Sunday, August 30, 2015

రక్తహీనత...విషజ్వరాలు......అనాదలు......బాల్యవివాహాలు ...


----రక్త హీనత ...విషజ్వరాలతో  ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న అనాద పిల్లలు
-----విషజ్వరాలతో గిరిజన పిల్లలు అనాదాలుగా మారుతున్నారు...
-----అనాద పిల్లల్లో పెరుగుతున్న బాల్యవివాహాలు ఫలితంగా చిన్న తనంలోనే తల్లులవుతు మరణిస్తున్న బాలికలు
.ఆదిలాబాద్ ఎజెన్సి ప్రతిసంవత్సరం వర్షకాలంలో విషజ్వరాలతో వణికిపోతుంటుంది... ఎందరో గిరిపుత్రులు వ్యాదులు తట్టుకోలేక ప్రాణాలు వదులుతారు...ప్రభుత్వాలు  హడావిడి చెస్తాయ్...అధికారులు ఎదో చెసెసామని చెతులు దులుపుకుంటారు...కాని ప్రతి యెటా జరిగే.... ఈ మరణాల వెనక మరో కోణం దాగుంది... ఈ చావులతో వందలాది మంది గిరిజన పిల్లలు అనాదలవుతున్నారు....

..... విషజ్వరాలు వర్షాకాలం వచ్చి వందలాది మంది గిరిజనాన్ని పోట్టన పెట్టుకుంటాయ్... ఈ సీజనల్ వ్యాధులపై ప్రతియెడు చర్చ జరుగుతునే ఉంటుంది...ప్రభుత్వాలు అది చెస్తున్నాం ఇది చెస్తున్నం అంటునే ఉంటాయ్...అధికారులు ఆ టైమ్ లో నే హాడావిడి చెస్తారు... స్వచ్చంద సంస్థలు సైతం సేవా కార్యక్రమాలు చెపడతాయ్...కాని మరణాలు మాత్రం ఆగవు ...అలా జరుగుతునే దశాబ్దాలు గడిచిపోతున్నాయి...

....ఆదిలాబాద్ అడవుల్లో విషజ్వరాల కారణంగా గత 18 సంవత్సరాలలో 600 మంది గిరిజన పిల్లలు అనాదలయ్యారు.... డయేరియా ...డెంగ్యూ ....వైరల్ ఫీవర్....మలేరియా....వంటి వాటితో తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఆ గూడెం లో ఎవరికి పట్టని వారిగానే పెరుగుతున్నారు.... చిన్నా పెద్దా తెడా లేకుండా విషజ్వరాలతో మరణిస్తునే ఉంటారిక్కడ ....వారిలో గర్బినిలు ...పిల్లలు ఎక్కువగా ఉంటారు....తల్లులు చనిపోగా మిగిలిన పసిపాపలను బందునులు చేరదిసి పెంచుతున్న దృష్యాలు  ప్రతి తాండాలో ఎక్కడో ఓ చోట దర్షనమిస్తుంటాయ్.... సాదారణంగా గర్బిణిలలో ఉండాల్సిన  హిమోగ్లోబిన్ శాతం 14....కాని ఇక్కడి మహిళల్లో నాలుగు కి మించి ఉండదు... ఎదైనా జ్వరం వచ్చిన డెలివరి సమయంలో ఇబ్బందులెదురైనా  హాస్పెటల్ కి తిసుకెళ్లినా డాక్టర్లు ఎం చేయలేని పరిస్థితి

...గిరిజన మృతుల్లో  పిల్లలున్న వారిని వారి నానమ్మలు లేదా అమ్మమ్మలు చేరదిసి పెంచుతున్నారు...ఈ పిల్లల వయసు 4 నుంచి 5 సంవత్సరాల మద్యే ఉంటుంది.. తాతలు ...నానమ్మల తరువాత ఎవరు పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చిన్న పిల్లలకే పెళ్లిల్లు చెసేస్తున్నారు..దింతో బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయ్....ఈ పిల్లలు యుక్తవయసు రాకుండానే తల్లులు కావడం మళ్లి విరు రక్తహినత తో బాదపడి చిన్న చిన్న రోగాలకే చనిపోతుండడం ఓ తంతుగా మారిపోతుంది... అనాదలవుతున్న వారిలో ఎక్కువగా బాల్యవివాహాలు అయిన తల్లి తండ్రులు  పిల్లలే ఉంటున్నారు....ఇట్లా అనాదలవుతున్న పిల్లలకోసం జిల్లాలో కేవలం నాలుగు మాత్రమే ఆశ్రమాలున్నాయి...రెండు ఓపెన్ షెల్టర్ లు ఉన్నాయ్...ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్చంద సంస్థల లెక్కల ప్రకారం 1500 మంది  అనాదలుండగా వారిలో ఎక్కువ శాతం గిరిజనుల పిల్లలు ఉంటున్నారు....వారి తల్లి తండ్రులు విషజ్వరాలతో మరణించిన వారే అధికం.....

...రక్తహీనతతో ఏజెన్సీలో బాధపడుతున్నారు. అనేక మంది పోషకాహారం అందక విషజ్వరాల కారణంగా  మృతిచెందుతున్నారు. మహిళల్లో బాలికలు, మహిళలు, గర్భిణులు, బాలింతలున్నారు. జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత గిరిజనులను వెంటాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకొని మొక్కలు, జొన్నలు, ఇతర అడవిలో దొరికే పండ్లను తిని జివిస్తుండేవారు...కాని ప్రపంచికరణ విధానాలు అడవుల్లోకి వచ్చి పత్తి పంట పండిస్తున్న గిరిజనులు ఆ కోద్ది పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కూరగాయలు, పండ్లు,  వంటి పౌష్టికాహారం తినేందుకు వారికి ఆర్థిక స్థోమత లేదు. దీంతో వారిలో పౌష్టికాహారం లోపిస్తోంది.  ప్రధానంగా గర్భిణులు, చిన్నపిల్లలు, బాలింతలు ఎక్కువగా బాధపడుతున్నారు. దీనికి తోడు ఏజెన్సీ ప్రాంతంలో పారిశుధ్యం లోపించడంతో వ్యాధుల బారిన పడి మృతిచెందుతున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, చిన్నపాటి జ్వరాలతోనే వారు మంచానపడుత్నున సంఘటనలున్నాయి. వారిలో తగినంత రక్తం లేకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడంతోపాటు, వైద్యం సకాలంలో అందక వెంటనే చనిపోతున్నారు.

...జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌తోపాటు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ డివిజన్లల్లోని పలు మండలాల్లో వ్యాధులు తీవ్రంగా ఉన్నాయి. జ్వరాలతో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, డయేరియాతో ప్రజలు చనిపోతున్నారు. వీరిలో త్వరగా చనిపోవడానికి ప్రధానంగా రక్తహీనతే కారణమని వైద్యులు ధ్రువీకరిస్తున్నా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కేవలం ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌, జైనూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, సిర్పూర్‌(యు) మండలాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి.గతంలో ఏజెన్సీ ప్రాంతంలోని 2లక్షల50వేల మంది రక్త నమూనాలను సేకరించి పరిక్షలు నిర్వహించారు. వారిలో లక్షా 82 వేల మందిలో రక్తహీనత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇందులో కేవలం 5 నుండి 6 గ్రాముల రక్తం ఉన్న 15 సంవత్సరాల పిల్లలు 10వేల మంది ఉన్నారు. ఇక గర్భిణులు, బాలింతల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 4 నుండి 7 గ్రాముల రక్తం 14వేల మంది ఉన్నారు. దీనివల్ల గర్భిణులు, పిల్లలు, బాలింతలు రక్తహీనతతో వ్యాధులను తట్టుకునే శక్తిలేక జ్వరం వచ్చిందంటే పరిస్థితి విషమించి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు నొప్పుల సమయంలోనే మృతి చెందుతున్నారు.
వాయిస్.. వానా కాలం రాగానే విషజ్వరాలు గిరిజన మరణాలు అంటు వాటిపైన తాత్కాలిక పథకాలు రుపోందించాయ్ గత ప్రభుత్వాలు....కాని విటికి శాశ్వత పరిష్కారం దిశాగా ఆలోచించాలి...పౌష్టికాహార లోపం నివారించాలి....రోగాలు వచ్చినప్పుడు సరైన వైధ్యం అందించాలి....అనాదలు గా మారిన పిల్లలను ప్రభుత్వం చేర దిసి విరిని బాల్యవివాహాలనుండి కాపాడాలి....ఇట్లా సమస్య మూలల దిశగా పరిష్కార మార్గాలు కనుగోనాల్సిన అవసరం ఎంతైనా ఉంది


No comments:

Post a Comment