Wednesday, November 26, 2014

చలి

ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో చలి ఉగ్రరూపం దాలుస్తున్నా..అధికార యంత్రంగాం మాత్రం మెల్కోవడం లేదు.. 4 డిగ్రిల చలి ఉందని ప్రకటిస్తునే గిరిజన ఆశ్రమ పాఠశాల విధ్యార్థులకు రగ్గులు పంచాలన్న మాటే ఎత్తడం లేదు.. కిటికిలు , వెంటిలేటర్లు సరిగా లేక ...వాటినుండి వచ్చే చలిగాలులతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

వాయిస్...  జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు 50 ఉండగా వాటిల్లో 3,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రారంభంలో పంపిణీ చేయాల్సిన దుప్పట్లను ఇప్పటికీ ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వకపోవడం వారి దుర్భరస్థితికి అద్దంపడుతుంది. ఓక్కో విధ్యార్థికి రెండు దుప్పట్లు ఇవ్వాల్సి ఉన్నా.. కేవలం ఒక్క సన్నని చద్దరితో  సరిపెట్టారు. చలికాలంలో ఇవ్వాల్సిన రగ్గుల వూసేలేదు. ఐటీడీఏ పరిధిలో 123 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో 37వేల మంది విద్యార్థులున్నారు. అందరికీ దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవి నాణ్యంగా లేకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నాయి. వసతి గృహాల్లోని కిటికీలు లేకపోవడంతో దుప్పట్లను కిటికీలకు అడ్డుగా పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చలిని తట్టుకోవడానికి 37వేల మందికి ఉలెన్‌ రగ్గులు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 11వేల మందికి మాత్రమే సరిపడా రావడంతో మిగిలిన విద్యార్థులకు అవిలేక అవస్థలు పడుతున్నారు.
వాయిస్.. గత ప్రభుత్వ హయాం నుంచే విద్యార్థులకు దుప్పట్లు సరఫరా చేయడంలేదు. దీంతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులే సొంతగా దుప్పట్లు కొనుగోలు చేసి సరఫరా చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పాలనాధికారి, ఇతర అధికారులు వసతి గృహాలను సందర్శించి అక్కడే రాత్రి నిద్రపోయేవాళ్లు. అప్పట్లో అక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి నిధులు వెచ్చించి భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వసతి గృహాలను సందర్శించి రాత్రి అక్కడే పడుకుంటే విద్యార్థుల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో అటవిశాఖా మంత్రి జోగు రామన్న ఓ హస్టల్లో నిద్ర చేసాడు కుడా..
 వాయిస్... పాలనాయంత్రాంగం కొలువు దీరిన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణంలో కూడా విద్యార్థులకు దుప్పట్లను అందించలేదు. పట్టణంలోని కోలాం వసతి గృహాన్ని మంత్రి, కలెక్టర్ పరిశీలించగా అధికారులకు ఏమాత్రం అలసత్వం స్పష్టమైంది. చలితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపైన కూడా దయ చూపలేదు. చలికాలంలోనూ దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు ఇంటినుంచే బొంతలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొలాం ఆశ్రమ పాఠశాలలో 562మంది విద్యార్థులుండగా 100మందికి మాత్రమే దుప్పట్ల పంపిణీ చేశారు. మిగిలి వాళ్లంతా చలికి గజగజ వణికిపోతున్నారు.బేల మండలంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో 265మంది విద్యార్థులుండగా.. 150 దుప్పట్లు మాత్రమే సరఫరా చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక్కో దుప్పటి చొప్పున పంపిణీ చేశారు. ఒక్క దుప్పట్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వాయిస్... బోథ్‌ నియోజక వర్గం బజార్హత్నూర్‌లో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో దుప్పట్లను సరఫరా చేయకపోవడంతో చలికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేరడిగొండలోని కొరటికల్‌ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఒక్కరికీ దుప్పట్లు అందించలేదు. కుంటాలలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాల, తలమడుగులో ఉమ్రి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాంసి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులే వసతికి ఉపయోగించాల్సిన దుస్థితి నెలకొనడంతో చలికి ఇబ్బందులుపడుతున్నారు. కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలికి వణికిపోతున్నారు.
వాయిస్... ముథోల్‌ నియోజక వర్గంలోని బాసరలోని బీసీ, కుభీర్‌, తానూరులలోని ఎస్సీ వసతి గృహాలకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన దుప్పట్ల సరఫరా చేయకపోవడంతో చలికి విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్‌పట్టణంలోని బీసీ వసతి గృహానికి తలుపులు, కిటికీలు లేవు. అందరికీ దుప్పట్ల పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా.. సగం మందికే ఇచ్చారని పిల్లలు చెబుతున్నారు.తిర్యాణి మండలంలోని మంగి ఆశ్రమ పాఠశాలలో 204మంది విద్యార్థులుండగా.. చలికి తట్టుకోలేక దాదాపు 170 మంది విద్యార్థులు బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోంపెల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వాయిస్... ఉట్నూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 600మంది విద్యార్థులుండగా వసతి గృహానికి కిటికీల్లేవు. సరిపడ దుప్పట్లు పంపిణీ చేయలేదు. సరఫరా చేసిన దుప్పట్లు కూడా నాసిరకంగా ఉండటంతో చలికి తట్టుకోలేకపోతున్నాయి. ఎందా ఆశ్రమ పాఠశాలలో 323మంది విద్యార్థులు చదువుతున్నా.. కిటికీలు పగిలిపోవడంతో చలి ఎక్కువగా వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగాం గిరిజన ఆశ్రమ పాఠశాల అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల ఉలెన్‌ రగ్గులు సరఫరా చేేయకపోవడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. బీసీ వసతి గృహంలో దుప్పట్లు సరపడా పంపిణీ చేయలేదు. జన్నారం మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కిటికీలు సక్రమంగా లేకపోవడంతో చలి ఇబ్బందులు తప్పడంలేదు. ఎస్సీ బాలుర వసతి గృహం మూతపడ్డ పాఠశాలలో కొనసాగిస్తుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులిక్కడ చలికి తట్టుకోలేక ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు..
వాయిస్... బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి ఎస్సీ వసతి గృహానికి నాసిరకమైన దుప్పట్లు సరఫరా చేయడంతో చలికి తట్టుకోలేకపోతున్నారు. గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని సింగరేణికి చెందిన భవనంలో నిర్వహిస్తున్నారు. రక్షణ లేకుండా పోయింది. తాండూరులో ఎస్సీ బాలుర వసతి గృహానికి కిటికీలు లేక చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. కాసిపేటలోని రేగులగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలోనూ కొందరికే దుప్పట్లు పంపిణీ చేశారు. అవి కూడా నాణ్యత లేకపోవడంతో చలిని ఆపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Monday, November 24, 2014

సమాచార హక్కు చట్టం ‍‍‍‍

సమాచార హక్కు చట్టం ‍‍‍‍2005

అధ్యాయం - 1 


ప్రాథమిక అంశాలు 

1. (1) సమాచార హక్కు చట్టం, 2005గా దీన్ని వ్యవహరించవచ్చు


(2) జమ్ము, కాశ్మీర్ మినహా మిగిలిన దేశమంతటికీ ఈ చట్టం వర్తిస్తుంది (సెక్షన్లు)


(3) ఈ చట్టానికి చట్ట రూపం వచ్చిన 120 వ రోజునుంచి మిగతా నిబంధనలు అమల్లోకి వస్తాయి.


2. సందర్భానుసారం చట్టంలో మార్పులు రాకుంటే తప్ప,
(ఎ) సముచిత ప్రభుత్వం అంటే? 


(1) కేంద్రం, కేంద్రపాలిత ప్రభుత్వాలు స్థాపించిన, నెలకొ్ల్పిన, నియంత్రణలో ఉన్న, సదరు ప్రభుత్వాల నుంచి ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానోనిధులు అందుకుంటున్న అధికార యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వం


(2) అలాగే రాష్ట్రప్రభుత్వ అధికార యంత్రాంగాలు, రాష్ట్రప్రభుత్వం


(బి) సెక్షన్ 12 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది
(సి) సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారి, సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర సహాయ సమాచార అధికారులునియమితులవుతారు.
(డి) సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (3) కింద ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు నియమితులవుతారు.
(ఇ) ‘సమర్ధాధికారి’ అంటే?


(1) లోక్ సభ, రాష్ట్రాలు, రాష్ట్ర శాసనసభ, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు సంబంధించిన స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్ర విధాన మండళ్లకుసంబంధిత ఛైర్మన్లు
(2) సుప్రీంకోర్టుకు భారత ప్రధాన న్యాయమూర్తి
(3) హైకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తి,
(4) రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయిన ఇతర యంత్రాంగాలకు రాష్ట్రపతి లేక గవర్నర్
(5) రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్


(ఎఫ్) ‘సమాచారం అంటే’ ?
రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్య్కులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్,కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడళ్ళు, డేటా సహా ఎలక్ట్రానిక్స్ రూపంతో పాటు ఏ రూపంలో అయినా ఉన్న సమాచారంఅమల్లో ఉన్న మరో చట్ట ప్రకారం ఏ ప్రైవేటు సంస్థ నుంచి అయిన ప్రభుత్వ యంత్రాంగం రాబట్టగల సమాచారం.


(జి) ‘నిర్ణీత’ అనగా ఈ చట్టం నియమాల ప్రకారం ప్రభుత్వం గానీ, సమర్దాధికారి గానీ నిర్ణయించిన విధంగా


(హెచ్) ‘అధికార యంత్రాంగం’ అంటే?


‘ఎ) రాజ్యాంగం కింద లేదా రాజ్యాంగం ద్వారా
బి) పార్లమెంట్ రూపొందించిన ఏ చట్ట ప్రకారమైనా
సి) రాష్ట్రశాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం
డి) సముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లేదా ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటయిన ప్రభుత్వ స్వపరిపాలన సంస్థలు.


(1) సముచిత ప్రభుత్వ సొంత, నియంత్రణలో ఉన్న ఎక్కువ నిధులు
(2) సముచిత ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా/పరోక్షంగా నిధులు పొందుతున్న ప్రభుత్వేతర సంస్థలు.


(ఐ) ‘రికార్డు అంటే? 


(ఎ) ఏదైనా పత్రం, రాతప్రతి, ఫైలు
(బి) ఏదైనా మైక్రో ఫిల్ము, మైక్రోఫిష్ పత్రం
(సి) మైక్రోఫిల్ముల నుంచి తీసిన చిత్రాలు
(డి) కంప్యూటర్ మరేదైనా పరికరం నుంచి వచ్చే సమాచారం


(జె) ‘సమాచార హక్కు’ అంటే ఏ అధికార యంత్రాంగం నియంత్రణలో ఉన్న సమాచారాన్ని అయినా ఈ చట్ట ప్రకారం పొందగలగడం.

(1) పనులనూ, పత్రాలనూ, రికార్డులను తనిఖీ చేసే హక్కు
(2) రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని రాసుకోవడం, వాటి నకళ్లు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం
(3) సామగ్రికి సంబంధించిన సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం
(4) డిస్కులు, ప్లాపీలు, వీడియో కాసెట్లు రూపంలో, మరో విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం, అలాంటిసమాచారం కంప్యూటర్లోగానీ, మరో పరికరంలో గానీ నిక్షిప్తమై ఉంటే ప్రింట్లు తీసుకోవడం.


కె) సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది.


(ఎల్) సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (3) ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు నియమితులవుతారు.


(ఎమ్) సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద రాష్ట్ర పౌర సమాచార అధికారి, సబ్ సెక్షన్ (2) ప్రకారం రాష్ట్ర సహాయ సమాచార అధికారులునియమితులవుతారు.


(ఎన్) మూడో పక్షం అంటే అధికార యంత్రాంగం, సమాచారం అడిగే పౌరుడు కాక ఇతర వ్యక్తులు.


అధ్యాయం - 2 

సమాచార హక్కు, అధికార యంత్రాంగాల విధులు 


3. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది.
4. (1) ప్రతి అధికార యంత్రాంగమూ
(ఎ) తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలు, పద సూచికలతో హక్కు అమలయ్యేందుకు వీలుగా నిర్వహించాలి. అన్ని రికార్డుల్లోనుంచి కంప్యూటర్లో భద్రపరచదగిన ప్రతి సమాచారాన్ని వనరుల లభ్యతపై ఆదారపడి, సహేతుక కాలపరిమితి లోపు దేశవ్యాప్త నెట్వర్క్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.
(బి) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా కింది వాటిని ప్రచురించాలి.
(1) సంబంధిత అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు
(2) దాని అధికారులు, ఉద్యోగులుకున్న అధికారులు, విధులు
(3) పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్పులు, నిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు,
(4) విధుల నిర్వహణలో పాటించే పద్ధతులు
(5) దాని దగ్గరలో నియంత్రణలో ఉన్న, లేదా కార్యనిర్వహణలో దాని ఉద్యోగులు పాటించే నియమ నిబంధనలు, ఆదేశాలు,మాన్యువల్, రికార్డులూ,
(6) దాని దగ్గర / నియంత్రణలో ఉన్న పత్రాల రకరకాలకు సంబంధించిన ప్రకటన.
(7) విధానాల రూపకల్నన/వాటి అమలుకు, పౌరులతో సంప్రదింపులు జరిపేందుకు/వారి ప్రాతినిధ్యం స్వీకరించేందుకు ఏదైనా పద్దతిఉంటే...సంబంధిత వివరాలు
(8) దానిలో భాగంగా గానీ, సలహాలు ఇచ్చేందుకు గానీ ఇద్దరు, అంతకుమించి సభ్యులతో బోర్డులు, కౌన్సిళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటైఉంటే వాటి వివరాల ప్రకటన, వీటన్నింటి సమావేశాలకు ప్రజలను అనుమతిస్తున్నదీ లేనిదీ ఆ సమావేశాల వివరాలు ప్రజలకుఅందుబాటులో ఉన్నాయో లేదో..
(9) దాని అధికారులు, ఉద్యోగుల సమాచార సంపుటం(పేరు, హోదా)
(10) దాని అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ జితం, నిబంధనల ప్రకారం ఉన్న పరిహార చెల్లింపు వ్యవస్థ వివరాలు
(11) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపుల వివరాలు, విడిగా పేర్కొంటూ, దాని కింద ఉన్న అన్ని ఏజెన్సీలకుకేటాయించిన బడ్జెట్ వివరాలు
(12) రాయితీ పథకాల అమలు తీరు, వాటికి కేటాయించిన నిధులు, ఆ పథకాల లబ్దిదారుల వివరాలు
(13) మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు, అనుమతులు, పొందిన వారి వివరాలు.


(14) అందుబాటులో ఉన్న/నియంత్రణలో ఉన్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్స్ రూపంలో ఉంటే...ఆ వివరాలు పొందేందుకు ప్రజలకున్నసదుపాయాల వివరాలు.


(15) ప్రజల కోసం ఏదైనా గ్రంథాలయ పనివేళలు, సమాచారం పొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు


(16) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు


(17) నిర్ణయించిన తీరుగా ఇతర సమాచారం ఏదైనా, ఆ తర్వాత ఏడాదికోసారి ఈ సమాచారం అంతటినీ సరిచేసి కొత్తగా ఇవ్వడం


(సి) ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు గానీ, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు గానీ వాటికిసంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.


(డి) పాలనాపరమైన/అర్థన్యాయ (క్వాసీ జ్యూడీషియల్) నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వాటి కారణాలను వివరించాలి.


(2) సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (బి) నిర్ధేశిస్తున్న విధంగా, సమాచారాన్ని పొందడానికి వీలైనంత తక్కువగా ప్రజలు ఈ చట్టాన్నిఆశ్రయించకుండా చూడటానికి...వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఎవరూ కోరకుండానే అధికార యంత్రాంగం ఇంటర్నెట్తో సహా వివిధప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అందించేందుకు కృషి చేయాలి.


(3) సబ్ సెక్షన్ (1) నిర్ధేశిస్తున్న విధంగా వ్యవహరించేటప్పుడు, ప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండే రూపంలోవిస్తృతంగా వ్యాప్తి చేయాలి.
(4) అన్ని రకాల సమాచారాలను వ్యాప్తి చేసేటప్పుడు...ఉచితంగా లేదా ఎంత చౌకగా ఆ పని చేయగలం, స్థానిక భాష వ్యాప్తికి స్థానికంగాబాగా ఉపకరించే పద్ధతులు, సమాచారం వీలైనంతలో ఎలక్ట్రానిక్ రూపంలో కేంద్ర పౌర సమాచార అధికారికి/రాష్ట్ర పౌర సమాచారఅధికారికి అందుబాటులో ఉండటం/ప్రసార మాధ్యమాల వ్యయం/ ప్రచురణ వ్యయం అందుబాటులో ఉండటం వంటి విషయాలనుపరిగణలోకి తీసుకోవాలి.


వివరణ : సబ్ సెక్షన్లు (3), (4) కు సంబంధించి వ్యాప్తి చేయడం అంటే నోటీసు బోర్డులు, వార్తా పత్రికలు, బహిరంగ ప్రకటనలు, మీడియాప్రసారాలు, ఇంటర్నెట్/అధికార యంత్రాంగం కార్యాలయాలను తనిఖీ చేయడం సహా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని ప్రజలకుచేరవేయడం.


(5) 1. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోగా ప్రతి అధికార యంత్రాంగం దరఖాస్తుదారులకు సమాచారం అందజేయడానికి అన్నిపాలనా యూనిట్లు/ కార్యాలయాల్లో అవసరమైన సంఖ్యలో కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారులను నియమించాలి.


2. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోగా సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలకు విరుద్ధం కాని రీతిలో ప్రతి అధికారయంత్రాంగమూ ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో/జిల్లా విభాగాల స్థాయిలో సమాచారం కోరుతూ వచ్చే దరఖాస్తులు/అప్పీళ్లనుస్వీకరించడానికి ఒకరిని కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారిగా నియమించాలి. స్వీకరించిన వాటిని వారు వెంటనే కేంద్ర/ రాష్ట్రపౌర సమాచార అధికారికి/సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దిష్టపరిచిన సీనియర్ అధికారికి/ కేంద్రసమాచార కమిషన్ కు /రాష్ర్టసమాచార కమిషన్ కు పంపాలి. సమాచారం ఇచ్చేందుకు సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్ణయించిన కాలపరిమితికి అయిదురోజులు కలపాలి.


3. సమాచారాన్ని కోరుతూ వచ్చిన ప్రతి అభ్యర్ధననూ ప్రతి కేంద్ర/రాష్ట్ర పౌర సహకారాన్నైనా కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారికోరవచ్చు.


(6) 1. ఈ చట్టం కింద సమాచారాన్ని కోరదల్చుకున్న వారు ఆంగ్లం/హిందీ/స్థానిక అధికార భాషలో రాతపూర్వకంగా/ ఎలక్ట్రానిక్రూపంలో నిర్ణీత రుసుంతోపాటు తమ అభ్యర్ధనను కింద తెలిపిన వారికి పంపాలి.


(ఎ) కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారికి / సంబంధిత అధికార యంత్రాంగానికి


(బి) తాము కోరుకున్న సమాచారం వివరాలను రాతపూర్వకంగా కేంద్ర/రాష్ట్ర సహాయ పౌర సమాచార అధికారకి పౌరుడు ఇవ్వలేనిపక్షంలో మౌఖికంగా వారు చేసిన అభ్యర్ధనను రాసేందుకు యుక్తమైన సాయాన్నంతా కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి అందించాలి.


2. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారులెవరైనా అందుకు గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదు. తనకు కబురుచేసేందుకు వీలుగా చిరునామా తప్ప మరే ఇతర వ్యక్తిగతమైన వివరాలను కూడా సమర్పించనక్కర్లేదు.
3. ఒక సమాచారం కోసం అధికార యంత్రాంగానికి ఒక దరఖాస్తు అందినప్పుడు

(1) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడు, లేక


(2) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం పనులకు ఎక్కువగా సంబంధించినదైనప్పుడు, దరఖాస్తు అందుకున్న అధికారయంత్రాంగం ఆ దరఖాస్తును గానీ/ రెండవ అధికార యంత్రాంగానికి సంబంధించిన భాగాన్ని గానీ వారికి పంపి...అలా పంపినవిషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఆ దరఖాస్తును పంపడం వీలైనంత తొందరగా జరగాలి. అది దరఖాస్తు అందుకున్ననాటి నుంచి అయిదు రోజులలో పూర్తవ్వాలి.


(7) 1 సెక్షన్ 6 కింద సమాచారం కోరుతూ దరఖాస్తు అందినప్పుడు సెక్షన్ 5 (2), సెక్షన్ 6 (3) ప్రకారం వీలైనంత తొందరగా, దరఖాస్తుఅందిన 30 రోజుల్లోగా కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారి సమాచారం అందించాలి. లేదా సెక్షన్ 8,9 నిర్దేశిస్తున్న కారణాల వల్లదరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ‘వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు’సంబంధించినదయితే దరఖాస్తు అందిన 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి.


2. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాలపరిమితిలోపు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి సమాచార అధికారి సమాచారం కోరుతూవచ్చిన దరఖాస్తుపై తన నిర్ణయం చేయకపోతే..ఆ దరఖాస్తును వారు తిరస్కరించినట్లే.


3. సమాచారాన్ని అందించడానికి అయ్యే ఖర్చుకు మరికొంత రుసుం వసూలు చేయాలని కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారినిర్ణయిస్తే...ఆ రుసుంను చెల్లించాలని చెబుతూ దరఖాస్తుదారునికి కబురు చేయాలి. అందులో.....


(ఎ) సమాచారం అందించేందుకు చెల్లించాల్సిన మరికొంత రుసుం వివరాలుండాలి. సబ్ సెక్షన్ (1) కింద మరికొంత రుసుం లెక్కింపువిధానం చెప్పి ఆ మొత్తాన్ని జమ చేయాలని కోరాలి. కబురు పంపిన రోజు నుంచి రుసుం జమ అయ్యేవరకు పట్టిన వ్యవధిని సబ్ సెక్షన్(1)లో పేర్కొన్న 30 రోజుల కాలపరిమితి నుంచి మినహాయించాలి.


(బి) రుసుంకు సంబంధించిన నిర్ణయం, సమాచారం అందించే పద్ధతి, పునఃపరిశీలనను కోరేందుకు దరఖాస్తుదారుకు ఉన్న హక్కు,దాని కాలపరిమితి, అందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎవరి ముందు అప్పీలు చేయాలో తెలియజేయాలి.


4. ఈ చట్టం కింద ఒక రికార్డును/అందులో భాగాన్ని అంగవైకల్యం కలిగిన దరఖాస్తుదారుడికి చూపించాల్సివచ్చినపుడు..ఆ వ్యక్తి సమాచారాన్ని పొందేవిధంగా తనిఖీ చేసుకునేందుకు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచారఅధికారి తగిన సాయం చేయాలి. 


5. సమాచారాన్ని అచ్చు రూపంలోనో, ఎలక్ట్రానిక్ రూపంలోనో అందించాల్సినప్పుడు దానికి నిర్ణయించిన రుసుంను సబ్ సెక్షన్లు (1), (5) ప్రకారం సహేతకంగా ఉండాలి. సముచిత ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి నుంచి ఎలాంటిరుసుం వసూలు చేయకూడదు.


6. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాల పరిమితిలోపు సమాచారం ఇవ్వడంలో అధికార యంత్రాంగం విఫలమైతే సబ్ సెక్షన్ (5)తోనిమిత్తం లేకుండా ఆ సమాచారాన్ని ఉచితంగా అందించాలి.


7. సబ్ సెక్షన్ (1) కింద కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 11 కింద మూడో పక్షంసమర్పించిన వాదనను పరిగణనలోకి తీసుకోవాలి


8. సబ్ సెక్షన్ (1) కింద ఒక దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో దరఖాస్తుదారునకు ఈ కింది విషయాలను కేంద్ర/రాష్ర్ట పౌర సమాచారఅధికారి తెలియజేయాలి.


(1) దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు
(2) తిరస్కరణపై అప్పీలు చేసుకోవడానికి ఉన్న కాలపరిమితి.
(3) అప్పీలు విచారించే అధికారి వివరాలు


9. అధికార యంత్రాంగం వనరులు చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చయ్యే సందర్భంలోనూ, ఆ రికార్డు భద్రత, రక్షణ ప్రమాదంలోపడుతుందన్న సందర్భంలో తప్ప దరఖాస్తుదారు అడిగిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి.


8. (1) ఈ చట్టంతో సంబంధం లేకుండా ఈ కింది సమాచారాలను పౌరులకు అందించనక్కర్లేదు.
(ఎ) భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రభావం చూపించే సమాచారం, దేశ భద్రత, వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థికప్రయోజనాలపై, విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారం, ఏదైనా నేరాన్ని ప్రేరేపించే సమాచారం.
(బి) ఏదైనా న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఏదైనా సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని ఆదేశించే ఉంటే అలాంటి సమాచారం. సమాచారప్రకటన కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందనుకుంటే అలాంటి సమాచారం
(సి) పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ హక్కులను ఉల్లంఘించే రీతిలో ఉన్న సమాచారం.
(డి) వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేథోసంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలోమూడో పక్షానికి హాని కలిగే సందర్భంలో ఆ సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాలను వెల్లడిచేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో దానిని కూడా వెల్లడించవచ్చు.
(ఇ) విశ్వాసబద్ధమైన సంబంధం రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం, విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహాసమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో దానిని వెల్లడించవచ్చు.


(ఎఫ్) ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాసబద్ధంగా అందిన సమాచారం.


(జి) ఏ వ్యక్తి ప్రాణానికైనా /భౌతిక భద్రతకైనా హాని కలిగించే సమాచారం. చట్టాల అమలుకు, భద్రతాప్రయోజనాలను ఉద్దేశించి గోప్యంగా సమాచారం అందించిన/సాయపడిన వారి గుర్తిపునకు దారితీసేసమాచారం. 


(హెచ్) దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్థులను పట్టుకునేందుకూ, ప్రాసిక్యూట్ చేసేందుకూ అవరోధాలు కల్పించే సమాచారం.
(ఐ) మంత్రిమండలి, కార్యదర్శులు, ఇతర అధికారుల సమాలోచనల సహా కేబినెట్ పత్రాలు, మంత్రిమండలి తీసుకున్ననిర్ణయాలను,అందుకు గల కారణాలను, ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని ఆ విషయం పూర్తిగా ముగిసిన తర్వాతే వెల్లడి చేయాలి.ఈ సెక్షన్ లో నిర్ధేశించిన మినహాయింపుల కిందకు వచ్చే సమాచారాన్ని మాత్రం వెల్లడి చేయరాదు.
(జె) ప్రజా కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారం. వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడానికిఅవకాశం కల్పించే సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాల వెల్లడి సబబేనని కేంద్ర, రాష్ట్ర పౌర సమాచారఅధికారి/అప్పిలేట్ అధికారి భావిస్తే ఈ సమాచారాలను కూడా వెల్లడించవచ్చు. పార్లమెంటుకు/రాష్ట్ర శాసనసభకు అందించదగిన ఏసమాచారాన్ని అయినా ఏ వ్యక్తికైనా ఇవ్వవచ్చు.

(2) అధికార రహస్యాల చట్టం, 1923తో/సబ్ సెక్షన్ (1) ప్రకారం ఇవ్వదగిన మినహాయింపులతో ఎలాంటి సంబంధం లేకుండా, రక్షితప్రయోజనాలకు కలిగే హాని కన్నా..ప్రజా ప్రయోజనాలకు కలిగే మేలే ఎక్కువని అధికార యంత్రాంగం భావిస్తే ఆ సమాచారాన్నితెలియజేయవచ్చు.


(3) సబ్ సెక్షన్ (1) లోని క్లాజులు (ఎ), (సి), (ఐ) లోని నిబంధనలకు సంబంధించి సెక్షన్ 6 కింద సమాచారం కోసం దరఖాస్తు అందినరోజుకు 20 ఏళ్ల ముందు సంబంధించిన సమాచారాన్ని అయినా దరఖాస్తుదారునికి ఇవ్వవచ్చు. ఏ రోజు నుంచి ఆ 20 ఏళ్ల గడువునులెక్కించాలన్న ప్రశ్న తలెత్తినపుడు కేంద్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అవుతుంది. ఈ చట్టంలో నిర్దేశించిన అప్పీళ్ల అవకాశం దీనికికూడా వర్తిస్తుంది.
(9) సమాచారం అందించడం వల్ల రాజ్యానికి చెందింది కాకుండా ఒక వ్యక్తికి చెందిన కాపీరైట్ ఉల్లంఘన జరిగే పక్షంలో అలాంటిసమాచారం కోసం వచ్చిన దరఖాస్తును సెక్షన్-8లోని నిబంధనలకు భంగం కలగకుండానే కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారితిరస్కరించవచ్చు.


(10) (1) వెల్లడి చేయడానికి మినహాయింపు ఉన్న సమాచారం అనే కారణంతో ఒక దరఖాస్తును తిరస్కరించినపుడు ఈ చట్టంలోనినిబంధనలతో సంబంధం లేకుండా, మినహాయింపు పొందిన సమాచారం కాక ఆ రికార్డులో ఉన్న ఇతర సమాచారాన్ని విడదీసిఇవ్వగలిగే అవకాశం ఉంటే ఇవ్వాలి.


(2) సబ్ సెక్షన్ (1) కింద రికార్డులోని కొద్ది భాగాన్నే వెల్లడి చేయాలని నిర్ణయించినపుడు దరఖాస్తుదారుకి ఈ కింది విషయాలువివరిస్తూ కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి నోటీసు ఇవ్వాలి.


(ఎ) కోరిన రికార్డల్లో వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని విడదీసి మిగతా భాగాన్ని మాత్రమే ఇస్తున్న విషయం.
(బి) ఆ నిర్ణయానికి గల కారణాలు, నిర్ణయానికి ముందు పరిశీలనలో వెల్లడి అయిన అంశాలు, వాటికి సంబంధించిన విషయాలు.
(సి) నిర్ణయం తీసుకున్న వ్యక్తి పేరు, హోదా
(డి) ఆ వ్యక్తి నిర్ణయించిన రుసుం వివరాలు, దరఖాస్తుదారు చెల్లించాల్సిన రుసుం వివరాలు.
(ఇ) నిర్ణయాన్ని పునఃపరిశీలించమని కోరేందుకు దరఖాస్తుదారుకి ఉన్న హక్కులు. వసూలు చేసే రుసుం వివరాలు, పునఃపరిశీలనకోరే మార్గాలు, పద్ధతి, అందుకు గల కాలపరిమితి. సెక్షన్ (1) కింద నియమితులైన సీనియర్ అధికారి/కేంద్ర/రాష్ట్ర సమాచార వివరాలు,ఇతర వివరాలు.


(11) (1) తనకు చెందిన/ అందించిన సమాచారం గోప్యమని మూడో పక్షం భావిస్తున్నప్పుడు, ఈ చట్టం కింద అలాంటి సమాచారాన్నివెల్లడి చేయాలని కేంద్ర/రాష్ట్ర సమాచార అధికారి నిర్ణయిస్తే ...దరఖాస్తు అందిన అయిదు రోజుల్లోగా ఆ విషయాన్ని రాతపూర్వకంగాసంబంధిత మూడో పక్షానికి తెలియజేయాలి. దరఖాస్తుదారుడు కోరిన రికార్డు/సమాచారం అందులో కొద్ది భాగం వెల్లడించాలనిభావిస్తున్నట్లు పేర్కొంటూ...అలా వెల్లడి చేయవచ్చో లేదో మౌఖికంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ దాఖలు చేయాలని ఆ నోటీసులోమూడో పక్షాన్ని కోరాలి. సమాచారాన్ని వెల్లడించాలనే నిర్ణయం తీసుకునే ముందు మూడో పక్షం చేసిన దాఖలును పరిగణనలోకితీసుకోవాలి. చట్టం పరిరక్షిస్తున్న వాణిజ్య, వ్యాపార రహస్యాలను మినహాయించి..సమాచారాన్ని వెల్లడిస్తే మూడో పక్షానికి కలిగేహానికన్నా ప్రజా ప్రయోజనాలకు కలిగే మేలే ఎక్కువని భావిస్తే ఆ సమాచారాన్ని వెల్లడించవచ్చు.


(2) సబ్ సెక్షన్ (1) కింద మూడో పక్షానికి నోటీసు ఇచ్చినపుడు ...ఆ నోటీసు అందిన నాటి నుంచి పదిరోజుల్లోగా సమాచార వెల్లడిప్రతిపాదనపై తమ వాదనను దాఖలు చేసుకునేందుకు ఆ మూడో పక్షానికి అవకాశం ఇవ్వాలి.


(3) సెక్షన్ 6 కింద సమాచారం కోరిన దరఖాస్తు అందినపుడు, సబ్ సెక్షన్ (2) కింద తమ వాదనను వినిపించేందుకు అవకాశం ఇచ్చినతర్వాత దరఖాస్తు అందిన నాటి నుంచి 40 రోజుల్లోపు సెక్షన్ (2) కింద తమ వాదనను వినపించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాతదరఖాస్తు అందిన నాటి నుంచి 40 రోజుల్లోపు సెక్షన్ (7) లోని నిబంధనలతో పని లేకుండా సమాచారాన్ని, రికార్డులను, అందులోభాగాన్ని వెల్లడి చేయాలా...వద్దాని నిర్ణయించి, నోటీసు ద్వారా తమ నిర్ణయాన్ని మూడో పక్షానికి తెలపాలి.




(4) సబ్ సెక్షన్ (3) మూడో పక్షానికి ఇచ్చిన నోటీసులోని నిర్ణయంపై, సెక్షన్ 19 ప్రకారం అప్పీలుకు వెళ్లేందుకు దరఖాస్తుదారునికిహక్కు ఉందని కూడా తెలపాలి.


అధ్యాయం - 3 

కేంద్ర సమాచార కమిషన్ 

12. (1) ఈ చట్టం కింద సంక్రమించిన అధికారులను వినియోగించేందుకు, అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు అధికార గెజిట్లోనోటిఫికేషన్ ద్వారా కేంద్ర సమాచార కమిషన్ అనే సంస్థను ప్రభుత్వం స్థాపిస్తుంది.


(2) కమిషన్లో...
(ఎ) ప్రధాన సమాచార కమిషనర్
(బి) పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో కేంద్ర సమాచార కమిషనర్లు
(3) ఒక కమిటీ సిఫారసు మేరకు ప్రధాన సమాచార కమిషనర్ ను, కేంద్ర సమాచార కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఆకమిటీలో..


(1) ప్రధానమంత్రి, కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.
(2) లోక్ సభలో ప్రతిపక్షనేత
(3) ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర క్యాబినేట్ మంత్రి.
వివరణ : లోక్ సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతిపెద్ద పార్టీ నాయకుణ్ని ప్రతిపక్ష నేతగాపరిగణిస్తారు

(4) కేంద్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు ప్రధాన సమాచార కమిషనర్ కుసంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్ కు కేంద్ర సమాచార కమిషనర్లు సాయపడతారు. ఈ చట్టంకింద స్వతంత్ర ప్రతిపత్తిలో మరే అధికారానికి లోబడకుండా కేంద్ర సమాచార కమిషన్ వినియోగించే అన్ని అధికారాలనూ, నిర్వహించేఅన్ని పనులనూ కేంద్ర సమాచార కమిషనర్ వినియోగించవచ్చు. నిర్వహించవచ్చు.


(5) ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. వారికి విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతికరంగాలు, సామాజిక సేవ, మేనేజ్ మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవం ఉండాలి.


(6) ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్లు పార్లమెంట్ సభ్యులు గానీ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులుగానీఅయి ఉండరాదు. ఆర్థికంగా లాభం చేకూరే ఏ ఇతర పదవిలోనూ ఉండరాదు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండకూడదు. ఏఇతర వ్యాపారాన్ని గానీ, వృత్తిని గాని నిర్వహించరాదు.


(7) కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత కేంద్రసమాచార కమిషన్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.


13. (1) ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్లపాటు ప్రధాన సమాచార కమిషనర్ పదవిలో ఉంటారు. ప్రధాన సమాచారకమిషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఏ సమాచార కమిషనర్ కూడా పదవిలోఉండేందుకు వీల్లేదు.


(2) ప్రతి సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు /65 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ ఏది ముందయితేఅంతవరకూ పదవిలో ఉంటారు. పదవీ విరమణ తర్వాత పునర్నియామకానికి అవకాశం లేదు. ఈ సబ్ సెక్షన్ కింద పదవీ విరమణచేసే ఏ సమాచార కమిషసర్కు అయినా సెక్షన్ 12, సబ్ సెక్షన్ (3) లో నిర్దేశించిన విధంగా ప్రధాన సమాచార కమిషనర్ గానియమితులయ్యే అర్హత ఉంటుంది. అలా ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులైన వ్యక్తి ఈ రెండు పదవుల్లోనూ కలపిఅయిదేళ్లకు మించి పదవిలో ఉండరాదు.


(3) ప్రధాన సమాచార కమిషనర్/ సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు రాష్ట్రపతి ఎదుటగానీ, ఈ పనికోసం రాష్ట్రపతినియమించిన మరో వ్యక్తి ముందుగానీ మొదటి షెడ్యూల్లో తెలిపిన విధంగా ప్రమాణస్వీకారం చేయాలి.


(4) ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషసర్ ఎప్పుడైనా స్వదస్తూరితో లేఖ రాయడంతో రాష్ట్రపతికి రాజీనామాసమర్పించవచ్చు. సెక్షన్ 14లో నిర్దేశించిన రీతిలో ప్రధాన సమాచార కమిషనర్ ను/ సమాచార కమిషనర్ నూ పదవి నుంచితొలగించవచ్చు.


(5) వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు :


(ఎ) ప్రధాన సమాచార కమిషనర్ కు ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సమానంగా ఉంటాయి.
(బి) సమాచార కమిషనర్ కు ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయి. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్నియమితులైన సమయంలో, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సర్వీసు పింఛను తీసుకుంటున్నట్లయితే (వికలాంగులు,గాయపడిన వారికి ఇచ్చే పించను కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పింఛను, గ్రాట్యుటీ మినహా ఇతర పదవీవిరమణ లాభాలతో సమానమైన పింఛను మొత్తాన్ని వేతనం నుంచి మినహాయిస్తారు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచారకమిషనర్లు తమ నియామక సమయంలో, గతంలో కేంద్ర, రాష్ట్ర చట్టాల కింద ఏర్పాటైన కార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ/కేంద్ర లేదారాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని/నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలతో చేసిన సర్వీసుకు లబ్ది పొందుతున్నట్లయితే ఆ లబ్దికిసమానమైన పింఛను మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకంతర్వాత వారి వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నియమ నిబంధనల విషయంలో నిర్ణీత పద్ధతిలో వ్యవహరిస్తారు.


14. (1) నిరూపిత అనుచిత ప్రవర్తన, అశక్తత కారణాలతో సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి ప్రధాన సమాచార కమిషనర్ను,లేక ఏ సమాచార కమిషనర్ ను అయినా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతి సూచనమేరకుసుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్ను పదవి నుంచితొలగించవచ్చని చెప్పిన తర్వాత రాష్ట్రపతి ఆ ఉత్తర్వును జారీ చేయాలి


(2) సబ్ సెక్షన్ (1) కింద ప్రధాన కమిషనర్/సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టు సూచించిన తర్వాత, ఆ విచారణజరుగుతున్న సమయంలో...అది ముగిసి కోర్టు నివేదిక వచ్చి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సదరు కమిషనర్ ను రాష్ట్రపతి సస్పెండ్చేయవచ్చు. అవసరం లేకుంటే కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు.


(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా ప్రధాన సమాచార కమిషనర్ ను / సమాచార కమిషనర్ను ఈ కిందికారణాలతో తన ఉత్తర్వుల ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.


(ఎ) దివాళా తీసినట్లు నిరూపితమయితే..
(బి) ఏదైనా నేర నిరూపణ జరిగి, ఆ నేరం నీతి బాహ్యమని రాష్ట్రపతి భావించినపుడు,
(సి) ఆర్థికలాభం కోసం పదవిలో ఉన్నప్పుడు తన విధి నిర్వహణలో సంబంధం లేని ఇతర పనులు చేసినపుడు,
(డి) శారీరకంగా/మానసికంగా పదవిలో కొనసాగడానికి పనికిరారని రాష్ట్రపతి భావించినప్పుడు
(ఇ) తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రా ప్రయోజనాలను పొందినప్పుడు


(4) కేంద్ర ప్రభుత్వం/దాని తరుపున చేసుకున్న ఏ ఒప్పందం, కాంట్రాక్టులోనయినా ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్అయినా ఏ తరహాలోనైనా ఆసక్తి చూపించినా, కల్పించుకున్నాసబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న అనుచిత ప్రవర్తన కిందకు వస్తుంది. ఏదైనాఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు, ఆదాయాలు, రాబడుల్లో సభ్యుడిగా కాక మరో విధంగా పాలు పంచుకున్నా...అనుచిత ప్రవర్తనేఅవుతుంది.

అధ్యాయం - 4

రాష్ట్ర సమాచార కమిషన్ 

15. (1) ఈ చట్టం కింద సంక్రమించిన అధికారాలను వినియోగించేందుకు, అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు అధికార గెజిట్లోనోటిఫికేషన్ ద్వారా ....సమాచార కమిషన్ అనే సంస్థను రాష్ట్రప్రభుత్వం స్థాపిస్తుంది.


(2) కమిషన్లో...
(ఎ) రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్
(బి) పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమిషనర్లు


(3) ఒక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను, రాష్ట్ర సమాచార కమిషనర్లను గవర్నర్ నియమిస్తారు. ఆకమిటీలో...
(1) ముఖ్యమంత్రి, కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.
(2) శాసనసభలో ప్రతిపక్ష నేత
(3) ముఖ్యమంత్రి నామినేట్ చేసే ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి.


(వివరణ : శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతి పెద్ద పార్టీ నాయకుణ్ని ప్రతిపక్ష నేతగాపరిగణిస్తారు.)


(4) రాష్ట్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు సంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్ కు రాష్ట్ర సమాచార కమిషనర్లు సాయపడతారు. ఈ చట్టంకింద స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికి లోబడకుండా రాష్ట్ర సమాచార కమిషన్ వినియోగించవచ్చు. నిర్వహించవచ్చు.


(5) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. వారికి విషయ పరిజ్ఞానం,చట్టం, శాస్త్త సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్ మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలోఅనుభవం ఉండాలి.


(6) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషసర్, సమాచార కమిషనర్లు పార్లమెంట్ సభ్యులుగానీ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభసభ్యులుగానీ అయి ఉండరాదు. ఆర్థికంగా లాభం చేకూరే ఏ ఇతర పదవిలోనూ ఉండరాదు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధంఉండకూడదు. ఏ ఇతర వ్యపారాన్ని గానీ, ఇతర వృత్తిని గానీ నిర్వహించరాదు.


(7) రాష్ట్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్లో ప్రకటించిన చోట ఏర్పాటవుతుంది. రాష్ట్రప్రభుత్వంనుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రసమాచార కమిషన్ రాష్ట్రం ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.


16. (1) ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్ల పాటు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ పదవిలో ఉంటారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషన్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఏ రాష్ర్ట సమాచార కమిషన్ కూడాపదవిలో ఉండేందుకు వీల్లేదు.


(2) ప్రతి రాష్ట్ర సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు/65 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ ఏది ముందయితేఅంతవరకూ పదవిలో ఉంటారు. పదవీ విరమణ తర్వాత పునర్నియామకానికి అవకాశం లేదు. ఈ సబ్ సెక్షన్ కింద పదవీ విరమణచేసే ఏ రాష్ట్ర సమాచార కమిషనర్ అయినా సెక్షన్ (3)లో నిర్దేశించిన విధంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యేఅర్హత ఉంటుంది. అలా ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ఈ రెండు పదవుల్లోనూ కలిపి అయిదేళ్లకు మించిపదవిలో ఉండరాదు.


(3) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు గవర్నర్ ఎదుటగానీ, ఈ పని కోసం గవర్నర్నియమించిన మరో వ్యక్తి ముందు గానీ మొదటి షెడ్యూల్లో తెలిపిన విధంగా ప్రమాణ స్వీకారం చేయాలి.


(4) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/ సమాచార కమిషనర్ ఎప్పుడైనా స్వదస్తూరితో లేఖ రాయడంతో గవర్నర్కు రాజీనామాసమర్పించవచ్చు. సెక్షన్ 14లో నిర్దేశించిన రీతిలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ను/సమాచార కమిషనర్ నూ పదవి నుంచితొలగింవచ్చు.


(5) వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు :


(ఎ) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయి.


(బి) రాష్ట్ర సమాచార కమిషనర్ కు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్,సమాచార కమిషనర్ గా నియమితులైన సమయంలో, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సర్వీసు పింఛనుతీసుకుంటున్నట్లయితే (వికలాంగులు, గాయపడిన వారి ఇచ్చే పింఛను కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పింఛను,గ్రాట్యుటీ మినహా ఇతర పదవీ విరమణ లాభాలతో సమానమైన పంఛను మొత్తాన్ని వేతనం నుంచి మినహాయిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు తమ నియామక సమయంలో, గతంలో, కేంద్రం/రాష్ర చట్టాల కింద ఏర్పాటైనకార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ/ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని/నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలలో చేసినసర్వీసుకు లబ్ది పొందుతున్నట్లయితే...ఆ లబ్దికి సమానమైన పింఛను మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకం తర్వాత వారి వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణీతపద్ధతిలో వ్యవహరిస్తారు.


17. (1) నిరూపిత అనుచిత ప్రవర్తన, అశక్తత కారణాలతో సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్నూ, లేక ఏ రాష్ట్ర సమాచార కమిషనర్ను అయినా ఒక్క గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. గవర్నర్సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచారకమిషనర్ ను పదవి నుంచి తొలగించవచ్చని చెప్పిన తర్వాత గవర్నర్ ఆ ఉత్తర్వు జారీ చేయాలి.


(2) సబ్ సెక్షన్ (1) కింద రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టుకు సూచించినతర్వాత, ఆ విచారణ జరుగుతున్న సమయంలో....అది ముగిసి కోర్టు నివేదిక వచ్చి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సదరు కమిషనర్నుగవర్నర్ సస్పెండ్ చేయవచ్చు. అవసరం అనుకుంటే కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు.


(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను/ సమాచార కమిషనర్ను ఈ కిందికారణాలతో తన ఉత్తర్వులు ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.


(ఎ) దివాళా తీసినట్లు నిరూపితమైతే
(బి) ఆర్థిక లాభం కోసం పదవిలో ఉన్నప్పుడు తన విధి నిర్వహణతో సంబంధం లేని ఇతర పనులు చేసినప్పుడు
(సి) ఏదైనా నేర నిరూపణ జరిగి, ఆ నేరం నీతి బాహ్యమని గవర్నర్ భావించినప్పుడు
(డి) శారీరకంగా/మానసికంగా దుర్భరులై పదవిలో కొనసాగడానికి పనికిరాదని గవర్నర్ భావించినప్పుడు
(ఇ) తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రా ప్రయోజనాలను పొందినప్పుడు


(4) కేంద్ర ప్రభుత్వం/దాని తరపున చేసుకున్న ఏ ఒప్పందం, కాంట్రాక్టులోనయినా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/ రాష్ట్ర సమాచారకమిషనర్ అయినా ఏ తరహాలోనయినా ఆసక్తి చూపించినా, కల్పించుకున్నా సబ్ సెక్షన్ (1) లో పేర్కొన్న అనుచిత ప్రవర్తన కిందకువస్తుంది. ఏదైనా ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు, ఆదాయాలు, రాబడుల్లో సభ్యుడిగా కాక మరో విధంగా పాలుపంచుకున్నా..అనుచిత ప్రవర్తనే అవుతుంది. కంపెనీ లాభాలు, ఆదాయాలు, రాబడులలో సభ్యుడిగా కాక మరో విధంగాపాలుపంచుకున్న సందర్భంలో కూడా అనుచిత ప్రవర్తన కిందకు వస్తుంది.


అధ్యాయం - 5

సమాచార కమిషన్ల అధికారాలు, విధులు అప్పీలు, జరిమానాలు 

18. (1) ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి అయినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్టసమాచార కమిషన్ విధి, ఆ ఫిర్యాదుల సందర్భాలు :


(ఎ) కేంద్ర ప్రజా సమాచార అధికారి / రాష్ట్ర ప్రజా సమాచార అధికారి నియామకం జరగని కారణంగా సమాచారం కోసం అభ్యర్ధనఅందించలేని పక్షంలో, కేంద్ర ప్రజా సమాచార సహాయ అధికారి లేక రాష్ట్ర ప్రజా సమాచార సహాయ అధికారి సమాచారం కోసం వచ్చినదరఖాస్తునో, అప్పీలునో స్వీకరించకుండా, దీనిని కేంద్ర పౌర సమాచార అదికారి రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 19 లోని సబ్సెక్షన్ (1) పేర్కొన్న సీనియర్ అదికారి కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్కు పంపిన పక్షంలో (బి) ఈ చట్టం కిందఅభ్యర్థించిన సమాచారాన్ని అందించేందుకు నిరాకరించినప్పుడు


(సి) ఈ చట్టం కింద సమాచారం కోసం ఇచ్చిన అభ్యర్ధనకు నిర్దేశించిన కాలపరిమితిలొగా జవాబు రాని పక్షంలో
(డి) సమాచారం కోసం చెల్లించాల్సి వచ్చిన రుసుము సహేతుకంగా లేదని దరఖాస్తుదారు భావిస్తే
(ఇ) ఈ చట్టం కింద తనకు అసంపూర్తిగా, తప్పుదోవ పట్టించే విధంగా, తప్పుడు సమాచారం అందించారని దరఖాస్తుదారుభావించినప్పుడు
(ఎఫ్) ఈ చట్టం కింద సమాచారాన్ని కోరడం, రికార్డులను అందుబాటులో ఉంచడానికి సంబంధించిన మరే ఇతర విషయాలలోనైనా


(2) ఫిర్యాదును విచారించేందుకు తగిన కారణాలు ఉన్నాయని కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలోదానిపై విచారణకు ఆదేశించవచ్చు.


(3) ఈ సెక్షన్ కింద ఏ విషయంలోనైనా విచారణ జరిపేటప్పుడు కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ కు సివిల్ ప్రొసిజర్కోడ్, 1908 కింద ఏ దావానయినా విచారించేప్పుడు సివిల్ కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ కింది వాటికి సంబంధించిఅలాంటి అధికారాలు ఉంటాయి.
(ఎ) వ్యక్తులకు సమన్లు జారీ చేసిన వారిు హాజరు అయ్యేటట్లు చేయడం, మౌఖికంగా లిఖిత పూర్వకంగా వారు సాక్ష్యం ఇచ్చేట్లుచేయడం, పత్రాలు ఇతర వస్తువులను సమర్పించేట్లు చేయడం.
(బి) పత్రాలు వెలికితీసీ తనిఖీ చేయడం
(సి) అఫిడవిట్ రూపంలో వాంగ్మూలం స్వీకరించడం
(డి) ఏ కోర్టు కార్యాలయం నుంచి అయినా ప్రభుత్వ రికార్డులు, లేక వాటి కాపీలను తెప్పించడం.
(ఇ) సాక్ష్యులను విచారించేందుకు పత్రాలు పరిశీలించేందుకు సమన్లు జారీ చేయడం
(ఎఫ్) నిర్ణయించిన విధంగా మరే ఇతర విషయమైనా


(4) పార్లమెంట్ లేక రాష్ట్ర శాసనసభలు చేసిన ఏ ఇతర చట్టంలోని నిబంధనలు అడ్డుగా ఉన్నప్పటికీ, కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్టసమాచార కమిషన్ ఈ చట్టం కింద ఒక ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సందర్భంలో, అధికార యంత్రాంగం నియంత్రణలో ఉండి ఈచట్టం వర్తించే ఏ రికార్డునయినా పరిశీలించవచ్చు. అలాంటి రికార్డులను ఏ కారణంతోనయినా సమాచార కమిషన్ ముందుఉంచకపోవడం కుదరదు.


(19) (1) సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (3) లోని క్లాజు (ఎ)లో నిర్దేశించిన కాలపరిమితిలోగా జవాబు దొరకని వ్యక్తిఎవరైనా, లేక కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారైనా ఆకాలపరిమితి ముగింపు తరువాత లేక నిర్ణయం అందిన తరువాత 30 రోజులలోగా అప్పీలు చేసుకోవచ్చు. కేంద్ర పౌర సమాచారఅధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి, సంబంధిత అధికార యంత్రాంగంలో సీనియర్ హోదాలో ఉన్న అధికారికి ఆ అప్పీలునునివేదించాలి. 30 రోజుల గడువు ముగిసిన తర్వాత అప్పీలు వచ్చిన సందర్భంలో ఆ ఆలస్యానికి తగిన కారణాలు ఉన్నాయని ఆసీనియర్ అధికారి భావించిన పక్షంలో ఆ అప్పీలును స్వీకరించవచ్చు.


(2) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 11 కింద తృతీయ పక్షానికి చెందిన సమాచారాన్ని వెల్లడిచేయాలని నిర్ణయించిన సందర్భంలో ఆ నిర్ణయంపై అప్పీలు చేయాలని తృతీయ పక్షం భావించినట్లయితే ఆ నిర్ణయం వెలువడిన 30రోజులలోగా అప్పీలు చేయాలి.


(3) సబ్ సెక్షన్ (1) కింద వచ్చిన నిర్ణయంపై రెండవసారి అప్పీలు చేయదలిస్తే ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సిన తేదీ నుంచి కానీనిర్ణయం అందిన రోజు నుంచి కానీ 90 రోజులలోగా కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ముందు అప్పీలుకువెళ్లవచ్చు. 90 రోజుల గడువు దాటి రెండవ అప్పీలు వచ్చిన సందర్భంలో ఆ ఆలస్యానికి తగిన కారణం ఉందని కేంద్ర సమాచారకమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో దానిని స్వీకరించవచ్చు.


(4) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయంపై వచ్చిన అప్పీలు తృతీయ పక్షానికి చెందినసమాచారానికి సంబంధించినదయితే కేంద్ర సమాచార కమిషన లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆ తృతీయ పక్షానికి తమ వాదనవినిపించుకునేందుకు తగిన అవకాశం ఇవ్వాలి.
(5) ఏ అప్పీలు విచారణలోనయినా అభ్యర్ధనను తిరస్కరించడం న్యాయబద్దమేనని నిరూపించాల్సిన బాధ్యత ఆ తిరస్కరించి అధికారయంత్రాంగంపైనే ఉంటుంది.


(6) సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (2) కింద వచ్చిన అప్పీళ్ళను అవి అందిన తర్వాత 30 రోజులలోగా పరిష్కరించాలి. ఈ కాలపరిమితిపొడిగించాల్సి వస్తే అప్పీలు దాఖలయిన నాటి నుంచి మొత్తం 45 రోజులలోగా అప్పీలును పరిష్కరించాలి. ఆ పొడిగింపునకు గలకారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి.


(7) కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ వెలువరించిన నిర్ణయాలకు తప్పనిసరిగా అందరూ కట్టుబడాలి.


(8) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు ఈ కింది నిర్ణయాధికారాలు ఉన్నాయి :


(ఎ) ఈ చట్టంలోని నిబంధనలు అమలు జరిపేందుకు అవసరమైన ఏవైనా చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించడం, ఆ చర్యలలో ఈకిందివి కూడా భాగాలు :
(1) ఎవరైనా కోరిన పక్షంలో ఒక ప్రత్యేకమైన రూపంలో సమాచారం అందుబాటులో ఉంచడం


(2) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిని నియమించడం


(3) నిర్దిష్టమైన సమాచారాన్ని లేక కొన్ని విభాగాల సమాచారాన్ని ప్రచురించడం


(4) రికార్డుల నిర్వహణ, మేనేజ్ మెంట్, విధ్వంసానికి సంబంధించి అనుసరిస్తున్న పద్ధతులలో కొన్ని అవసరమైన మార్పులుచేయడం.
(5) అధికార యంత్రాంగంలోని అధికారులకు సమాచార హక్కుపై శిక్షణ ఇచ్చే సదుపాయాలను హెచ్చించడం.
(6) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ ‘(1) క్లాజు (బి) అమలుపై వార్షక నివేదిక రూపొందించడం.


(బి) ఫిర్యాదులను కలిగిన నష్టాన్ని కానీ ఇతర కష్టాన్ని కానీ పరిహారం ద్వారా పూడ్చాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం.
(సి) ఈ చట్టంలో నిర్దేశించిన విధంగా జరిమానాలు విధించడం
(డి) దరఖాస్తును తిరస్కరించడం
(9) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ తన నిర్ణయాన్ని, అప్పీలు అవకాశం ఉంటే ఆ వివరాలతో సహాఫిర్యాదుదారుకూ, అధికార యంత్రాంగానికి నోటీసు ద్వారా తెలియపరచాలి.


(10) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ అప్పీలు విచారణను నిర్ణీత పద్ధతిలో జరపవచ్చు


(20) (1) ఫిర్యాదుపై లేక అప్పీలుపై కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్రపౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైన కారణం లేకుండా దరఖాస్తును స్వీకరించలేదని భావించినా, తగినకారణం లేకుండా సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు సమాచారం అందించలేదని భావించినా,సమాచారం కోసం అభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసి కూడా తప్పుడు, అసంపూర్తి తప్పుదోవబట్టించేసమాచారం అందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగానయినాసమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా దరఖాస్తును స్వీకరించేంతవరకు లేక సమాచారం అందించేంతవరకు రోజుకు 250రూపాయలు చొప్పున జరిమానా విధించే ముందు కేంద్ర పౌర సమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది.


(2) ఫిర్యాదుపై లేక అప్పీలుపై నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైనకారణం లేకుండా పదే పదే దరఖాస్తును స్వీకరించలేదని, లేక సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపుసమాచారాన్ని అందించలేదని కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట సమాచార కమిషన్ భావించిన పక్షంలో, లేక సమాచారం కోసంఅభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసికూడా తప్పుడు, అసంపూర్తి , తప్పుదోవ పట్టించే సమాచారంఅందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగా నయినా సమాచారంఅందకుండా అడ్డుపడ్డారని భావించినా ఆ కేంద్ర పౌర సమాచార అధికారి లే్క రాష్ట్ర పౌర సమాచార అధికారిపై వారికి వర్తించే సర్వీసునిబంధనల కింద క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా సిఫారసు చేయాలి.


అధ్యాయం - 6

ఇతర నిబంధనలు 

21. ఈ చట్టం కింద లేక ఈ చట్టం కింద రూపొందిన రూల్స్ కింద నుంచి చేస్తున్నానన్న నమ్మకంతో ఎవరేం చేసినా, చేసేందుకుఉద్దేశించినా అందుకు వారిపై ఎలాంటి దావాలు వేయడం, ప్రాసిక్యూట్ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.


22. అధికార రహస్యాల చట్టం, 1923 అమలులో ఉన్న మరేదైనా చట్టం, లేక మరేదైనా చట్టం వల్ల అమలులో ఉన్న పత్రంలో ఈచట్టంతో పొసగని అంశాలు ఎలాంటివి ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉంటాయి.


23. ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను గానీ, దరఖాస్తునున గానీ, ఇతర విచారణలను గానీ ఏ న్యాయస్థానంచేపట్టరాదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆ ఆదేశాలను ప్రశ్నించడం కుదరద.
24. (1) రెండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇంటిలిజెన్స్, భద్రతా సంస్థలకు, ఆ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికీ ఈచట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలు, మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం కోరినప్పుడు కేంద్ర సమాచారకమిషన్ ఆమోదం తర్వాత అభ్యర్ధన అందిన దగ్గర నుంచి 45 రోజులలోగా, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, సమాచారంఅందించాల్సి ఉంటుంది.
(2) కేంద్ర ప్రభుత్వం తాను నెలకొల్పిన మరో ఇంటిలిజెన్స్ లేక భద్రతా సంస్థను, అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా, రెండవ షెడ్యూల్లోచేర్చవచ్చు. అలాగే ఇప్పటికే అందులో ఉన్న ఏదైనా సంస్థను తొలగించవచ్చు. అలాంటి నోటిఫికేషన్ ప్రచురించగానే ఒక సంస్థ షెడ్యల్లో చేరినట్టుగానో లేక తొలగిపోయినట్లుగానో లెక్క.


(3) సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ నూ పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి.


(4) రాష్ర్టప్ఱభుత్వం నెలకొల్పిన ఇంటలజెన్స్, భద్రతాసంస్థలకు ఈ చట్టం వర్తించదు. ఆ ఇంటిలిజెన్స్,భద్రతాసంస్థలను రాష్ట్రప్రభుత్వంఅధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారాపేర్కొన వచ్చు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం అయినప్పుడు ఈ సబ్ సెక్షన్నుంచి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అయితే, రాష్ట్ర సమాచార కమిషన్ఆమోదం పొందిన తర్వాత, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లే్కుండా, అభ్యర్థన అందిన నాటి నుంచి 45 రోజులలోగా ఆసమాచారం అందించాల్సి ఉంటుంది.


(5) సబ్ సెక్షన్ (4) కింద జారీచేసిన ప్రతి నోటిఫికేషన్ నూ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.


25. (1) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితే అంత త్వరగా ప్రతి ఏడాదిఆఖరులో ఈ చట్టంలోని నిబంధనల అమలుపై ఒక నివేదిక రూపొందించి దాని కాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి.


(2) ఈ సెక్షన్ కింద నివేదిక రూపొందించడం కోసం ప్రతి మంత్రిత్వశాఖ లేక డిపార్ట్ మెంటు తమ పరిధిలోని అధికార యంత్రాంగాలకుసంబంధించిన సమాచారం సేకరించి కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు సమర్పించాలి. ఆ తరహా సమాచారంసమర్పించడం, రికార్డులను నిర్వహించడం కోసం అవసరమైన అన్ని అంశిాలను పాటించాలి.
(3) ప్రతి నివేదికలో ఆ సంవత్సరానికి సంబంధించి ఈ కింది అంశాలు ఉండాలి :
(ఎ) ప్రతి అధికార యంత్రాంగానికి వచ్చిన అభ్యర్ధుల సంఖ్య


(బి) దరఖాస్తుదారులకు సమాచారం అందివ్వకూడదన్న నిర్ణయాల సంఖ్య ఈ చట్టంలో ఆ నిర్ణయాలకు ప్రాతిపదికగా ఉన్న నిబంధనలవివరాలు, ఎన్నిసార్లు ఆ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది


(సి) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు అందిన అప్పీళ్ళ సంఖ్య ఆ అప్పీళ్ల వివరాలు, ఆ అప్పీళ్ల ఫలితాలు.


(డి) ఈ చట్టం అమలుకు సంబంధించి ఏ అధికారిపైన అయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే ఆ వివరాలు.
(ఇ) ఈ చట్టం కింద ప్రతి అధికార యంత్రాంగం వసూలు చేసిన రుసుముల వివరాలు.
(ఎఫ్) ఈ చట్టం స్ఫూర్తినీ , ఉద్దేశాలనూ అమలులో పెట్టేందుకు అధికార యంత్రాంగాల తరపున ఏదైనా కృషి జరిగి ఉంటే అందుకుసంబంధించిన వాస్తవ సమాచారం.
(జి) ఏదైనా ఒక ప్రత్యేకమైన అధికార యంత్రాంగానికి సంబంధించిన సిఫార్సులతో సహా సంస్కరణలకు సంబంధించిన సిఫారసులు, ఈచట్టం లేక సమాచార హక్కును అమలులోకి తీసుకురావడానికి ఉపకరించే మరే చట్టం అయినా, వాటి అభివృద్ధి, వికాసం, ఆధునీకరణ,సంస్కరణ, సవరణలకు సంబంధించిన సిఫార్సులు.


(4) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఏడాది ఆఖరులో ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితే అంత త్వరగాపార్లమెంటు ఉభయసభల ముందు లేక రాష్ట్రాలలో రెండు సభలు ఉంటే రెండు సభల ముందు, లేక విధానసభ ఒకటే ఉంటే ఆ సభముందు ఉంచాలి.


(5) ఒక అధికార యంత్రాంగం ఈ చట్టం కింద తన విధులు నిర్వహించడం ఈ చట్టం నిబంధనలకూ, స్ఫూర్తికీ అనుగుణంగా లేదని కేంద్రసమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో ఆ విధానాలు అందుకు అనుగుణంగా ఉండేందుకు తీసుకోవల్సినచర్యలను ఆ అధికార యంత్రాంగానికి సిఫారసు చేయవచ్చు.


26. (1) ఆర్థిక వనరులు, ఇతర వనరులు అందుబాటులో ఉన్నంతమేరకు సముచిత ప్రభుత్వం కింది చర్యలు చేపట్టాలి?


(ఎ) ఈ చట్టంలో నిర్ధేశించిన హక్కులను వినియోగించుకునే విషయంలో ప్రజలు, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల అవగాహననుపెంపొందించడం కోసం కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం.


(బి) క్లాజ్ (ఎ)లో పేర్కొన్న కార్యక్రమంలో పాలుపంచుకోవడం, అలాంటి కార్యక్రమాలు తామే చేపట్టడం కోసం అధికార యంత్రాంగాలనుప్రోత్సహించడం.


(సి) తమ కార్యకలాపాల గురించి అదికార యంత్రాంగాలు సరైన సమయంలో, సమర్థవంతంగా, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకుఅందించేట్లు చూడడం.


(డి) కేంద్ర పౌర సమాచార అధికారులు లేక రాష్ట్ర పౌర సమాచార అధికారులకు శిక్షణ ఇవ్వడం, అధికార యంత్రాంగాలుఉపయోగించుకోవడం కోసం శిక్షణా సామాగ్రిని రూపొందించడం.
(2) ఈ చట్టం కింద సంక్రమించిన హక్కులను వినియోగించుకోదలచిన ఏ వ్యక్తికి అయినా అవసరమయ్యే సమాచారంతో, తేలికగాఅర్థంవ అయ్యే రీతిలో ఒక గైడ్ను సముచిత ప్రభుత్వం, ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 18 నెలలులోగా అధికార భాషలోముద్రించాలి.


(3) సముచిత ప్రభుత్వం, అవసరమైన పక్షంలో, సబ్ సెక్షన్ (2) లో సూచించిన మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడు సవరించిప్రచురించవచ్చు. సబ్ సెక్షన్ (2) సాధారణ లక్షణాలకు భంగం వాటిల్లని రీతిలో ఈ కింది విషయాలపై మార్గదర్శక సూత్రాలనుప్రచురించవచ్చు.
(ఎ) ఈ చట్టం లక్ష్యాలు


(బి) సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద ప్రతి అధికార యంత్రాంగంలో నియమితులైన కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌరసమాచార అధికారి చిరునామా, ఫోన్ నంబరు, ఫ్యాక్స్ నంబరు, దొరికిన పక్షంలో ఇ-మెయిల్ అడ్రస్.


(సి) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి సమాచారం కోసం అభ్యర్ధన అందించే విధానం, రూపం,
(డి) ఈ చట్టం ప్రకారం ఒక అధికార యంత్రాంగంలోని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర అధికారి నుంచి దరఖాస్తుదారుకుఅందే సహాయం, ఆ అధికారుల విధులు.


(ఇ) కేంద్ర సమాచారం కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి అందగల సహాయం
(ఎఫ్) ఈ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు, ఈ చట్టం నిర్దేశిస్తున్న విధులకు సంబంధించి ఏదన్నా జరిగినా, ఏదన్నాజరగకపోయినా, సమాచార కమిషన్ కు అప్పీలు చేసుకోవడంతో సహా చట్టంలో ఉన్న అన్ని పరిష్కార మార్గాలు.
(జి) సెక్షన్ 4 ప్రకారం వివిధ విభాగాల రికార్డులను స్వచ్ఛందంగా వెల్లడి చేయడానికి సంబంధించిన నిబంధనలు
(హెచ్) సమాచారం అందుబాటు కోసం చెల్లించాల్సిన రుసుము నోటీసులు.
(ఐ) ఈ చట్టం ప్రకారం సమాచారం అందుబాటు కోసం ఏవైనా రూల్స్ రూపొందించినా, సర్క్యులర్లు జారీ చేసినా వాటి వివరాలు.
(4) సముచిత ప్రభుత్వం, అవసరం అయిన పక్షంలో, తప్ననిసరిగా మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడు సవరించి ప్రచురించాలి.


27. (1) ఈ చట్టంలోని నిబంధనలు అయలు చేయడం కోసం కేంద్రప్రభుత్వం అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా నియమాలురూపొందించవచ్చు.


(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో ఈ కింది విషయాలన్నింటికీ లేక వాటిలో కొన్నిటికి సంబంధించినియమాలు రూపొందించవచ్చు. (ఎ) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తి చేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకూఅయ్యే ఖర్చు ధర.


(బి) సెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము
(సి) సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) , (5) కింద చెల్లించాల్సిన రుసుము.
(డి) సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (7) ప్రకారం, సెక్షన్ 16 లోని సబ్ సెక్షన్ (6) ప్రకారం అధికారులకూ,
ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, అలవెన్సులు, వారి సర్వీసు నిబంధనలు.


(ఇ) సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (10) ప్రకారం అప్పీళ్లపై విచారణకు కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్అవలంబించవలసిన పద్ధతి.


(ఎఫ్) నిర్ణీత పద్ధతిలో నిర్ణయించవలసిన మరే విషయమయినా.
28. (1) ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయడం కోసం అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా సమర్థ అధికారి నియమాలురపొందించవచ్చు.


(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో ఈ కింది విషయాలన్నింటికీ, లేక వాటిలో కొన్నిటికి సంబంధించి రూల్స్రూపొందించవచ్చు :


(ఎ) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తి చేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకు అయ్యే ఖర్చు ధర.
(బి) సెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము.
(సి) సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము.
(డి) నిర్ణీత పద్దతిలో నిర్ణయించవలసిన మరే విషయంలో


29. (1) ఈ చట్టం కింద చేసిన ప్రతి రూల్ నూ ఆ వెంటనే కేంద్రప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల ముందు, 30 రోజులపాటు ఒకసమావేశం తర్వాత రెండవ సమావేశం ముగిసే ముందు, లేక ముందు చెప్పిన వరుస సమావేశాలు ముగిసే ముందు ఉభయసభలుఒక రూల్ ను సవరించాలనీ, లేక అసలు ఆ రూల్ ఉండకూడదని కానీ నిర్ణయించిన పక్షంలో ఆ రూల్ ఆ నిర్ణయం ప్రకారం సవరించినరూపంలో అమలవుతుంది. లేక రద్దయిపోతుంది. అయితే ఆ విధమైన సవరణగానీ, రద్దు గానీ ఆ రూల్ కింద అంతకుముందు చేసినపనులపై ప్రభావం చూపించరాదు.


(2) ఈ చట్టం కింద చేసిన ప్రతి నిబంధనను, నోటిఫై చేసిన వెంటనే రాష్ట్రప్రభుత్వం విధానసభ ముందు ఉంచాలి.


30. (1) ఈ చట్టంలోని నిబంధనల అమలుకు ఎలాంటి అవరోధం ఎదురయినా కేంద్రప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం కానిరీతిలో ఆ అవరోధాలను తొలగించేందుకు అవసరమనిపించిన రీతిలో అధికారి గెజిట్లో ఉత్తర్వులను ప్రచురించడం ద్వారా తగిననిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచీ రెండేళ్ల తర్వాత ఈ రకమైన ఉత్తర్వులనుప్రచురించేందుకు వీలులేదు.


(2) ఈ సెక్షన్ కింద ప్రచురించిన ప్రతి ఉత్తర్వును పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి.


31. సమాచార స్వేచ్ఛ చట్టం, 2002 దీనితో రద్దయిపోయింది.
మొదటి షెడ్యూలు 


(సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (3) చూడండి) 
ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ స్వీకరించాల్సినపదవీ ప్రమాణం. ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన...అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి,చట్ట ప్రకారం ఏర్పాటయిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం,సమగ్రతను పరిరక్షిస్తానని , నాకు సాధ్యమైనంతవరకు విచక్షణతో, విజ్ఞానంతో, విశ్వాసంగా భయ, పక్షపాత, దురభిప్రాయరహితంగాపదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.


రెండో షెడ్యూల్ 
సెక్షన్ 21 చూడండి 


కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలు 


1. ఇంటలిజెన్స్ బ్యూరో
2. క్యాబినెట్ సెక్రటేరియల లోని రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)
3. రెవిన్యూ ఇంటలిజెన్స్ డైరక్టరేట్
4. సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో
5. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్
6. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో
7. ఏవియేషన్ రీసెర్చి సెంటర్
8. స్పెషల్ ప్రాంటియర్ ఫోర్స్
9. సరిహద్దు భద్రతాదళం
10. కేంద్ర రిజర్వు పోలీసు బలగం
11. ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్
12. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం
13. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
14. అస్సాం రైఫిల్స్
15. స్పెషల్ సర్వీస్ బ్యూరో
16. స్నెషల్ బ్రాంచ్ (సిఐడి) అండమాన్, నికోబార్
17. క్రైం బ్రాంచి సిఐడి - సిబి, దాద్రానగర్ హావేలీ
18. స్పెషల్ బ్రాంచి, లక్షద్వీప్ పోలీస్ 

Tuesday, November 11, 2014

ఆదివాసీ సమూహాలను సంక్షోభంలోనికి నెట్టివేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయం సహాయం కోరుతున్నది..  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతంగాన్నా ఆదుకొని.. భవిష్యత్ లో ఆ దిశగా ఆలోచించకుండా ఆసరా ఇవ్వలాని వెడుకుంటున్నారు...ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి పత్తి రైతులు పంటపోలలోనే ఉరితాళ్లాకు వేలాడుతున్నారు...పురుగుమందు తాగుతూ కుటుంబానికి తీరని కష్టం తెచ్చిపెడుతున్నారు...
....ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామం రత్నపురి శ్రీనివాస్ ...ఐదు ఎకరాల్లో  పత్తి పంట పండిస్తున్నాడు..పంటకోసం రెండు లక్షల అప్పు చేసాడు... ఈ సారి వర్షబావ పరిస్థితుల కారణంగా పంట సరిగా పండలేదు.. అరకోరగా వచ్చిన పంటను అమ్మేందుకు సిసిఐ కి తిసుకేళ్తే తేమ శాతం పెరుతో కనీస మద్దతు ధరకు తక్కువకు తిసుకున్నారు...ధళారుల దగ్గరికేళ్తె పరిస్థితి మరింత గోరం.. గత సంవత్సరం తిసుకున్న అప్పులు ఈ సారి అప్పులు తలకు మించిన బారంగా మారాయి..దింతో అదే పత్తి చెన్లో చెట్టుకు ఉరేసుకోని ఆత్మహత్య చెసుకున్నాడు...శ్రీనివాస్ కు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు...ఇప్పుడు మిగిలిన పంటను ఇంటికి తెచ్చుకుందామన్నా కూలిలు ఎవరు రావడం లేదని వాపోతుంది ఆ కుటుంబం .. రైతు ఉరేసుకున్న పంటచేన్లోకి  రావడానికి కూలిలు బయపడుతుండడంతో పుట్టేడు దుఃఖంలోనే ఆ కుటుంబం మొత్తం చేనుకు వెల్తూ పంట తెచ్చుకుంటున్నారు...జిల్లాలోని వెనుకబాటుతనంతో సరైన చైతన్యం లేక..ఇటు కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి ...ఉర్లోవారి తోడ్పాటు లేక రైతు కుటుంబాలు  తివ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాయు...
.. రైతు శ్రీనివాస్ కుటుంబాన్ని జస్టిస్ చంద్రకుమార్,సిపిఎం నేత బండి దత్తాత్రి ఇతర రైతు సంఘ నేతలు పరామర్శించి..కుటుంబంలో అత్మ స్థైర్యం నింపే ప్రయత్నం చేసారు... ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతుల పరిస్థితి ఇవే కాకుండా కౌలు రైతాంగం పరిస్థితి నానాటికీ మరింత దారుణంగా తయారవుతున్నది. సమా జంలో గౌరవంగా బతకాలనే ఆకాం క్షతో కొద్దిపాటి భూమి గల పేద రైతులు- రక రకాల కారణాలతో స్వయంగా వ్యవసాయం చేసుకోలేని వారి భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. అయితేకేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూలరైతు వ్యతిరేక ప్రపంచీకరణ విధానాల వల్ల వ్యవసాయ రంగానికి సబ్సిడీలను ఉపసంహరించాయ్
.... ఆత్మహత్యలకు ప్రాధాన కారణం వ్యవసాయానికి కీలకమైన విత్తనాలుఎరువుల సరఫరాలో బడా బహుళ జాతి (ఎం.ఎన్‌.సి.) కంపెనీల పట్టు పెరుగుతున్నది. ఫలితంగా విత్తనాలుఎరువులుపురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యవసాయంపై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. రైతులకు ఆదాయం తగ్గుతున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్స్‌డీనష్టపరిహారం కౌలు రైతులకు అందించలేక పోతున్నది.

...రైతు ఆత్మహత్యల నేపథ్యాన్నిఆకలి చావుల నేపథ్యాలను వేరువేరుగా చూడాల్చి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉన్న సారూ పత్యలను గమనిస్తే ఈ రెండూ కూడా భారత వ్యవసా యరంగంలో తీసుకుంటున్న విధానాల ఫలితమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విధాన నిర్ణే తలు వ్యవసాయరంగంపై వహిస్తున్న నిర్లక్ష్యం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలనుముఖ్యంగా భూమిలేని పేదవర్గాలనుచిన్నసన్నకారు రైతాంగాన్ని,  ఆదివాసీ సమూ హాలను సంక్షోభంలోనికి నెట్టివేస్తోంది. రాష్ట్రంలోని ఆదిలాబా ద్‌లాంటి నేలల ఆదివాసీప్రాంతాలలో కూడా సాంప్రదాయ ఆహార పంటల స్థానంలో పత్తి పంటల ప్రవేశం దీనికి పెద్ద ఉదా హరణ. ఫలితంగా ఒక కనిపించిన సంక్షోభం అక్కడి ఆదీవాసీ సమూహాన్ని నిశ్శబ్దంగా నిర్మూలిస్తోందిఆహారలేమి తీవ్ర స్థాయిలో ఉంది దానితో రక్తహీనతతో చనిపోతున్న గర్భిణులునవజాత శిశువుల సంఖ్య ప్రమాదకరంగా ఉంది..........

Saturday, August 16, 2014

గిరిజనులు...ఎం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తు ఉండిపోయారు...........

ఆదివాసి జిల్లా ఆదిలాబాద్ లో మెరుగైన వైద్యసెవలందించేందుకు ఎర్పాటు చెసిన రిమ్స్ వైద్య కళాశాల ఆ దిశలో మాత్రం అడుగేయడంలేదు...ప్రారంభం అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానే లేదు...సౌకర్యాల కోరత,సిబ్బంది ఇక్కడ పనిచేసేందుకు ఇష్టపడక ట్రన్స్ ఫర్లు చెసుకోని వెల్తుండడం .బస్టాండ్ లలో ఉండే పబ్లిక్ టాయిలెట్లలో కంటే దారుణమైన కంపు ఆసుపత్రి నిండా ఆవరించి అక్కడి అపరిశుభ్ర పరిసరాల స్థాయి తెలుపుతాయు....
... ఆస్పత్రిలో వైద్యుల కొరత, పారిశుధ్య, అస్తవ్యస్త నిర్వహణ, పరికరాలు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన లీడర్లు కాంట్రక్టర్ల అండగా ఉండడం , అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కడ ఉండేందుకు వారు విముఖత చూపుతున్నారు. గత ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధిని గాలికొదిలేసింది. నిధులు మంజూరులో వివక్ష చూపడంతో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందలేదు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వమైన రిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యులు నియమించి, అన్ని రకాల వసుతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్  హాస్పిటల్ కి గడ్డుకాలం దాపురించింది. అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్.. ప్రస్తుతం వైద్యులు , నర్సులు ఇంటిదారి పడుతుండడంతో  అగమ్యగోచరంగా మారింది. జిల్లావాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని  2008లో రూ.121 కోట్లతో రిమ్స్ ప్రారంభించారు. రిమ్స్ ఆస్పత్రి మొదటినుండి అసౌకర్యాలతోనే కోనసాగుతుంది. ఆస్పత్రిలో 21 విభాగాలకు 148 వైద్య పోస్టులు మంజూరు చేశారు. కానీ ఈ పోస్టులు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు.

వాయిస్... ఇప్పటికి రిమ్స్ లో  83 డాక్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన విభాగాలకు ప్రొఫెసర్లు లేరు. మెడిసిన్ మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, ఫార్మాకాలేజీ, డెంటిస్టులో ఐదుగురు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. వైద్యం, విద్యా బోధన చేయడంలో ప్రొఫెసర్లదే కీలకపాత్ర. హాస్పిటల్ లో వైద్యులు వెళ్లిపోతుండడంతో రిమ్స్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
 బైట్...
వాయిస్... నెల రోజుల్లో రిమ్స్ నుంచి 10 మంది వైద్యులు వెళ్లిపోయారు. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, మైక్రోబయోలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ హంసన్, డెంటిస్టు అనిల్‌కుమార్, ఫార్మకాలజీ అసిస్టెం ట్ ప్రొఫెసర్ మహ్మద్‌షాకీర్, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెంగుల్‌వార్‌లతోపాటు పలువురు వైద్యులు విధుల కాలపరిమితి ఉన్నా విధుల నుంచి తప్పుకుంటున్నారు.

. రిమ్స్‌లో పనిచేసే వైద్యులకు భారీగా వేతనాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు ప్రొఫెసర్లకు రూ.లక్ష, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.90 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.75 వేలు, ట్యూటర్లకు రూ.40 వేలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నా రిమ్స్‌లో వైద్యులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా ఎవరు రావడం లేదు. దీనికి కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్యం. వెనుకబడిన జిల్లాకు దూరభారంతోపాటు, ఇక్కడ వసతులు ఉండవనే భావనతో వైద్యులు రావడం లేదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇక్కడి కంపు వాతావరణాన్ని చూసి బయపడి రిమ్స్ ని రిజక్ట్ చెస్తున్నారు....

... పాలకుల నిర్లక్ష్యమే రిమ్స్‌కు శాపంగా మారుతోంది. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా.. వైద్యులకు రూ.లక్షల వేతనాలు చెల్లిస్తున్నా.. ఆస్పత్రి తీరు మారడం లేదు. రిమ్స్‌లో 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా సౌకర్యాలు, వైద్యం రోగులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. అత్యాధునిక హంగులతో భవనాలు నిర్మిస్తున్నప్పటికి రోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
....

... లోకల్ ఎంఎల్ఎ ప్రస్థుత మంత్రి జోగు రామన్న అండదండలున్న కాంట్రక్టర్లు ఇక్కడి పనులు చెయుస్తుండడంతో ..వారు ఎలాంటి సర్విస్ అందించినా అడిగేవారే ఉండరు... జితాలు సరిగా ఇవ్వక మొన్నటిదాక పారిశుద్య కార్మికులు సమ్మలె ఉండడంతో రిమ్స్ ఆవరణ కంపు కోట్టింది... వారిని సమ్మెనుండి విరమింపచేసిన తరువాత అదే పరిస్థితి నెలకోంది...ఆసుపత్రి ఆవరణ మొత్తం చెత్తా , చెదారం, వాడి పడెసిన బ్యాండెజిలు..రక్తపు మరకలు  ఉండడంతో ఇక్కడికి వెల్లే రోగులకు కోత్త రోగాలు వస్తున్నాయ్,...కాంట్రక్టులన్ని స్థానిక రాజకీయ నేతలు పంచుకోవడంతో ఎ పని జరగడం లేదు...  కోత్తగా వచ్చిన కలెక్టర్ లకు ఫిర్యాదులు అందడం ఆకస్మిక తనిఖి నిర్వహించడం....అక్కడి పరిస్థితి చూసి అవక్కవడం..హాస్పిటల్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం కామన్ గా మారిపోయింది....బాత్రుంలలో నిళ్లు లేకపోవడం...ఎక్కడ చూసినా చెత్తా చేదారంతో నిండి ఉండడం చూసి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. కాని కాంట్రక్టర్లను మాత్రం ఎమీ చేయలేకపోవడంతో ఈ హస్పిటల్ కంపుగానే ఉండిపోతుంది.....దినికి తోడన్నట్టు. నిత్యం ఆందోళనలతో , సిబ్బంది సమ్మె నినాదాలతో రోగులను హడలెత్తిస్తుంటారు..
...మొన్నటికి మొన్న అగస్టు మొదటివారంలో ఆసుపత్రిలో చుక్క నీరు లేక... ఆపరేషన్ లు సైతం ఆగిపోయాయు...ఎమర్జేన్సి ఉండి బ్లిడింగ్ అవుతున్న పెషెంట్ లకు నీళ్లు లేక డాక్టర్లు అపరేషన్ చెయలేకపోయారు..మీడియా వెల్లి హాడావిడి చెసినా పట్టించుకునే వాడే కరువయ్యారు..అక్కడికి వచ్చిన రోగులంత గిరిజనులు.... రోగులు వారి బందువులు ఎం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తు ఉండిపోయారు.... అదే ఇంకోచోట అయి ఉంటే పెద్ద గోడవ చెసుండేవారు...కాని అమాయక గిరిజనులకు అవేం  తెలియవు....అదే ఇక్కడి రాజకీయ నాయకులకు అలుసైంది...
....ఓ వైపు హాస్పిటల్ లో నిళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..హాస్పిటల్ యంత్రంగం జిల్లా మంత్రి జోగురామన్నకు అదేరోజు ...అదే రిమ్స్ లో సన్మన కార్యక్రమం ఎర్పాట్లలో నిమగ్నమయ్యారు....మంత్రిగారు వచ్చి అదే ఆపరేషన్ థియెటర్ పక్కన శాలువాతో సన్మానం చెయించుకోని సమస్యను కనీసం అడగి తెలుసుకోకుండానే అక్కడినుండి హాడావుడి గా వెల్లిపోయాడు...ఎందుకంటే అదే రోజు ఆయనకు ఆదిలాబాద్ లో వేరే సన్మాన కార్యక్రమాలున్నాయ్......
... రోగులు వారితో పాటు వచ్చేవారకి ముక్కుకు కర్చిఫ్ లేనిదే హస్పిటల్ లో అరనినముషం కూడా ఉండలేని పరిస్థితి... బాత్రుంలు క్లీన్ చెసెందుకు సైతం నిళ్లు లేక ఎక్కడ చూసినా గలిజుగానే ఉంటుంది..

.....ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోతుంది. జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా ఉన్నప్పటికీ రిమ్స్‌ కళాశాల ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అండంలేదు. 2004 సంవత్సరంలో 120 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన ఈ వైద్య కళాశాల  సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు... సరైన వైద్యులు లేక ప్రజలకు వైద్య సేవలు అందకపోవడంతో ప్రతి చిన్న జబ్బులకు హైదరాబాద్‌, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాలతో పాటు కడపలో ప్రారంభమైన రిమ్స్‌ కళాశాల పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాల ఇంకా ఎక్కడ వెసిన గోంగడి అక్కడే అన్న చందంగా ఉంది...


....  ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కానిఇటు జిల్లా యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలకు శాపంగా మారింది. పేరుకు మాత్రమే రిమ్స్‌ కళాశాల ఉందని, రిమ్స్‌ కళాశాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. కీలక మైన విభాగాలలో వైద్యులు లేక పేద ప్రజలకు వైద్యం అందడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స చేయకపోవడంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతూ మహారాష్ట్రలోని నాగపూర్‌,యావత్‌మల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు కొద్ది పాటి వైద్యం కూడా అందడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడంతో తరుచుగా విధులను బహిష్కరించడంతో ప్రజలకు వైద్య సేవలందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
...జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలతో నిర్మించి నాటి ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించిన రీమ్స్‌ కళాశాలను కష్టాల నిత్యం వెంటాడుతున్నాయ్... వసతుల లేమి, కళాశాలలో డైరెక్టర్‌ల మధ్య సమన్వయ లోపం గ్రూపు విబేదాలు తోడై అటు రోగులకే కాకుండా విద్యార్థులకు ...రోగులకు  తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయు....
....  కాలేజిలోని మొదటి బ్యాచ్ ఎంబిబిఎస్ పూర్తి చెసుకోని బయటకు వచ్చింది కాని ఇంకా అరకోర వసతులతోనే అంతా సాగిపోతుంది.... 2008 ఫిబ్రవరి 01న శంఖు స్థాపన గావించబడ్డ రీమ్స్‌కు అదే సంవత్సరం వైయస్‌ఆర్‌ శంఖు స్థాపన చేసి ప్రోఫెసర్లకు మెరుగైన జీతాలను అందిస్తున్నామని ప్రకటించినప్పటికి ఆతర్వాతి కాలంలో రీమ్స్‌ డైరెక్టర్‌తో పాటు రిజిష్టార్‌లకు మధ్య గ్రూపు తగాదాలు రావడం అవి చిలికిచిలికి గాలివానలా మారడం ఇక్కడ సర్వసాదారనం....ఇప్పటికైనా వెనుకబడిన జిల్లా ప్రజలకు ఆదునిక వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రిమ్స్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు
.
...రిమ్స్ లో వైద్య సేవలందించాల్సిన వైద్యులంతా బయట క్లినిక్ లు నడుపుకుంటుండడంతో ...ఇక్కడికి వచ్చే రోగులను సరిగా పట్టించుకోకుండా వారి క్లినిక్ లకు రమ్మంటు రిఫర్ చెస్కుంటారు....ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజనులే ఉండడంతో ఎక్కువ మందికి సరైన వసతులు లేకపోవడంతో విషజ్వరాల బారిన పడుతుంటారు...వారంత ఇక్కడి రిమ్స్ కి వచ్చినా సిబ్బంది , వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో మృత్యవాతపడుతున్నారు....పక్కనే ఉన్న మహారాష్ట్ర కు వెల్లి అక్కడ వైద్యం చెయించుకుంటున్నారు.....
...

:జిల్లాలో వైద్యానికి పెద్ద దిక్కైనటువంటి రిమ్స్ తరచూ వివాదాలతో కోట్టుమిట్టాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది...ఇప్పటికైన కోత్త ప్రభుత్వం.. వైద్యశాఖ అధికారులు స్పందించి...హస్పిటల్ కాంట్రక్టర్ల పై ప్రెమ తగ్గించి..వివాదాలకు చెక్ పెట్టకపోతే రిమ్స్ గిరిజన రోగుల పాలిట విషంగా మారే అవకాశముంది...