Showing posts with label TRS. Show all posts
Showing posts with label TRS. Show all posts

Thursday, July 26, 2012

కాంగ్రెస్ పార్టికో టీవి చానల్ కావాలంట ..........



ప్రభుత్వ పథకాలను పటిష్టపరుస్తూ వాటిని కాంగ్రెస్‌ పార్టీ పథకాలుగా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటె మాకో టీవి
పేపర్ కావలని ఆ పార్టినేతలు అబిప్రాయపడుతున్నారు....అన్ని పార్టిలకూ తలా ఒకటి విలైతే రెండు చానల్లు, పెపర్లు
మెయింటేన్ చెస్తుంటె మనం మాత్రం వెనకబడిపోయమని ఫిలైపోతున్నారు. ఇ లెక్కలో TDP ముందుంటుంది.

రాష్ట్రంలో ప్రధాన పెపర్లు, రెండు ముడు చానల్ లు ఆ పార్టి సోంతం ఇది జగమెరిగిన సత్యం. ఇవే కాకుండా ఎపి నేం1
చానల్ కూడా బాబు గారికి వ్యతిరేఖంగా పల్లేత్తుమాట అనదు... మిడియా మెనేజ్మెంట్లో బాబు గారిదే పై చెయి..
తమకంటూ ఉన్న ఓ పెపర్ తో బండిలాక్కోస్తున్న కమ్యునిస్టులు సైతం ప్రజలకు చెరువవ్వాలంటే మాకో చానల్
కావలని నిర్ణయించేసుకున్నారు త్వరలో అది రాబోతుంది కూడా...... TV10 అనే పేరు ప్రచారంలో ఉంది.
ఇక TRS సంగతి సరేసరి తెలంగాణ కోసం చానల్ అంటూ T News ను విజయవంతంగా నడుపుకుంటుంది. ఇలా ఎవరికి
వారు తమ గళాన్ని వినిపించుకుంటున్నారు. అటూ BJP సైతం చానల్ పెట్టాలా అని ఆలోచించుకుంటూ కాలం
గడిపేస్తుంది .

ఇక మిగిలింది కాంగ్రెస్ గతంలో వారికొసమే అంటూ ఊరించి, ఊదరగోట్టిన సాక్షి చివరికి ఆ కాంగ్రస్

కంట్లోనలుసైంది,పక్కలో బల్లెంలా తయారైంది....అందుకే మాకూ ఓ చానల్ కావాలనుకుంటున్నారు .....కాని కాంగ్రెస్

చానల్ పెడితే దాన్ని నడిపే వారెవరు ....ఇపుడున్న గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ తరపున అందుకు నడుం

కట్టేదెవరు.ఆ తర్వాత నిలబడేదెవరు? అంతర్గత ప్రజాస్వామ్యమే ఆయివుగా బతికే పార్టికి ఇలా ఓ సంస్థను నడిపే

సత్తా ఉంటుందనేది ప్రశ్నార్ధకమే..
పెపర్లు, చానల్లు పెడితే ఎన్నికల్లో గెలిచేస్తారా ,వాటిల్లో ప్రచారం చెస్తే ప్రజలు నమ్మేస్తారా అలాగైతె ఇన్ని పెపర్లు ,

టీవిలను వెనకేసుకున్న బాబు గారిని ప్రజలెందుకు నమ్మడంలేదు.ప్రసార సాదనాలున్నంత మాత్రాన అంతా

అయిపోయితుందా.