చేసుకోవడమే కాకుండ సమస్యకు పరిష్కారం
దిశగా ఆలోచించకుండా దేవుడి పై బారం వెస్తు సమస్యలను ఝటిలం చేసుకుంటున్నారంటున్నారు
హేతువాదులు...మారుతున్న కాలానికి అనుగునంగా మారుతూ ఎవరు ఎది చెప్తే అది చేసేయడం
మాని రానున్న తరాలకైనా ప్రశ్నించే తత్వం నేర్పాలని జనవిజ్ఞాన వేధిక లాంటి సంస్థలు
కోరుతున్నాయ్...
Thursday, February 11, 2016
యునివర్సిటి కోసం గిరిజనుల పోరాటం
నాగోబా జాతరలో బాగంగా జరిగిన దర్బార్ కార్యక్రమం నిరసణలతో అట్టుడికింది....ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యునివర్సిటి ఎర్పాటుచేయాలని డిమాండ్ చెస్తు గిరిజన సంఘాల నాయకులు మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకున్నారు...పోలిసులు వారిని అరెస్ట్ చేసిన తరువాత సభలో మరికోంత విధ్యార్థి సంఘాల వారు ఆందోళన చెపట్టారు...గిరిజన యునివర్సిటి పై స్పష్టమైన హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు....సభలో ఉన్న మంత్రులు జోగు రామన్న , ఇంద్రకరణ్ రెడ్డిల కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు...
...నాగోబా జాతర సమయంలో ఎక్కడెక్కడో ఉన్న గిరిజనులంతా జాతరకు వస్తుంటారు...గిరిజన సమస్యలపై అక్కడే అధికారులు , ప్రజాప్రతినిధులు ఫిర్యాధులు స్వికరించే విధంగా దర్బార్ ఎర్పాటు చేస్తారు ...ఈ పద్దతి నిజాం కాలంలో కోమురం బీం మరణం తరువాత అప్పటి ప్రభుత్వం హైమన్ డార్ఫ్ అనే శాస్త్రవేత్త సూచన మేరకు ఎర్పాటు చేసింది....ఈ దర్బార్ లో సమస్యలపై అధికారులు అక్కడే స్పందించి చర్యలకు పునుకోవడం లేదా మళ్లి వచ్చే దర్బార్ వరకు చేసేస్తాం అని చెప్తుంటారు...
.. గిరిజన యూనివర్సిటి కోసం పోరాటం చెస్తున్న గిరిజన సంఘాలు ,యువజన సంఘాలు దర్బార్ లో నిరసణ వ్యక్తం చేయడం పట్ల జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసహణం వ్యక్తం చేసారు...గిరిజన పండుగల్లో మీ రాజకీయాలేంటని...మొన్నటి ఎన్నికల్లో మీ పార్టిల పరిస్థితి చూసి కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారా అంటు మండిపడ్డాడు...గిరిజన యునివర్సిటిి కోసం అవసరమైతే అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం అని ఇలాంటి రాజకీయాలు చేస్తే బాగుండదని మండిపడ్డాడు... నిరసణ వ్యక్తం చేసిన సంఘాల నేతలను అరెస్ట్ చేసి గుడిహత్నుర్ పోలిస్ స్టేషన్ కు తరలించారు....
...నాగోబా జాతర సమయంలో ఎక్కడెక్కడో ఉన్న గిరిజనులంతా జాతరకు వస్తుంటారు...గిరిజన సమస్యలపై అక్కడే అధికారులు , ప్రజాప్రతినిధులు ఫిర్యాధులు స్వికరించే విధంగా దర్బార్ ఎర్పాటు చేస్తారు ...ఈ పద్దతి నిజాం కాలంలో కోమురం బీం మరణం తరువాత అప్పటి ప్రభుత్వం హైమన్ డార్ఫ్ అనే శాస్త్రవేత్త సూచన మేరకు ఎర్పాటు చేసింది....ఈ దర్బార్ లో సమస్యలపై అధికారులు అక్కడే స్పందించి చర్యలకు పునుకోవడం లేదా మళ్లి వచ్చే దర్బార్ వరకు చేసేస్తాం అని చెప్తుంటారు...
.. గిరిజన యూనివర్సిటి కోసం పోరాటం చెస్తున్న గిరిజన సంఘాలు ,యువజన సంఘాలు దర్బార్ లో నిరసణ వ్యక్తం చేయడం పట్ల జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసహణం వ్యక్తం చేసారు...గిరిజన పండుగల్లో మీ రాజకీయాలేంటని...మొన్నటి ఎన్నికల్లో మీ పార్టిల పరిస్థితి చూసి కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారా అంటు మండిపడ్డాడు...గిరిజన యునివర్సిటిి కోసం అవసరమైతే అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం అని ఇలాంటి రాజకీయాలు చేస్తే బాగుండదని మండిపడ్డాడు... నిరసణ వ్యక్తం చేసిన సంఘాల నేతలను అరెస్ట్ చేసి గుడిహత్నుర్ పోలిస్ స్టేషన్ కు తరలించారు....
పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు ఆదిలాబాద్ జిల్లా వచ్చారు
ముల్తానీలు..! ఈ పేరు వింటేనే ఆదిలాబాద్ జిల్లా ఉలికిపడుతుంది. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాలు ఆగమాగమై పోతాయి. ముల్తానీల కర్కశత్వాన్ని గురించి కథలు కథలుగా గుసగుసలు పోతాయి. అటవీ, పోలీసు అధికారుల ఫైళ్లు.. వారి నేరాల గురించి రికార్డు.. రికార్డులుగా చాటుతాయి. వారి వద్దకు వెళ్లడమే తప్ప తిరిగి వచ్చిన వారు లేరన్న ప్రచారమూ ఉంది. ఇంతకీ ఎవరీ ముల్తానీలు.. ఏమిటి వీరి కథ..? వీరి గురించి సాగుతున్న ప్రచారంలో వాస్తవమెంత..? వారి గోస ఏంటి.. వారెందుకిలా మారారు..? ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది.. టెన్ టివి.
ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో....
ముల్తానీ..! ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో నివసించే ఓ ముస్లిం తెగ. అడవుల్లో చెట్లను నరకడం.. కలపను దుంగలుగా మార్చి.. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం.. వచ్చిన కాస్తో కూస్తో డబ్బుతో పొట్టపోసుకోవడం.. ఇదీ ఇక్కడి ముల్తానీల జీవన విధానంపై సమాజానికి ఉన్న దృక్కోణం. అడవిని హరించడమే కాదు.. హైవేలపై లారీలను హైజాక్ చేస్తారని.. ఆ లారీల్లో కలపను స్మగ్లింగ్ చేస్తారని.. అడ్డు చెప్పే వారిపై కర్కశ దాడులకు తెగబడతారన్నదీ ముల్తానీలపై ఉన్న ప్రచారం. అటవీ, పోలీసు అధికారులదీ ఇదే భావన.
బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు....కానీ...
ఇచ్చోడ మండలంలోని ఈ నాలుగైదు ముల్తానీ గ్రామాల గురించి బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు. కానీ.. జిల్లాలో ముఖ్యంగా అటవీ పరిసరాల ప్రజలకు మాత్రం వీరి గతం.. వర్తమానం.. చిరపరిచితం. అవిభక్త భారతదేశంలో.. పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు.. ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చారు. ఆ తర్వాత దేశం రెండుగా విడిపోయినా వారు మాత్రం.. భారత్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు వారి వారసులు.. ఇక్కడే నాలుగైదు గ్రామాల్లో స్థిరపడిపోయారు.
ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ.....
ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ జంకుతారన్న ప్రచారం జిల్లాలో ఉంది. చెకింగ్స్‌లో దొరికినప్పుడు కేసులు పెట్టడం వరకే రక్షక భటులు పరిమితమయ్యారనీ అంటారు. ఇంతటి నేర చరిత్ర ఉందన్న ప్రచారం వల్ల... ఈ గ్రామంతో సత్సంబంధాలు పెట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని.. భయంకరమైన పల్లెలుగా చెప్పుకునే ఈ ముల్తానీ గ్రామాల్లో వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు.. ఆ గ్రామాల్లో పర్యటించాను.
ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో....
ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో మీడియా కూడా ఇంతకాలం ఈ గ్రామాలకు వెళ్లిందే లేదు. అధికారులు చెప్పిన కథలనే కథనాలుగా ప్రచురించి, ప్రసారం చేసింది మీడియా. ఈ నేపథ్యంలో.. ముల్తానీలు నివసించే గుండాల గ్రామాన్ని సందర్శించాను. స్థానికులను పలుకరించాక.. వారిపై బాహ్యప్రపంచంలో జరుగుతున్న ప్రచారానికీ.. వాస్తవానికి ఏమాత్రం పొంతన లేదని తేటతెల్లమైంది. నరకడం సంగతి అటుంచి.. ఎంతో గౌరవంగా తమ స్థితిగతులను చూపుతూ.. హృదయాంతరాళలోని వేదనను వ్యక్తీకరించారు.
పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు....
నిజాం ప్రభువుల కాలంలో... పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు ఆదిలాబాద్ జిల్లా వచ్చారు. పాక్‌లో వీరి ప్రాంతం పేరును బట్టే.. వీరిని ముల్తానీలుగా పిలుస్తున్నారు. వీరి సంతతి ఇచ్చోడ పరిసరాల్లోని సిరికొండ, వాయిపేట్, గుండాల, జోగిపేట్, కేశవపట్నం, ఎల్లమ్మగుట్లల్లో తప్పించి మరెక్కడా కనిపించదు. వీరు పూర్తిగా టేకు చెట్లను నరకడమే వృత్తిగా జీవిస్తున్నారని.. ఆ క్రమంలో ఎంతటి నేరానికైనా తెగిస్తారనీ ప్రచారంలో ఉంది. ముల్తానీలు చూడ్డానికి సన్నగా రివటలా కనిపిస్తారు. కానీ ఎంతపెద్ద టేకు దుంగనైనా ఇట్టే ఎత్తడమే కాకుండా, ఎంత దూరమైనా మోసుకుపోయే శక్తి కలిగి ఉంటారన్నది అటవీ అధికారుల కథనం.
అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. ...
అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. స్మగ్లింగ్‌తో పాటు ఆదాయం కోసం కొంత మంది ముల్తానీలు అడ్డదారులు తొక్కారు. ఆ చెడ్డపేరు ముల్తానీలందరిపైనా పడింది. కలప రవాణ కోసం లారీలను హైజాక్ చేయడం.. దారి దోపిడిలకు పాల్పడడం లాంటివి ముల్తానీలందరికీ మాయని మచ్చను తెచ్చిపెట్టాయి. తద్వారా సమాజానికి వీరిని దూరం చేశాయి.
. ప్రాథమిక విద్యకూ వీరు దూరం...
ముల్తానీల కర్కశత్వం గురించిన ప్రచారంతో.. అధికారులెవరూ ఈ గ్రామాల వైపు చూసిన దాఖలాలు లేవు. ప్రాథమిక విద్యకూ వీరు దూరమయ్యారు. పిల్లలను బయటి ప్రాంతాల్లో చదివిద్దామనుకున్నా.. వీరికి ఆర్థిక స్థోమత అడ్డుగా నిలుస్తోంది. ఒకవేళ బయటి ప్రాంతాలకు వెళ్లి ఏదైనా ఉపాధిని వెతుక్కుని... పిల్లలను చదివిద్దామన్నా.. ముల్తానీలు అని చెప్పగానే.. వీరికి ఎవరూ ఉపాధిని ఇవ్వడం లేదు. అటు ప్రభుత్వమూ వీరి గురించి ఆలోచించిన దాఖలా లేదు.
ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని....
ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని.. నిజామాబాద్ ప్రాంత కలప స్మగ్లర్లు వీరికి ఉపాధి కల్పిస్తామని ఆశ చూపుతూ.. కలపను అక్రమంగా కొట్టిస్తున్నారు. అడ్డుకున్న అటవీ అధికారులపై.. ముల్తానీలతోనే దాడులు చేయించేవారు. ఉపాధిని అడ్డుకుంటున్నారన్న కోపంతో.. ముల్తానీలూ ఒకేతాటిపైకి వచ్చి.. అటవీ, పోలీసు అధికారులపైనా దాడికి తెగబడేవారు. దీంతో ముల్తానీలు తరచూ కేసుల్లో ఇరుక్కోవడం.. జైలు పాలై శిక్ష అనుభవించడం రివాజుగా మారింది. అధికారులు కూడా ఏళ్ల తరబడి వీరిపై కసి పెంచుకున్నారే తప్ప.. సమస్య మూలాలను అన్వేషించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ముల్తానీలు తరతరాలుగా దుష్టులుగానే ముద్రపడిపోయారు.
అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్...
అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగించిన అటవీ అధికారులు.. కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. దీంతో.. స్మగ్లర్లకన్నా.. ముల్తానీలే ఎక్కువగా నష్టపోయారు. పైగా ఇళ్లల్లోకి పోలీసులు జొరబడి వేధిస్తుండడంతో మరింత వేదనకు గురవుతున్నారు. మారిన ముల్తానీల కుటుంబాల బాగోగుల కోసం.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని వీరి గురించి బాగా తెలుసుకున్న వారు అంటున్నారు. పొలాల్లో బోర్లు తవ్వడం.. వ్యవసాయ రుణాలు ఇప్పించడం లాంటి ప్రోత్సాహకాలు అందించాలనీ సూచిస్తున్నారు.
సర్కారు తరఫున సహాయం అందించేందుకు..
సర్కారు తరఫున సహాయం అందించేందుకు.. ఇప్పుడిప్పుడే కొందరు అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ముల్తానీల కోసం ప్రత్యేకంగా ఆరు ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని.. పూర్తిగా వర్షాధారితమైన వీరి వ్యవసాయ భూముల్లో బోర్లు వేయించాలని.. ప్రత్యామ్నాయ వృత్తివైపు వీరిని మళ్లించాలని.. రాయితీపై రుణాలు అందించాలంటూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలూ కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకుంటే.. ముల్తానీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సమాజానికీ మేలు జరుగుతుంది.
ఇది కథ కాదు
పెళ్ళైన నెలకే బార్యను చంపేందుకు సిద్దం అయిన భర్త..చంపే ముందు రక్తపు మడుగులో ఉన్న బార్య పై అత్యాచార యత్నం
ఆదివాసులు మిగిలన కొద్దిపాటి మూలవాసి సమూహాల గుర్తులు
ఆదివాసులు మిగిలన కొద్దిపాటి మూలవాసి సమూహాల గుర్తులు ... ఆదునిక సమాజం హైందవం పేరుతో వారి ఆహారానికి,ఆహార్యానికి దూరం చేస్తోంది.. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో గోండు గిరిజనుల్లోని మెస్రం వంశస్థులు జరిపే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర....ఈ జాతర వారి జివితానికి సంబందించింది...చెట్టుకోకరు గుట్టకోకరు నివసించే గోండులు , కోలామ్ లు , పరదాన్ లు అనే గిరిపుత్రులు ఈ జాతరతో కలుస్తారు...తమ బందువులను కలవడమే కాదు కోత్త బందాలకు నాంది ఈ నాగోబా జాతర...వారం పది రోజుల పాటు జాతర కోసం ఎడ్ల బండ్ల పై , కాలి నడక న ఇంద్రవెళ్లి మండలంలోని కెస్లాపుర్ కు తరలివస్తారు... దారిలో ఎంతో నిష్టగా క్రమశిక్షణతో ప్రకృతితో మమేకమవుతునే నాగోబా చెంతకు చెరుతారు.. నాగోబా జాతరలో ప్రధానంగా జంతువుల బలి ఇచ్చి తర్వాత వాటితో పండుగను ఆస్వాదించడం గిరిజనులు ఆనవాయితి...కాని ఇప్పుడు ప్రభుత్వాలు అదికారిక జాతరగా జరపడం
జంతు బలులు నిషేదించడం అంతా జరిగిపోయింది...జాతరను ఎన్నో సంవత్సరాలుగా చేస్తు వస్తున్న అడవిబిడ్డలకు రాను రాను తమ ఆచారలను పద్దతులు ఎవరో గుంజుకుంటున్నారనే బావన కలుగుతుంది...ముందు నాగోబా జాతర అంటే గిరిజనులది మాత్రేమే కాని ఇప్పుడు మైదాన ప్రజలు వస్తుండడంతో వీరి సాంప్రదాయాలు పోయి వారి ఆదునిక పోకడలు పెరిగి పోతున్నాయ్...ఇదే మాట నలబై యెండ్ల కింద నాగోబాను సందర్శించిన హైమన్ డార్ప్ తన పరిశోధనా పుస్తకాల్లో రాశారు.... ప్రతియేట తమదైన పండగను తమకు కాకుండా చెస్తున్నారనే కోపాన్ని పంటి కింద
అనుచుకుంటున్నారు గిరిజనులు... పాత తరానికి చెందిన సాంప్రదాయ గోండు పెద్దలు ఎక్కడికో పరాయిదేశానికి
వచ్చామన్న భావనతో ఉన్నారు...గోండులకోసం గోండుల చేత జరుపుకునే స్వంత ఉత్సవంలో ఇప్పుడు పూర్తిగా బయటివాల్లమైపోతున్నామనే బాదపడుతున్నారు...సురుజి మహరాజ్ సంస్కరణోద్యమం పేరుతో పూర్తిగా హైందవికరించబడ్డామని మరికోందరు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు....ట్రైబ్స్ అఫ్ ఇండియా ...ద స్ట్రగుల్ సర్ వైవల్ అనే పుస్తకంలో హైమన్డార్ఫ్ గోండుల స్థితిగతులపై నాగోబా జాతర పై పరిశోదించి రాసిన వ్యాసాలలో అప్పటి పరిస్థితి వివరించారు....... పూర్తిగా మెస్రం వంశస్థులదే అయిన నాగోబా ఆలయం... 1977 లో కేస్లాపుర్ లోని నాగోబా దేవాలయ కమిటి లో మర్సకోల కాశిరాం ( అధ్యక్షుడు) ఉన్న సమయంలో దేవాదాయ శాఖ సిబ్బంది కోశాదికారిగా ఉండేవారు...ఆ సమయంలోనే పూర్తిగా మెస్రం వంశస్థులు పట్టు కోల్పోయి.. గోండులకు హిందువులకు కలిపి ఓకే
దేవాలయంగా మార్చేసారు...ఈ ఆలయాన్ని గణ పూజారి మెస్రం నాగు వ్యతిరేఖించాడు...మన సంప్రాదాయలన్ని పోయి హైందవ సాంప్రదాయంలో మనం మగ్గిపోవాల్సి వస్తుందని తన జాతికి అధికారులకు వివరించాడు..కాని ఆయనను పట్టించుకోలేదు...చివరకు ఆయన భయాలన్ని నిజమయ్యాయి....
పై మాటలు మనవ పరిణామ శాస్త్రవెత్త హైమన్ డార్ఫ్ తన పుస్తకం లో రాసుకున్నారు.... అప్పుడే అట్లా ఉంటే ఇప్పటి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి..ʹʹమేం జంతుబలులు చేసేది యజ్ఞ యాగాదుల్లో దహనం చేయడానికి కాదు...మేం ఆహారంగా తినే జంతువులనే దేవుని మందు కోస్తాంʹʹ అని ..దాని ద్వారా తమ దేవుల్లకు తమ ఆహారాన్ని నైవేద్యంగా ఇస్తామని గిరిజనులు అంటున్నారు..... ప్రతిరోజు నగరాల్లో, టౌన్ లలో మటన్ షాప్ లు చికెన్ షాప్ లలో జంతువులును చంపడాన్ని జంతుబలులుగా చూడని వారు తమ ఆహారాన్ని మాత్రమే జంతుబలులుగా ఎందుకు చూస్తారని మండిపడుతున్నారు.... మా సాంప్రదాయలని మాకు వదిలేయాలని
హైందవికరించి మా హక్కులను హరించవద్దని గిరిదనులు డిమాండ్ చెస్తున్నారు... సంవత్సరానికోసారి కలుసుకునే బందువులంతా సంతోషంగా ఉండే పండుగను మాకే వదిలేయాలని కోరుతున్నారు...... గోండులకే పరిమితమైన వారి ఆచారాలలో ఇతరుల పెత్తనం పెరిగి పోవడంతో చేసేదేం లేక గుడి వెనక దూరంగా ఓ చిన్న గుడిసెలో తమ పెంపుడు కోళ్లు , మెకలను బలి ఇస్తు తింటున్నారు...గుడి ముందు మాత్రం హిందు సాంప్రదాయలను పాటిస్తు తమకు అంతకు మందెన్నడు తెలియని కోబ్బరికాయలు కోట్టే సంస్కృతిని అలవాటు చెసుకున్నారు....
Sunday, August 30, 2015
రక్తహీనత...విషజ్వరాలు......అనాదలు......బాల్యవివాహాలు ...
----రక్త హీనత ...విషజ్వరాలతో ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న అనాద పిల్లలు
-----విషజ్వరాలతో గిరిజన పిల్లలు
అనాదాలుగా మారుతున్నారు...
-----అనాద పిల్లల్లో పెరుగుతున్న
బాల్యవివాహాలు ఫలితంగా చిన్న తనంలోనే తల్లులవుతు మరణిస్తున్న బాలికలు
.ఆదిలాబాద్ ఎజెన్సి
ప్రతిసంవత్సరం వర్షకాలంలో విషజ్వరాలతో వణికిపోతుంటుంది... ఎందరో గిరిపుత్రులు వ్యాదులు
తట్టుకోలేక ప్రాణాలు వదులుతారు...ప్రభుత్వాలు
హడావిడి చెస్తాయ్...అధికారులు ఎదో చెసెసామని చెతులు దులుపుకుంటారు...కాని ప్రతి
యెటా జరిగే.... ఈ మరణాల వెనక మరో కోణం దాగుంది... ఈ చావులతో వందలాది మంది గిరిజన పిల్లలు
అనాదలవుతున్నారు....
..... విషజ్వరాలు వర్షాకాలం
వచ్చి వందలాది మంది గిరిజనాన్ని పోట్టన పెట్టుకుంటాయ్... ఈ సీజనల్ వ్యాధులపై ప్రతియెడు
చర్చ జరుగుతునే ఉంటుంది...ప్రభుత్వాలు అది చెస్తున్నాం ఇది చెస్తున్నం అంటునే ఉంటాయ్...అధికారులు
ఆ టైమ్ లో నే హాడావిడి చెస్తారు... స్వచ్చంద సంస్థలు సైతం సేవా కార్యక్రమాలు చెపడతాయ్...కాని
మరణాలు మాత్రం ఆగవు ...అలా జరుగుతునే దశాబ్దాలు గడిచిపోతున్నాయి...
....ఆదిలాబాద్
అడవుల్లో విషజ్వరాల కారణంగా గత 18 సంవత్సరాలలో 600 మంది గిరిజన పిల్లలు అనాదలయ్యారు....
డయేరియా ...డెంగ్యూ ....వైరల్ ఫీవర్....మలేరియా....వంటి వాటితో తల్లి, తండ్రిని కోల్పోయిన
పిల్లలు ఆ గూడెం లో ఎవరికి పట్టని వారిగానే పెరుగుతున్నారు.... చిన్నా పెద్దా తెడా
లేకుండా విషజ్వరాలతో మరణిస్తునే ఉంటారిక్కడ ....వారిలో గర్బినిలు ...పిల్లలు ఎక్కువగా
ఉంటారు....తల్లులు చనిపోగా మిగిలిన పసిపాపలను బందునులు చేరదిసి పెంచుతున్న దృష్యాలు ప్రతి తాండాలో ఎక్కడో ఓ చోట దర్షనమిస్తుంటాయ్....
సాదారణంగా గర్బిణిలలో ఉండాల్సిన హిమోగ్లోబిన్
శాతం 14....కాని ఇక్కడి మహిళల్లో నాలుగు కి మించి ఉండదు... ఎదైనా జ్వరం వచ్చిన డెలివరి
సమయంలో ఇబ్బందులెదురైనా హాస్పెటల్ కి తిసుకెళ్లినా డాక్టర్లు ఎం చేయలేని
పరిస్థితి
...గిరిజన మృతుల్లో పిల్లలున్న వారిని వారి నానమ్మలు లేదా అమ్మమ్మలు
చేరదిసి పెంచుతున్నారు...ఈ పిల్లల వయసు 4 నుంచి 5 సంవత్సరాల మద్యే ఉంటుంది.. తాతలు
...నానమ్మల తరువాత ఎవరు పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చిన్న పిల్లలకే పెళ్లిల్లు చెసేస్తున్నారు..దింతో
బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయ్....ఈ పిల్లలు యుక్తవయసు రాకుండానే తల్లులు కావడం మళ్లి
విరు రక్తహినత తో బాదపడి చిన్న చిన్న రోగాలకే చనిపోతుండడం ఓ తంతుగా మారిపోతుంది... అనాదలవుతున్న వారిలో
ఎక్కువగా బాల్యవివాహాలు అయిన తల్లి తండ్రులు
పిల్లలే ఉంటున్నారు....ఇట్లా అనాదలవుతున్న పిల్లలకోసం జిల్లాలో కేవలం నాలుగు
మాత్రమే ఆశ్రమాలున్నాయి...రెండు ఓపెన్ షెల్టర్ లు ఉన్నాయ్...ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్చంద
సంస్థల లెక్కల ప్రకారం 1500 మంది అనాదలుండగా
వారిలో ఎక్కువ శాతం గిరిజనుల పిల్లలు ఉంటున్నారు....వారి తల్లి తండ్రులు విషజ్వరాలతో
మరణించిన వారే అధికం.....
...రక్తహీనతతో
ఏజెన్సీలో బాధపడుతున్నారు. అనేక మంది పోషకాహారం అందక విషజ్వరాల కారణంగా మృతిచెందుతున్నారు. మహిళల్లో బాలికలు, మహిళలు, గర్భిణులు,
బాలింతలున్నారు. జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత గిరిజనులను వెంటాడుతున్నా
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకొని మొక్కలు, జొన్నలు,
ఇతర అడవిలో దొరికే పండ్లను తిని జివిస్తుండేవారు...కాని ప్రపంచికరణ విధానాలు అడవుల్లోకి
వచ్చి పత్తి పంట పండిస్తున్న గిరిజనులు ఆ కోద్ది పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.
కూరగాయలు, పండ్లు, వంటి పౌష్టికాహారం తినేందుకు
వారికి ఆర్థిక స్థోమత లేదు. దీంతో వారిలో పౌష్టికాహారం లోపిస్తోంది. ప్రధానంగా గర్భిణులు, చిన్నపిల్లలు, బాలింతలు ఎక్కువగా
బాధపడుతున్నారు. దీనికి తోడు ఏజెన్సీ ప్రాంతంలో పారిశుధ్యం లోపించడంతో వ్యాధుల బారిన
పడి మృతిచెందుతున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, చిన్నపాటి జ్వరాలతోనే వారు మంచానపడుత్నున
సంఘటనలున్నాయి. వారిలో తగినంత రక్తం లేకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడంతోపాటు, వైద్యం
సకాలంలో అందక వెంటనే చనిపోతున్నారు.
...జిల్లాలో
ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌తోపాటు, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ డివిజన్లల్లోని
పలు మండలాల్లో వ్యాధులు తీవ్రంగా ఉన్నాయి. జ్వరాలతో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, డయేరియాతో
ప్రజలు చనిపోతున్నారు. వీరిలో త్వరగా చనిపోవడానికి ప్రధానంగా రక్తహీనతే కారణమని వైద్యులు
ధ్రువీకరిస్తున్నా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కేవలం ఏజెన్సీ ప్రాంతంలోని
ఉట్నూర్, జైనూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో జ్వరాలు తీవ్రంగా
ఉన్నాయి.గతంలో ఏజెన్సీ ప్రాంతంలోని 2లక్షల50వేల మంది రక్త నమూనాలను సేకరించి పరిక్షలు
నిర్వహించారు. వారిలో లక్షా 82 వేల మందిలో రక్తహీనత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఇందులో కేవలం 5 నుండి 6 గ్రాముల రక్తం ఉన్న 15 సంవత్సరాల పిల్లలు 10వేల మంది ఉన్నారు.
ఇక గర్భిణులు, బాలింతల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 4 నుండి 7 గ్రాముల రక్తం
14వేల మంది ఉన్నారు. దీనివల్ల గర్భిణులు, పిల్లలు, బాలింతలు రక్తహీనతతో వ్యాధులను తట్టుకునే
శక్తిలేక జ్వరం వచ్చిందంటే పరిస్థితి విషమించి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు
నొప్పుల సమయంలోనే మృతి చెందుతున్నారు.
వాయిస్.. వానా కాలం రాగానే
విషజ్వరాలు గిరిజన మరణాలు అంటు వాటిపైన తాత్కాలిక పథకాలు రుపోందించాయ్ గత ప్రభుత్వాలు....కాని
విటికి శాశ్వత పరిష్కారం దిశాగా ఆలోచించాలి...పౌష్టికాహార లోపం నివారించాలి....రోగాలు
వచ్చినప్పుడు సరైన వైధ్యం అందించాలి....అనాదలు గా మారిన పిల్లలను ప్రభుత్వం చేర దిసి
విరిని బాల్యవివాహాలనుండి కాపాడాలి....ఇట్లా సమస్య మూలల దిశగా పరిష్కార మార్గాలు కనుగోనాల్సిన
అవసరం ఎంతైనా ఉంది
Subscribe to:
Posts (Atom)